Hisense UR8S RGB MiniLED TV: ప్రస్తుత కాలంలో పెద్ద స్క్రీన్ టీవీలు కేవలం సినిమాలు చూసేందుకే కాకుండా.. గేమింగ్ , హై-ఎండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ కోసం కూడా విపరీతంగా అమ్ముడవుతున్నాయి. కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా ప్రముఖ టీవీల తయారీ సంస్థ హైసెన్స్ ఇండియాలో తన సరికొత్త ‘UR8S RGB మినీLED TV’ సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇది అల్ట్రా-లార్జ్ స్క్రీన్ సెగ్మెంట్‌లో అద్భుతమైన విజయం సాధించిన టెక్నాలజీని ఇప్పుడు మరింత మెరుగైన ఫీచర్లతో మెయిన్‌స్ట్రీమ్ సైజులను తీసుకొచ్చింది. ఈ టీవీలు డిజైన్ పరంగానే.. కాకుండా పర్ఫార్మెన్స్‌లోనూ అదుర్స్ అనిపిస్తున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా..
55-ఇంచుల మోడల్: ఈ వేరియంట్ ప్రారంభ ధర రూ. 1,19,990 నుంచి అందుబాటులో ఉంది.
65-ఇంచుల, 75-ఇంచుల మోడల్స్: పెద్ద హాల్స్ లేదా హోమ్ థియేటర్ సెటప్ కోరుకునే.. వారి కోసం ఈ సైజులు అందుబాటులో ఉన్నప్పటికీ, వీటికి సంబంధించిన ప్రత్యేక ధరలను కంపెనీ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు రిలయన్స్ డిజిటల్ వంటి ఆఫ్‌లైన్ స్టోర్లలో.. కూడా ఇవి లభిస్తాయి. లాంచ్ ఆఫర్ కింద రూ.10,000 వరకు క్యాష్ బ్యాక్,రెండేళ్ల వారంటీ, జీరో డౌన్ పేమెంట్, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తున్నారు.
హైసెన్స్ UR8S సిరీస్‌లో అత్యంత ముఖ్య మైన హైలైట్ దీని డిస్‌ప్లే టెక్నాలజీ. ఇది నేటివిటీ 180Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల ఫాస్ట్-మూవింగ్ యాక్షన్ సీన్స్, స్పోర్ట్స్, గేమింగ్ ఆడేటప్పుడు ఎలాంటి.. లాగ్ లేని స్మూత్ విజువల్స్ కనిపిస్తాయి. అంతేకాకుండా.. ఇది ఏకంగా 3,500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను కలిగి ఉంటుంది. దీని వల్ల పవర్ ఫుల్ రూమ్స్‌లో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనిలో యాంటీ-గ్లేర్ కోటింగ్ ఉండటం వల్ల టీవీపై లైటింగ్ పడకుండా ఉంటుంది.
ఈ టీవీ ఫర్మామెన్స్ మరింత పెంచడానికి కంపెనీ ఇందులో ‘Hi-View AI Engine RGB’ ప్రాసెసర్‌ను యాడ్ చేసింది. ఇది రియల్ టైమ్‌లో కలర్స్, బ్రైట్‌నెస్ , కాంట్రాస్ట్‌ను ఆటోమేటిక్‌గా ఆప్టిమైజ్ చేస్తుంది. ఇందులోని AI RGB యాంబియంట్ లైట్ సెన్సార్ రూమ్స్ లోని వెలుతురును బట్టి స్క్రీన్ కంట్రోల్స్ సర్దుబాటు చేస్తుంది. అలాగే డాల్బీ విజన్ , ఐమ్యాక్స్ ఎన్‌హాన్స్‌డ్ , ఫిల్మ్ మేకర్ మోడ్ సపోర్ట్ ఉండటం వల్ల థియేటర్ లాంటి రియలిస్టిక్ పిక్చర్ క్వాలిటీ లభిస్తుంది.
Also Read: సౌండ్‌బార్‌లపై అదిరిపోయే ఆఫర్లు..60శాతానికి పైగా డిస్కౌంట్ !
కేవలం వీడియో క్వాలిటీ మాత్రమే కాకుండా.. ఆడియో విషయంలోనూ ఈ టీవీ అద్భుతంగా డిజైన్ చేయబడి ఉంటుంది. ఇందులో 2.1.2 ఛానెల్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ఉండటంతో పాటు డాల్బీ అట్మాస్ సపోర్ట్ లభిస్తుంది. దీని వల్ల ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుంది. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఇది మార్కెట్లో బెస్ట్ స్మార్ట్ టీవీ ఓఎస్‌గా గుర్తింపు పొందిన ‘VIDAA’ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్, ఇన్‌బిల్ట్ అలెక్సా, గూగుల్ హోమ్, ఆపిల్ ఎయిర్‌ప్లే, హోమ్ ఇంటిగ్రేషన్ సపోర్ట్ దీని ప్రత్యేకతలు.
మీరు మీ ఇంటో ప్రీమియం థియేటర్ ఫీల్ పొందాలనుకుంటే.. బెస్ట్ బ్రైట్‌నెస్ ,లేటెస్ట్ ఫీచర్లు ఉన్న హైసెన్స్ UR8S RGB మినీ ఎల్ఈడీ టీవీ ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.