E-Paper
Advertisement

థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇక ఇంట్లోనే.. పూనకాలు తెప్పించే బ్లూటూత్ స్పీకర్లు!

థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇక ఇంట్లోనే.. పూనకాలు తెప్పించే బ్లూటూత్ స్పీకర్లు!
Advertisement

Best cinema bluetooth speakers: థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు వచ్చే ఆ డాల్బీ ఆడియో బేస్ కిక్ ఇంట్లో రావట్లేదని ఫీలవుతున్నారా? అసలైన మూవీ లవర్స్ కోసం ఇప్పుడు మార్కెట్‌ను షేక్ చేయడానికి పవర్‌ ఫుల్ సినిమా బ్లూటూత్ స్పీకర్లు వచ్చేసాయి! సినిమా అంటే.. కేవలం నటన మాత్రమే కాదు, దాని వెనక వినిపించే పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్..మూవీ రేంజ్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ఎలాంటి వైర్ల టెన్షన్ లేకుండా.. ఇంటిని పెద్ద మ్యూజిక్ హాల్ లా మార్చేసి ఓటీటీలో అచ్చం థియేటర్ ఫీల్ పంచే అద్భుతమైన టాప్-7 వైర్‌ లెస్ స్పీకర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం!

7 వైర్‌ లెస్ స్పీకర్ల వివరాలు :

1. JBL Bar 5.1 Surround Soundbar:

సినిమా సౌండ్ అనగానే టక్కున గుర్తువచ్చే పేరు జెబిఎల్. ఇది పవర్‌ఫుల్ బేస్, క్రిస్టల్ క్లియర్ వాయిస్ అవుట్‌ పుట్‌తో వస్తుంది. సినిమాల్లోని యాక్షన్ సీన్లప్పుడు వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. అమెజాన్‌లో దీని ధర సుమారు రూ. 45,000 నుంచి రూ. 50,000 మధ్యలో ఉంటుంది.

2. Sony HT-S20R Soundbar:

Advertisement

సోనీ బ్రాండ్ క్వాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రియల్ 5.1 ఛానల్ సరౌండ్ సౌండ్ సపోర్ట్‌తో పని చేస్తుంది. వెనక వైపు ఉండే రియర్ స్పీకర్లు సినిమాలోని ప్రతి చిన్న శబ్దాన్ని మన చుట్టూ వినిపించేలా చేస్తాయి.
ఇదిలా ఉంటే దీని సుమారు రూ. 17,990 నుంచి రూ.19,900 వరకు ఉంటుంది.

3.boAt Aavante Bar 1190 / 3200 Pro:

తక్కువ బడ్జెట్‌లో సినిమా థియేటర్ ఫీల్ కోరుకునే ఇండియన్ యూజర్లకు బోట్ బెస్ట్ ఛాయిస్. హెవీ బేస్, మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్లతో వస్తుంది. బ్లూటూత్ ద్వారా టీవీకి కనెక్ట్ చేసి సినిమా చూస్తే.. ఆ మజాయే వేరు. సుమారు రూ.6,990 నుంచి రూ.9,990 మధ్యలో ఇది అందుబాటులో ఉంది.

4.Zebronics Juke Bar 9750 Pro Dolby Atmos:

Advertisement

భారీ బేస్, డాల్బీ అట్మాస్ టెక్నాలజీ ఇష్టపడే వారికి ఇది పర్‌ ఫెక్ట్ మోడల్. దీనిలో వైర్‌లెస్ సబ్ ఉఫర్ కలిగి ఉండటం వల్ల సినిమాలోని పేలుళ్లు,యాక్షన్ సీన్ల సౌండ్స్ గుండెల్లో తాకుతాయి. అంతే కాకుండా దీని ధర సుమారు రూ. 12,990 దాకా ఉంటుంది.

