Best 5g Phone Under 10000: 5G టెక్నాలజీ రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో 5జీ ఫోన్లకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే వినియోగదారుల కోసం బడ్జెట్ ఫోన్లలో కూడా 5G ఫీచర్లను తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐటెల్ సంస్థ కొత్త బడ్జెట్ ఫోన్ Itel A95 5Gని మార్కెట్లోకి లాంట్ చేసింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందిస్తూ, ఆండ్రాయిడ్ 14, 50MP కెమెరా, AI టూల్స్, 120Hz డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్లతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ ప్రత్యేకతలు, ఫీచర్లు, డిజైన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డిస్‌ప్లే
ఈ ఫోన్‌లో 6.67-అంగుళాల HD+ పంచ్-హోల్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. అంటే స్క్రోల్ చేయడంలో, గేమ్స్ ఆడడంలో చాలా స్మూత్ ఫీల్ ఉంటుంది. పైన PANDA గ్లాస్‌తో ప్రొటెక్షన్ ఉంది, ఇది స్క్రాచ్‌లు, చిన్న డ్రాప్స్ నుంచి స్క్రీన్‌ను కాపాడుతుంది. ఇంకా, IP54 రేటింగ్ ద్వారా ధూళి, నీటి చిటపాట్ల నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది.
భయపడాల్సిన అవసరం లేదు!
ఐటెల్ A95 5Gకు 100 రోజుల ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్ ఉంది. అనుకోకుండా స్క్రీన్ పగిలినా కంపెనీ బాధ్యత తీసుకుంటుంది.
శక్తివంతమైన ప్రాసెసర్, తాజా ఆండ్రాయిడ్ OS
ఐటెల్ A95 5Gలో MediaTek Dimensity 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది బడ్జెట్ సెగ్మెంట్లో మంచి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చే చిప్‌సెట్‌గా గుర్తింపు పొందింది. మొబైల్ మల్టీటాస్కింగ్, యాప్స్ స్మూత్‌గా నడవడం, వీడియో కాలింగ్, సామాజిక మాధ్యమాలు, గేమింగ్ మొదలైన పనులకు ఇది తగిన విధంగా పనిచేస్తుంది. ఇది Android 14 OS పై రన్ అవుతోంది. అంటే తాజా సెక్యూరిటీ ఫీచర్లు, మెరుగైన UI అనుభూతి, కొత్త AI టూల్స్ అన్నీ లభిస్తాయి.
Read Also: Baba Vanga: బాబా వంగా భయానక జోస్యం..మనిషి మనసుని …
AI టూల్స్
ఈ ఫోన్‌లో AI టూల్స్ నిజంగా బాగా ఆకట్టుకుంటాయి. ఇందులో “iVAna AI Assistant” అనే సొంత వాయిస్ అసిస్టెంట్ ఉంది. ఇది రిమైండర్స్, కాల్ చేయడం, నావిగేషన్ గైడ్ చేయడం వంటి పనుల్లో సహాయపడుతుంది. ఇంకా ఇంటిగ్రేటెడ్‌గా ఉన్న “Ask AI” అనే ఫీచర్ సాయంతో మీరు కంటెంట్ రైటింగ్, వ్యాకరణ తనిఖీలు, విషయాల సారాంశం తీసుకోవడం వంటి పనులను కూడా చేయవచ్చు. ఇది సాధారణంగా రూ. 20,000 ఫోన్లలో కనిపించే టూల్, కానీ ఐటెల్ దీన్ని బడ్జెట్ సెగ్మెంట్లో అందించటం గొప్ప విషయం.
కెమెరా సెటప్
ఫోన్ వెనుక భాగంలో 50MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో AI ఫీచర్లు, Vlog మోడ్, స్కై ఎఫెక్ట్స్, డ్యూయల్ వీడియో రికార్డింగ్ వంటి ఆకర్షణీయమైన మోడ్‌లు ఉన్నాయి. బడ్జెట్ ఫోన్ అయినా, కెమెరా మోదరేట్-గానే కాకుండా క్రియేటివ్‌గా ఉపయోగపడేలా రూపొందించారు. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 2K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫీచర్ బడ్జెట్ ఫోన్లలో చాలా అరుదు.
డే లాంగ్ బ్యాటరీ + బ్యాలెన్స్‌డ్ ఛార్జింగ్
ఐటెల్ A95 5Gలో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది రెగ్యులర్ యూజ్‌తో ఫుల్ డేపాటు వస్తుంది. మల్టీటాస్కింగ్, వీడియో స్ట్రీమింగ్, కాల్స్ ఇవన్నీ చేసినా కూడా బ్యాటరీ అయిపోవడానికి టైం పడుతుంది. ఛార్జింగ్ పరంగా ఇది 10W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
అదనపు ఫీచర్లు
-సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ – వేగంగా ఫోన్ అన్‌లాక్ చేసేందుకు.
-ఫేస్ అన్‌లాక్ – ముందు కెమెరాతో ముఖాన్ని స్కాన్ చేసి వెంటనే లాగిన్ అయ్యేలా
-డ్యూయల్-బ్యాండ్ Wi-Fi సపోర్ట్ – వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీకి.
-ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్ – TV, AC వంటి హోమ్ అప్లయన్స్‌లను రిమోట్‌గా కంట్రోల్ చేయడానికి.
-7.8mm సన్నని బాడీ – స్టైల్‌గా కనిపించేట్టు, చేతిలో చక్కగా పట్టుకోగలిగేట్టు డిజైన్
ధర ఎలా ఉందంటే..
-ఐటెల్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్‌లలో లభిస్తోంది
-4GB RAM + 128GB స్టోరేజ్ – రూ.9,599
-6GB RAM + 128GB స్టోరేజ్ – రూ.9,999
-రెండు వేరియంట్‌లలోనూ వర్చువల్ RAMకు సపోర్ట్ లభిస్తుంది. అంటే, 4GB మోడల్‌ను 8GB వరకు, 6GB మోడల్‌ను 12GB వరకు RAM వరకు పెంచుకోవచ్చు.