E-Paper
Advertisement

రూమ్ చిన్నదైనా సౌండ్ మాత్రం అదుర్స్.. క్రిస్టల్ క్లియర్ ఆడియోనిచ్చే మినీ థియేటర్లు!

రూమ్ చిన్నదైనా సౌండ్ మాత్రం అదుర్స్.. క్రిస్టల్ క్లియర్ ఆడియోనిచ్చే మినీ థియేటర్లు!
Advertisement

Best compact home theaters:  ఇల్లు చిన్నగా ఉందనే.. కారణంతో పెద్ద స్పీకర్లు వాడలేకపోతున్నామని బాధపడుతున్నారా? అయితే.. మీ కోసమే ఈ అద్భుతమైన న్యూస్! స్థలం తక్కువగా ఉన్నప్పటికీ, సౌండ్ క్వాలిటీలో ఎలాంటి రాజీ పడకుండా మార్కెట్‌లోకి సరి కొత్త కాంపాక్ట్ హోమ్ థియేటర్లు వచ్చేసాయి. ఇవి చూడటానికి చిన్నవిగా ఉన్నా..బేస్, సరౌండ్ సౌండ్ విషయంలో థియేటర్‌ను తలపిస్తాయి.

ఈ రోజుల్లో కాంపాక్ట్ అపార్ట్‌మెంట్లు, చిన్న లివింగ్ రూమ్‌లలో నివసించేవారి కోసం ‘స్పేస్ సేవింగ్’ కాన్సెప్ట్‌తో ఈ లేటెస్ట్ హోమ్ థియేటర్లు రూపుదిద్దుకున్నాయి. తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూనే, చెవులకు అద్భుతమైన ఆడియో ట్రీట్‌ను ఇస్తాయి. ఆ బెస్ట్ ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!

1. చిన్న స్పేస్.. పెద్ద సౌండ్:

Advertisement

సాధారణంగా చిన్న రూముల్లో.. పెద్ద స్పీకర్లు పెడితే సౌండ్ వినసొంపుగా ఉండదు.కానీ.. ఈ కాంపాక్ట్ హోమ్ థియేటర్లు ,సౌండ్‌ బార్లు డాల్బీ అట్మాస్ వంటి లేటెస్ట్ టెక్నాలజీతో వస్తాయి. ఇవి రూమ్ లోని ప్రతి మూలకు సౌండ్‌ను సమానంగా విస్తరింపజేస్తాయి. కేవలం టీవీ కింద చిన్న స్థలంలో సరి పోయే ఈ సిస్టమ్స్, యాక్షన్ సీన్స్ లేదా మ్యూజిక్ బీట్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాయి.

2. టాప్ 5 కాంపాక్ట్ హోమ్ థియేటర్లు:

1. సోని హెచ్‌టి-ఎస్‌200ఆర్ (Sony HT-S200R): కాంపాక్ట్ డిజైన్ , బిల్ట్-ఇన్ సబ్-వూఫర్‌తో వచ్చే.. ఈ 2.1 ఛానల్ సౌండ్‌ బార్ చిన్న రూమ్‌లకు పర్ఫెక్ట్. దీని ధర సుమారు రూ.18,000 నుంచి రూ.22,000 మధ్య ఉంటుంది.

Advertisement

2. జెబీఎల్ సినిమా ఎస్‍బీ130 (JBL Cinema SB130): వైర్‌లెస్ సబ్-వూఫర్‌తో వచ్చే ఈ స్లీక్ సౌండ్‌ బార్ స్పేస్‌ను చాలా బాగా ఆదా చేస్తుంది. దీని ధర సుమారు రూ.10,000 నుంచి రూ.13,000 వరకు ఉంటుంది.

3. బోస్ టెలివిజన్ స్పీకర్ (Bose TV Speaker): డైలాగ్ క్లారిటీకి పేరుగాంచిన ఈ కాంపాక్ట్ సౌండ్‌ బార్ చిన్న బెడ్‌రూమ్‌లు లేదా లివింగ్ రూమ్‌లకు అద్భుతమైన ఛాయిస్.దీని ధర సుమారు రూ.28,000 నుంచి రూ. 32,000 మధ్యలో ఉంటుంది.

4. బోట్ ఆవెంటోర్ / ఐబాస్ సిరీస్ (boAt Aavante Bar Series): తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ లుక్, మంచి బాస్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీని ధర సుమారు రూ. 6,000 నుంచి రూ.9,000 ఉంటుంది.

5. పోల్క్ ఆడియో సిగ్నా ఎస్2 (Polk Audio Signa S2): కేవలం 2 అంగుళాల ఎత్తు ఉండే ఈ అల్ట్రా-స్లీక్ సౌండ్‌ బార్ చిన్న స్పేస్‌లో .. అమర్చడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీని ధర సుమారు రూ. 15,000 నుంచి రూ. 18,000 మధ్యలో లభిస్తుంది.

Also Read: కరెంట్ పోతే ఏంటీ ? సినిమా మాత్రం ఆగదు బాస్ !

3.టెక్ లవర్స్ కోరుకుంటున్న ఫీచర్లు:

వైర్‌లెస్ కనెక్టివిటీ (బ్లూటూత్, హెచ్‌డిఎంఐ ఇర్క్), స్పేస్ సేవింగ్ డిజైన్ , స్మార్ట్ ఫీచర్లు ఉన్న గాడ్జెట్లను ఎక్కువగా కోరుకుంటున్నారు. ఈ కాంపాక్ట్ హోమ్ థియేటర్లలో.. కేవలం వైర్లు లేకుండా కనెక్ట్ చేసుకునే.. వెసులుబాటే కాదు, స్మార్ట్‌ ఫోన్ లేదా టాబ్ నుంచి నేరుగా మ్యూజిక్ ప్లే చేసుకునే బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంటుండటంతో ఇవి హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

ఇల్లు చిన్నగా ఉందని మంచి సౌండ్ ఫీల్ దూరం చేసుకోవాల్సిన పనిలేదు. పైన పేర్కొన్న కాంపాక్ట్ హోమ్ థియేటర్లలో.. మీ బడ్జెట్ , రూమ్ సైజుకు సరి పోయేదాన్ని ఎంచుకోండి. ఇంట్లోనే థియేటర్ లాంటి రిచ్ ఆడియో అనుభవాన్ని సొంతం చేసుకోండి!

Related News

అమెజాన్ Vs ఫ్లిప్‌కార్ట్ సేల్..వస్తువులు కొనడానికి ఏది బెస్ట్?

ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే అందే అద్భుతమైన లాభాలు!

యూపీఐ వాడేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. భీమ్ యాప్‌లోకి కొత్తగా ‘MyUPI’ ఏఐ అసిస్టెంట్!

డేటా అక్కర్లేని వారికి గుడ్‌ న్యూస్.. Airtel, Jio, Vi నుంచి.. అత్యంత చౌకైన ప్లాన్స్ వచ్చేస్తున్నాయ్!

కరెంట్ పోతే ఏంటీ ? సినిమా మాత్రం ఆగదు బాస్!

బట్టలను క్షణాల్లో క్లీన్ చేసే అద్భుతమైన టెక్నాలజీ..బెస్ట్ 8కేజీల వాషింగ్ మెషీన్స్ లిస్ట్

పండగ వేళ అమెజాన్ సేల్..ఈ ట్రిక్స్‌తో తక్కువ ధరకే షాపింగ్!

Big Stories

Advertisement
×