E-Paper
Advertisement

హస్తిన పోరులో తెలంగాణ కీ రోల్‌! రేవంత్‌పై భారీ నమ్మకం పెట్టుకున్న ఏఐసీసీ! ఢిల్లీ పోరులో టీ కాంగ్రెస్‌ హవా!

హస్తిన పోరులో తెలంగాణ కీ రోల్‌! రేవంత్‌పై భారీ నమ్మకం పెట్టుకున్న ఏఐసీసీ! ఢిల్లీ పోరులో టీ కాంగ్రెస్‌ హవా!
Advertisement

రేవంత్‌పై ఏఐసీసీ భారీ నమ్మకాలను పెట్టుకున్నది. అధిష్టానం తనపై పెట్టుకున్న అంచనాలను ఏనాడూ వమ్ము చేయలేదు రేవంత్‌. ఇప్పుడు అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకున్న ఎస్‌ఐఆర్‌, సీఈసీ రాజీనామా కోసం ఇండీ చేస్తున్న పోరాటం విషయంలో కూడా రేవంత్‌ తన పాత్ర పోషించేందుకు రెడీ అయ్యాడు.

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా రేవంత్‌పై భారీ అంచనాలే పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. నిన్న గోవాలో జరిగిన బహిరంగ సభకు రాహుల్ హాజరుకావాల్సి ఉండగా.. దీనికి రేవంత్‌ను వెళ్లాల్సిందిగా ఖర్గే సూచించడం ఆయన పట్ల అధిష్టానంలో పెరుగుతున్న నమ్మకానికి ప్రతీకగా చూడాలి. ఈ విషయాన్ని తనే స్వయంగా ఆ వేదిక మీద చెప్పుకున్నాడు కూడా రేవంత్‌.

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి తను చేసిన పాదయాత్రను ఉటంకిస్తూనే.. సీఎంగా అయిన తరువాత తెలంగాణను డ్రగ్‌ ఫ్రీ స్టేట్‌గా చేసేందుకు ఈగల్‌ టీమ్‌ ఏర్పాటు, కట్టుదిట్టమైన కఠిన చర్యలను వివరించాడు రేవంత్‌. అంతే కాదు.. తన స్టైల్ మార్కు పంచులను అక్కడి బీజేపీ పాలితుల మీద, కేంద్ర సర్కార్‌ మీద విసరడం.. మంచి మైలేజీనే ఇచ్చిందని చెప్పాలి.

ఇవాళ మొత్తం రేవంత్‌ టీమ్‌ ఢిల్లీలో ఉంది. అధిష్టానం పిలుపునందుకున్న రేవంత్‌ .. తన టీమ్‌తో కలిసి ఇండీ కూటమి చేస్తున్న పోరాటానికి కొత్త బూస్టింగ్‌ను ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు రేవంత్‌ ఒక్కడే ఆందోళనల్లో పాల్గొంటూ వస్తున్నారు. కానీ, ఇప్పుడు తన సైన్యంతో హస్తినా దండయాత్రలో పాల్గొనేందుకు రెడీ అయ్యాడు.

Advertisement

జెన్‌జీ దండుకు ఏమాత్రం తీసిపోకుండా తెలంగాణ గళాన్ని హస్తినా పోరులో వినిపించేందుకు .. తన టీంనంతటినీ  కార్యోన్ముఖుల్ని చేశాడు రేవంత్‌. ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఆయన తెలంగాణ కాంగ్రెస్‌ టీమ్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆకట్టుకున్నది. ఎస్‌ఐఆర్‌ చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలు, ఓటు హక్కు కల్పనలో నెహ్రూ పాత్ర.. చరత్ర నేపథ్యాన్ని, పోరాట పంథాలను విడమర్చి చెప్పిన తీరు స్పూర్తిగా నిలిచింది.

ఇది రాజకీయ పార్టీల పోరుగానే చూడొద్దని ప్రజలకు కూడా ఈ సందర్భంగా రేవంత్‌ సూచించిన విధానం కూడా బాగుంది. ఓటుహక్కు లేకపోతే.. ఆ ప్రజల ముఖం కూడా రాజకీయ నాయకులు చూడరని, ప్రజల సంఘీభావం కూడా ఇండీ కూటమికి పోరాటానికి తోడుగా ఉండాలని ఆయన ఈ రకంగా పరోక్షంగా, ప్రత్యక్షంగా జనం మద్దతు కోరాడు.

ఢిల్లీలో ఇక లొల్లి పతాక స్థాయికి చేరనుందనే సంకేతాలు తాజా పరిణామాలు దేశానికి సమాచారం చేరవేశాయి.  అందులో మన గళం బలంగా వినిపించనుంది. తెలంగాణ దండు ముందు వరుసలో ఉండి పోరాడేందుకు సన్నద్దమైంది. ఓ వైపు బొద్దింకలు బిలబిలమంటూ నాలుగు వైపుల నుంచి జంతర్‌మంతర్‌ను చుట్టుముట్టేందుకు రెడీగా ఉండగా.. ఇండీ కూటమి తన పంజా విప్పి ఢిల్లీ పీఠాన్నే కదిలించేందుకు జో జీతా వహి సకిందర్ నినాదాన్నెత్తుకున్నది.

Tags

Related News

తమిళనాడు టూర్‌లో మోడీ, విజయ్‌ల ఎడముఖం పెడముఖం! పరువు పోకుండా మోడీ తండ్లాట..! మౌనంగా ఉంటూ ఇమేజీని డ్యామేజీ చేసేలా విజయ్‌..!

సిరిసిల్ల సభ చేదు అనుభవం తనకూ కలగకుండా… ముందే అప్రమత్తమైన వైనం… సిద్దిపేట సభతో బల ప్రదర్శన..!

విశాఖలో ఎన్నికల సందడి.. నోటిఫికేషన్‌కు ముందే అధికారుల స్పీడ్!

తెలంగాణలో కాంగ్రెస్ హవా.. బీఆర్ఎస్ మైండ్ గేమ్స్‌కు రివర్స్ కౌంటర్!

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఐదుగురు ఎమ్మెల్యేల తీరు.. వీరితో కష్టమేనా..?

నరసరావుపేట లో రూల్స్ బ్రేక్ చేసిన ఎమ్మెల్యే చదలవాడ.. ఏం చేసారంటే?

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సంచలనం.. మళ్లీ ఎన్టీఆర్ వ్యూహనికి శ్రీకారం?

Big Stories

Advertisement
×