5. Philips Audio TAB7305 Soundbar:

ఫిలిప్స్ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ స్లిమ్ అండ్ పవర్‌ఫుల్ సౌండ్‌ బార్ లివింగ్ రూమ్‌కు అదిరి పోయే లుక్ ఇస్తుంది. అంతే కాకుండా దీనిలో హెచ్‌డీఎంఐ ఆర్క్ సపోర్ట్ ఉండటం వల్ల టీవీ రిమోట్‌తోనే దీన్ని కంట్రోల్ చేయొచ్చు. సినిమా చూసేటప్పుడు కూడా డైలాగ్స్ స్పష్టంగా వినిపిస్తాయి. అంతే కాకుండా దీని ధర సుమారు రూ. 14,500 నుంచి రూ. 16,000 మధ్యలో ఉంది.

6. Infinity (JBL) Hardbass 400 Soundbar:

జెబిఎల్ సబ్-బ్రాండ్ అయిన ఇన్ఫినిటీ నుంచి తక్కువ ధరలో ఎక్కువ సౌండ్ ఇచ్చే స్పీకర్ ఇది. డ్యూయల్ ఈక్వలైజర్ మోడ్స్ (మూవీ, మ్యూజిక్) ఉండటం వల్ల సినిమా చూసేటప్పుడు సినిమా మోడ్‌లోకి మార్చుకోవచ్చు. అంతే కాకుండా దీని ధర సుమారు రూ.5,490 నుంచి రూ.6,990 వరకు ఉంది.

Also Read: జిమ్,ఆఫీసులకు బెస్ట్.. టాప్ 5 పోర్టబుల్ బ్లెండర్లు ఇవే!

7. Mivi Fort S100 Soundbar:

మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అయిన మివి నుంచి వస్తున్న పవర్‌ఫుల్ సౌండ్‌ బార్ ఇది. అంతే కాకుండా దీని 100 వాట్ల పవర్‌ ఫుల్ సౌండ్ అవుట్‌ పుట్‌తో ఇల్లంతా మ్యూజిక్‌తో మార్మోగిపోతుంది. దీని బ్లూటూత్ కనెక్టివిటీ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఇది సుమారు రూ.7,490 ధరకే మార్కెట్ లో అందుబాటులో ఉంది.

ఇంట్లోనే థియేటర్ లాంటి రియల్ ఎక్స్‌పీరియన్స్ పొందాలనుకుంటే.. అమెజాన్‌లో దొరుకుతున్న ఈ టాప్ సినిమా బ్లూటూత్ స్పీకర్లలో మీ బడ్జెట్‌కు సరిపోయే దాన్ని ఇప్పుడే ఎంచుకోండి. అంతే కాకుండా వీకెండ్‌లో మీ ఫ్యామిలీతో కలిసి సినిమాను మరో లెవెల్‌లో ఎంజాయ్ చేయండి.

Related News

7,050mAh బ్యాటరీతో అదరగొట్టనున్న Vivo T5 5G ఫోన్.. లాంచ్ డేట్ ఇదే!

ఫోన్ వెనుక అతికించుకుంటే చాలు.. మాట్లాడిన ప్రతిమాటను నోట్స్‌గా మార్చే AI డివైజ్!

వెయిటింగ్ ఈజ్ ఓవర్. Nothing Buds Pro 2 కేస్ డిజైన్, బ్యాటరీ వివరాలు లీక్!

యాపిల్ మాస్టర్ ప్లాన్.. ఐఫోన్ కంటే ముందే మార్కెట్‌ను షేక్ చేయబోతున్న కొత్త డివైజ్!

జిమ్,ఆఫీసులకు బెస్ట్.. టాప్ 5 పోర్టబుల్ బ్లెండర్లు ఇవే!

కరెంట్ పోయినా నో టెన్షన్.. పవర్‌బ్యాంక్‌లా పనిచేసే నోకియా కొత్త ఫోన్ చూశారా?

85 ఇంచుల బిగ్ స్క్రీన్, గూగుల్ జెమిని ఫీచర్.. హైయర్ నుంచి అద్భుతమైన స్మార్ట్ టీవీలు!

Big Stories

Advertisement
×