E-Paper
Advertisement

ఇల్లే ఇక సినిమా హాల్.. బేస్ అంటే ఇదబ్బా!

ఇల్లే ఇక సినిమా హాల్.. బేస్ అంటే ఇదబ్బా!
Advertisement

Best Home Theatre Brands In India: ఇంట్లోనే.. థియేటర్ లాంటి ఎక్స్‌పీరియన్స్ కావాలా? సినిమా చూసినా, నచ్చిన పాటలు విన్నా బేస్ అదిరిపోవాల్సిందేనా? అయితే మీకోసం బెస్ట్ హోమ్ థియేటర్ బ్రాండ్స్ వివరాలు.. కేవలం సౌండ్ మాత్రమే కాదు, క్రిస్టల్ క్లియర్ ఆడియో, అదిరిపోయే.. డిజైన్‌తో ఇల్లాంటి రూమ్‌ను కాస్తా సినిమా హాల్‌లా మార్చేసే.. టాప్ 5 హోమ్ థియేటర్ బ్రాండ్స్, వాటి ప్రత్యేకతలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. కానీ.. టీవీ స్పీకర్ల సౌండ్ మనకు ఆ థియేటర్ ఫీలింగ్‌ను ఇవ్వలేదు. అందుకే చాలామంది ఒక మంచి హోమ్ థియేటర్ సిస్టమ్ కోసం సెర్చ్ చేస్తుంటారు. ఇండియాలో ప్రస్తుతం టాప్‌లో దూసుకుపోతున్న 5 బెస్ట్ హోమ్ థియేటర్ బ్రాండ్స్ గురించి వివరాలు..

1.Sony (సోనీ):

Advertisement

హోమ్ థియేటర్ అనగానే చాలా మందికి గుర్తొచ్చే.. మొదటి పేరు ‘సోనీ’. దశాబ్దాలుగా ఇండియన్ మార్కెట్‌లో ఈ బ్రాండ్‌కు తిరుగులేదు. సోనీ ఇచ్చే రియల్ 5.1 ఛానల్ సరౌండ్ సౌండ్, డాల్బీ డిజిటల్ టెక్నాలజీ సినిమాలోని.. ప్రతీ చిన్న శబ్దాన్ని కూడా స్పష్టంగా వినిపిస్తుంది. దీని ప్రత్యేకతలు క్లియర్ ఆడియో, బెస్ట్ ఇన్ క్లాస్ బిల్డ్ క్వాలిటీ, సాలిడ్ బేస్. బడ్జెట్ కొంచెం ఎక్కువైనా థియేటర్ లాంటి పక్కా ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే.. వారికి ఇది బెస్ట్.

2.JBL(జేబీఎల్):

మీకు పార్టీ సాంగ్స్ ఎక్కువ ఇష్టమా? బేస్ అదిరిపోవాలా? అయితే.. మీ ఛాయిస్ జేబీఎల్. ఈ బ్రాండ్ హోమ్ థియేటర్స్, సౌండ్ బార్స్ వాటి పవర్‌ఫుల్ సబ్‌వూఫర్స్‌కు కేరాఫ్ అడ్రస్. జేబీఎల్ నుంచి వచ్చే ‘సినిమా సిరీస్’ మోడల్స్ ఇండియాలో.. విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్నాయి. దీని లోని ప్లస్ పాయింట్స్.. డీప్ బేస్, వైర్‌లెస్ కనెక్టివిటీ, ట్రెండీ లుక్. లౌడ్ మ్యూజిక్, బేస్ హెవీ సాంగ్స్ ఇష్టపడేవారికి కూడా ఇది ఫర్పెక్ట్ ఛాయిస్.

3.Philips (ఫిలిప్స్):

Advertisement

మరీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా.. నమ్మకమైన బ్రాండ్ కావాలంటే.. ఫిలిప్స్ బెస్ట్ ఛాయిస్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు దశాబ్దాలుగా.. హోమ్ అప్లయన్సెస్ అందిస్తున్న ఫిలిప్స్, హోమ్ థియేటర్ విభాగంలోనూ సూపర్ సక్సెస్ అయింది. తక్కువ ధర, మల్టీ-కనెక్టివిటీ ఆప్షన్స్, ఎక్కువ రోజులు పాడవకుండా ఉండటం అనేవి దీని ప్రత్యేకతలు. తక్కువ బడ్జెట్‌లో మంచి సరౌండ్ సౌండ్ సిస్టమ్ ఆశించే చిన్న కుటుంబాలకు ఇది బెస్ట్.

4.boAt(బోట్) :

ప్రస్తుతం ఆడియో మార్కెట్‌ను రూల్ చేస్తున్న ఇండియన్ బ్రాండ్ ‘boAt.తక్కువ ధరలోనే ప్రీమియం డిజైన్, స్మార్ట్ ఫీచర్లను అందించడం వీరి స్పెషాలిటీ. బోట్ ఆవాంతే సిరీస్ సౌండ్‌బార్లు, హోమ్ థియేటర్లు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. అల్ట్రా-మోడ్రన్ లుక్, బడ్జెట్ ఫ్రెండ్లీ, ఈజీ రిమోట్ కంట్రోల్, డాల్బీ ఆడియో సపోర్ట్. తక్కువ ధరలో స్టైలిష్ లుక్, లేటెస్ట్ టెక్నాలజీ కావాలనుకునే యూత్‌కు ఇది ఫర్ఫెక్ట్.

5. Bose (బోస్):

సౌండ్ క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ వద్దు, లగ్జరీ ఎక్స్‌పీరియన్స్ కావాలి అనుకుంటే ‘బోస్’కు సాటిలేదు. దీని ధర చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇది ఇచ్చే ‘ప్యూర్ ఆడియో ఎక్స్‌పీరియన్స్’ నెక్స్ట్ లెవెల్. చిన్న స్పీకర్ల నుంచే ఊహించని రేంజ్ సౌండ్ అవుట్‌పుట్ రావడం దీని ప్రత్యేకత. ప్రీమియం సిగ్నేచర్ ఆడియో, అద్భుతమైన క్లారిటీ, కాంపాక్ట్ సైజ్ దీనికి మరింత ఫైప్ ఇస్తున్నాయి. బడ్జెట్ లిమిట్స్ లేని ఆడియో లవర్స్‌కు ఇది బెస్ట్.

Related News

ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. Airtel టాప్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇవే!

2-పిన్, 3-పిన్ ప్లగ్‌ల మధ్య తేడా ఏంటి? ఇవి కేవలం డిజైన్ కోసమేనా లేక సేఫ్టీ కోసమా?

ల్యాప్‌టాప్ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే షట్ డౌన్ చేయాలా? లేదా స్లీప్ మోడ్ బెటరా?

ఫోన్ ఛార్జ్ ఇట్టే పోతుందా? ఈ యాప్స్ ఏ కారణం!

120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!

10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్

రూ.849కే పోర్టబుల్ స్పీకర్..సౌండ్ వింటే మైండ్ బ్లాక్!

రూ.699కే ఫైర్‌బోల్ట్ ఇయర్‌బడ్స్..అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×