Best cleaning robots under 30000: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఇప్పుడు ఇల్లు తుడవడం, ఊడ్చడం వంటి పనులన్నీ రోబోట్లే చేసేస్తున్నాయి. మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ వాక్యూమ్ క్లీనర్లు మన పనులను ఎంతో ఈజీ చేస్తున్నాయి. మార్కెట్లో వివిధ రకాల క్లీనర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రూ. 30,000 బడ్జెట్‌లో లభించే బెస్ట్ , బ్రాండెడ్ క్లీనింగ్ రోబోట్లు ఏవి, వాటి ప్రత్యేకతలు ,ధరల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ బ్రాండ్‌గా పేరున్న ఎకోవ్యాక్స్ నుంచి వచ్చిన ఈ రోబోటిక్ ఫ్లోర్ క్లీనర్ మార్కెట్లో విపరీతమైన ఆదరణ పొందుతోంది. దీని ధర సుమారు రూ.22,999 వరకు ఉంటుంది. ఇది ఒకే సారి వాక్యూమ్, మోపింగ్ చేయగల శక్తివంతమైన 2-ఇన్-1 డివైజ్. దీనిలో ఉండే అడ్వాన్స్‌డ్ సెన్సార్లు , స్మార్ట్ నావిగేషన్ సిస్టమ్ ఇంటి మూలలను కూడా ఎక్కడా వదలకుండా శుభ్రం చేస్తాయి. గూగుల్ అసిస్టెంట్ , అలెక్సా వాయిస్ కంట్రోల్ సపోర్ట్ ఉండటం వల్ల దీన్ని ఆపరేట్ చేయడం చాలా ఈజీ.
స్వయంగా చెత్తను ఖాళీ చేసుకునే టెక్నాలజీతో వస్తున్న ఈ సెల్ఫ్ ఎంప్టైయింగ్ రోబోట్ వాక్యూమ్ & మోప్ ధర దాదాపు రూ. 27,900గా ఉంది. దీనిలో శక్తివంతమైన 5,000 Pa సక్షన్ పవర్ ఉంటుంది. అంతే కాకుండా ఇది LiDAR నావిగేషన్ సాయంతో ఇల్లంతా కచ్చితమైన మ్యాపింగ్ చేసుకుని పని చేస్తుంది. రోబోట్ తనంతట తానుగా బేస్ స్టేషన్‌కు వెళ్లి డస్ట్ బిన్‌ను క్లీన్ చేసుకునే బెస్ట్ ఫీచర్ దీని సొంతం, దీని వల్ల మాన్యువల్ పని చాలా వరకు తగ్గిపోతుంది.
తక్కువ బడ్జెట్‌లో లాంగ్ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే.. వారికి ఈ మోడల్ బెస్ట్ అని చెప్పొచ్చు. దీని మార్కెట్ ధర సుమారు రూ. 19,900 వరకు ఉంటుంది. ఇది బలమైన 6,500 Pa సక్షన్ పవర్‌తో పని చేస్తుంది. దీని లోని 5,200 mAh బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే కొన్ని గంటల పాటు నిరంతరం పనిచేస్తుంది. ఇది కార్పెట్లు, గట్టి నేలపై ఉండే దుమ్మును ఇది ఇట్టే పీల్చేసుకుంటుంది. అంతే కాకుండా దీనిని స్మార్ట్ యాప్ కంట్రోల్ ద్వారా ఎక్కడి నుంచైనా దీన్ని కంట్రోల్ చేయవచ్చు.
Also Read: గూగుల్ మ్యాప్స్‌లో అమేజింగ్ ఫీచర్స్..99% మందికి తెలియవు !
ఇంటి శుభ్రతలో నమ్మకమైన బ్రాండ్‌గా పేరున్న యురేకా ఫోబ్స్ నుంచి వచ్చిన ఈ మోడల్ ధర సుమారు రూ. 23,999గా ఉంది. ఇది 7,000 Pa టర్బో సక్షన్ పవర్‌తో వస్తుంది. ఆటోమేటిక్ డస్ట్ డిస్పోజల్ , క్విక్ మ్యాపింగ్ టెక్నాలజీ దీని ప్రత్యేకతలు. మూడు గంటలకు పైగా నిరంతరంగా పని చేసే బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండి, ఇంటిని ఎప్పుడూ జిగేల్మనిపించేలా ఉంచుతుంది.
బడ్జెట్ ధరలో లభించే.. మరో అద్భుతమైన మోడల్ ఇది. అంతే కాకుండా ఇది హైబ్రిడ్ డ్రై అండ్ వెట్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్. దీని ధర సుమారు రూ. 15,900 వరకు ఉంటుంది. ఇది 3,000 Pa సక్షన్ పవర్‌తో పని చేస్తూ, రోజు వారీ ఇంట్లో పేరుకుపోయే దుమ్మును సమర్థవంతంగా తొలగిస్తుంది. దీనిలో యాంటీ-బ్యాక్టీరియల్ క్లీనింగ్ ఫీచర్ కలిగి ఉండటం వల్ల చిన్న పిల్లలు ఉండే ఇళ్లకు ఇది చాలా సురక్షితమైనది.ఈజీ యాప్ కనెక్టివిటీతో పని చేసే ఈ రోబోట్ బడ్జెట్ యూజర్లకు పర్ఫెక్ట్ ఛాయిస్.