E-Paper
Advertisement

తక్కువ బడ్జెట్.. ఎక్కువ మైలేజ్.. రూ.10 లక్షల్లో బెస్ట్ ఆటోమేటిక్ CNG కార్లు ఇవే!

తక్కువ బడ్జెట్.. ఎక్కువ మైలేజ్.. రూ.10 లక్షల్లో బెస్ట్ ఆటోమేటిక్ CNG కార్లు ఇవే!
Advertisement

Best Automatic CNG Cars Under Rs.10 Lakh: సిటీలో రోజూ కారు నడిపే వారికి ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఇప్పుడు ఒక అవసరంగా మారింది. ట్రాఫిక్‌ లో తరచూ క్లచ్ నొక్కాల్సిన ఇబ్బంది లేకుండా ఈజీగా డ్రైవ్ చెయ్యొచ్చు. అదే సమయంలో పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో తక్కువ ఇంధన ఖర్చు గురించి కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. ఈ రెండు అవసరాలను తీర్చే ఆటోమేటిక్ CNG కార్లు ఇప్పుడు మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. రూ.10 లక్షల లోపు బెస్ట్ మోడల్స్ ఏంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం..

1.టాటా టియాగో CNG AMT

ఈ జాబితాలో మొదటగా చెప్పుకోవాల్సింది టాటా టియాగో CNG AMT. ప్రస్తుతం ఫ్యాక్టరీ నుంచి ఆటోమేటిక్ CNGతో వచ్చే అత్యంత సరసమైన కార్లలో ఒకటి. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ CNG ఇంజిన్‌తో పాటు 5 స్పీడ్ AMT గేర్‌ బాక్స్ ఉంటుంది.   CNG మోడ్‌లో ఇది 28.06 కి.మీ/కేజీ వరకు మైలేజీ ఇస్తుంది. ఆన్ రోడ్ ధర సుమారుగా రూ.8.08 లక్షల నుంచి రూ.9.79 లక్షల మధ్య ఉంటుంది. రోజూ ఆఫీస్‌కు వెళ్లేవారికి లేదా నగరంలో ఎక్కువగా ప్రయాణించే వారికి ఇది మంచి ఎంపికగా చెప్పొచ్చు.

2.టాటా ఆల్ట్రోజ్ CNG AMT

Advertisement

కొంచెం ప్రీమియం ఫీలింగ్‌ తో కూడిన హ్యాచ్‌ బ్యాక్ కావాలనుకునేవారికి టాటా ఆల్ట్రోజ్ CNG AMT మంచి ఆప్షన్. ఇందులో కూడా 1.2 లీటర్ ఇంజిన్‌తో పాటు AMT గేర్‌ బాక్స్ లభిస్తుంది. ఇది 26.2 కి.మీ/కేజీ వరకు మైలేజీ ఇస్తుంది. ప్రారంభ ధర సుమారు రూ.9.96 లక్షలు కాగా, కొన్ని టాప్ వేరియంట్లు రూ.10 లక్షలకు కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు. మంచి క్యాబిన్, ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

3.టాటా పంచ్ CNG AMT

SUV లుక్‌తో పాటు తక్కువ ఇంధన ఖర్చు కోరుకునేవారికి టాటా పంచ్ CNG AMT ఆకర్షణీయమైన మోడల్. ఇందులో కూడా 1.2 లీటర్ ఇంజిన్ ఉంది. CNG మోడ్‌లో 26.99 కి.మీ/కేజీ వరకు మైలేజీ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. దీని ఆన్-రోడ్ ధర సుమారుగా రూ.9.74 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్, SUV స్టైల్ కోరుకునే వారికి పంచ్ మంచి ఎంపికగా నిలుస్తోంది.

4.నిస్సాన్ మాగ్నైట్

Advertisement

ఈ జాబితాలో మరో ఆసక్తికరమైన మోడల్ నిస్సాన్ మాగ్నైట్. ఇది ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNGతో రాకపోయినా, కంపెనీ ఆమోదించిన రెట్రోఫిట్ CNG కిట్ ను అమర్చుకునే అవకాశం ఉంది. AMT వేరియంట్‌ తో కూడా ఈ కిట్‌ ను ఉపయోగించవచ్చు. CNGతో దీని మైలేజీ 24.09 కి.మీ/కేజీ వరకు ఉంటుంది. ధర వేరియంట్‌ను బట్టి రూ.7.83 లక్షల నుంచి రూ.11.23 లక్షల వరకు ఉంటుంది.

Read Also: నిస్సాన్ టెక్టన్ కలర్స్ రివీల్.. ఏ వేరియంట్‌ లో ఏ కలర్ దొరుకుతుందంటే?

Related News

హోండా రెబెల్ 500 వచ్చేస్తోంది, కొత్త ఫీచర్లు చూస్తే వారెవ్వా అనాల్సిందే!

ఫ్లిప్‌ కార్ట్‌ లోకి రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ.. ఇక ఇంట్లో నుంచే బుక్ చేసుకోవచ్చు!

టీవీఎస్ అపాచీ RTR 310లో కొత్త అప్‌డేట్.. ఫీచర్లు, ఇంజిన్, ధరలు ఎలా ఉన్నాయంటే?

లాంచ్‌కు ముందే లీకైన MG విండ్సర్ EV ఇండల్జ్ ఎడిషన్.. కొత్త ఫీచర్లు ఇవే!

భారత్‌ లో జపాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు.. 10 వేల యూనిట్లు దాటేసిన అమ్మకాలు!

బ్లాక్ లుక్‌లో టయోటా ఫార్చ్యూనర్.. కొత్త మోడల్ ఏముంది భయ్యా!

ఉద్యోగులకు BMW కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన లేడీ బాస్, అలా చూసి.. చలించిపోయి..

ఈవీలకు పెరుగుతున్న క్రేజ్.. కమర్షియల్ వెహికల్స్ మార్కెట్‌ ఏకంగా 158% జంప్!

Big Stories

Advertisement
×