BigTV English

Flight Hijack: విమానం హైజాక్ చేసిన దుండగుడు.. తుపాకీతో కాల్చి చంపిన హీరో

Flight Hijack: విమానం హైజాక్ చేసిన దుండగుడు.. తుపాకీతో కాల్చి చంపిన హీరో

Belize Flight Hijack| ఒక విమానం గాల్లో ఉండగా.. ప్రయాణికుందరినీ భయపెడుతూ ఓ దుండగుడు కత్తితో దాడులు చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. అయితే ఆ విమానంలో ఉన్న ఓ ప్యాసింజర్ హీరోలా ఎంట్రీ ఇచ్చి అందరినీ కాపాడాడు. కానీ ఆ దుండగుడు చనిపోయాడు. ఈ ఘటన అమెరికాకు సమీపంగా ఉన్న బెలైజ్ అనే దేశంలో గురువారం ఏప్రిల్ 16 2025న జరిగింది.


వివరాల్లోకి వెళితే.. మధ్య అమెరికా ప్రాంతంలో ఓ చిన్న దేశం బెలైజ్. ఈ దేశానిక మెక్సికో, కరేబియన్, గ్వాటెమాలా దీవులు సరిహద్దులుగా ఉన్నాయి. బెలైజ్ లోని ఫిలిప్ ఎస్‌డబ్లూ గోల్డ్ సన్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ నుంచి ఆ దేశంలోని సాన్ పెడ్రో అనే పట్టణానికి ఓ చిన్ని విమానం ప్రయాణిస్తుండగా.. అందులో ఓ 49 ఏళ్ల ప్రయాణికుడు విమానంలో లేచి అటూ ఇటూ తిరిగాడు. ఆ తరువాత అదును చూసి తన వద్ద ఉన్న కత్తితో విమాన సిబ్బందిని బెదిరించాడు. విమానం అమెరికా దేశానికి తీసుకువెళ్లాలని.. వెంటనే ఆ దిశగా మళ్లించాలని చెప్పాడు.

కానీ విమాన సిబ్బంది అతడు చెప్పినట్లు చేయలేదు. దీంతో అతను విమానంలో కూర్చొని ఉన్న ప్రయాణికులను కొట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అతడిని ప్రతిఘటించిన వారిపై కత్తితో దాడులు చేశాడు. ఈ క్రమంలో ముగ్గురికి కత్తితో గాయాలు కాగా.. రక్త స్రావమైంది. ఈ పరిస్థితి విమానంలో దాదాపు ఒక గంట 40 నిమిషాల పాటు సాగింది. ఉదయం 8 గంటలకు విమానం గాల్లో టేకాఫ్ కాగా.. 8.30 గంటలకు అతను దాడి చేశాడు. విమానం సాన్ పెడ్రో పట్టణ విమానాశ్రయానికి ఉదయం 10.12 గంటలకు చేరుకుంది. కానీ విమానం ల్యాండ్ అయ్యే పరిస్థితులు లేవు.


అయితే ఇంతసేపు దాడి చేసిన ఆ దుండగుడు విమానం అమెరికా వైపు పయనిస్తోందని భావించాడు. కానీ సాన్ పాడ్రో చేరుకుందని తెలియగానే విమాన సిబ్బంది అయిన ఎయిర్ హోస్టెస్ ను బందీగా తీసుకొని ఆమెను చితకబాదాడు. అయితే ఈ ఘటన మొత్తం విమానంలో ప్రయాణికుడిగా ఉన్న ఒక వ్యక్తి ప్రశాంతంగా గమనిస్తున్నాడు. విమానం ఇక సాన్ పాడ్రో చేరుకుందని అతనికి తెలిసి అదే సరైన సమయంగా దుండుగుడిపై ప్లానింగ్ తో అటాక్ చేశాడు. దీంతో వారిద్దరి మధ్య బాహాబాహీ జరిగింది. అయితే దుండగుడు తన వద్ద ఉన్న తుపాకీ బయటికి తీశాడు. కానీ దాన్ని ఆ ఫైటింగ్ చేసే యువ ప్రయాణికుడు అతడి చేతుల్లోంచి లాగేసుకుని అతని ఛాతీ భాగంలో కాల్పులు చేశాడు.

దీంతో ఆ దుండగుడు అక్కడికక్కడే మరణించాడు. ఆ తరువాత విమాన పైలట్లు సాన్ పెడ్రో విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయగా.. పోలీసులు విమానంలో ఉన్న అందరినీ సురక్షితంగా బయటికి తీశాడు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటన గురించి మొత్తం వివరాలు తెలుసుకున్న బెలైజ్ పోలీస్ కమిషనర్ చెస్టర్ విలియమ్స్ ఆ దుండుగుడు ఒక అమెరికా పౌరుడని. నల్ల జాతీయుడని తెలిపాడు. అతని పేరు అకిన్‌యేలా సావా టేలర్ అని తెలిపారు. టేలర్ కు బెలైజ్ నగరంలో ఎంట్రీ నిషేధం ఉందని అతను గతంలో నేరాలు చేసిన రికార్డులు ఉన్నాయని తెలిపారు. అయితే బెలైజ్ (Belize) దేశంలో రావడానికి నిషేధం ఉన్నా టేలర్ ఎలా ప్రవేశించాడు. హైజాక్ (flight Hijack) చేయడానికి విమానంలో అతను కత్తి, తుపాకీ ఎలా తీసుకువచ్చాడు.. అనేది ఇంకా తెలియలేదు.

Also Read: మతి స్థితిమితం లేని యువకుడిపై కాల్పులు జరిపిన పోలీసులు.. 10 రోజులుగా కోమాలో..

పోలీస్ కమిషన్ విలియమ్స్ దుండుగుడు టేలర్ ని కాల్చి చంపిన ఆ ప్రయాణికుడిని హీరో అంటూ ప్రశంసించారు. టేలర్ గురించి పూర్తిగా విచారణ చేస్తామని.. ఇందుకోసం బెలైజ్ దేశంలోని అమెరికా ఎంబసీ అధికారుల సహకారం కావాలని వెల్లడించారు.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×