E-Paper
Advertisement

యూపీఐ వాడేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. భీమ్ యాప్‌లోకి కొత్తగా ‘MyUPI’ ఏఐ అసిస్టెంట్!

యూపీఐ వాడేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. భీమ్ యాప్‌లోకి కొత్తగా ‘MyUPI’ ఏఐ అసిస్టెంట్!
Advertisement

MyUPI AI Assistant: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనుబంధ సంస్థ అయిన ఎన్‌పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ (NBSL).. భీమ్ యాప్‌లో ‘MyUPI’ పేరిట ఒక కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అసిస్టెంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు వేర్వేరు ఆప్షన్ల కోసం యాప్‌లో వెతకాల్సిన అవసరం లేకుండా కేవలం చాటింగ్ ద్వారానే తమ UPI సేవలన్నింటినీ సులభంగా పొందేందుకు ఈ ఫీచర్ తోప్పడనుంది. ఈ ఏఐ ఫీచర్ ద్వారా యూజర్లకు ఎలాంటి సేవలు లభించనున్నాయో ఈ కథనంలో చూద్దాం.

లావాదేవీల సమాచారం

‘MyUPI’ ఫీచర్ ద్వారా యూజర్లు వివిధ బ్యాంకులు, UPI యాప్‌లలో జరిపిన లావాదేవీల వివరాలను ఒకే వేదికపై చూడవచ్చు. ఏదైనా నిర్దిష్ట చెల్లింపునకు సంబంధించి సందేహాలు ఉంటే చాట్ ద్వారానే నివృత్తి చేసుకోవచ్చు. గతంలో చేసిన పాత చెల్లింపుల (P2P, P2M) ఖాతాకే మళ్లీ సులభంగా డబ్బు పంపేందుకు ‘ట్రాన్సాక్షన్ రీప్లే’ సౌకర్యం కూడా ఉంది. అలాగే మొబైల్ నంబర్‌కు వచ్చే పేమెంట్లను నిలిపివేసి.. కేవలం యూపీఐ ఐడీ ద్వారా మాత్రమే డబ్బులు పొందే వెసులుబాటును సైతం ఇది కల్పిస్తోంది.

ఆటోపే సేవల కంట్రోల్

Advertisement

మరోవైపు ఆటో పే చెల్లింపుల వివరాలన్నింటినీ ఒకే చోట చూసుకునేందుకు ఈ ఏఐ ఫీచర్ వీలుకల్పిస్తుంది. అవసరాన్ని బట్టి ఈ ఆటోపే సేవలను నిలిపివేయడం (Pause), మళ్లీ ప్రారంభించడం, రద్దు (Cancel) చేయడం చేయవచ్చు. యూజర్ ప్రమేయం (UPI PIN) లేకుండా ఏదైనా ఆటో డెబిట్ జరిగినప్పుడు అది ఏ సేవ కోసం కట్ అయిందో తెలుసుకోవడానికి కూడా MyUPI సహాయపడుతుంది.

సులభంగా ఫిర్యాదు

చెల్లింపుల్లో ఏవైనా సమస్యలు ఎదురైతే యూజర్లు MyUPI ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేయగానే ఒక రెఫరెన్స్ నంబర్ యూజర్ కు వస్తుంది. దాని సహాయంతో భీమ్ యాప్‌లోనే సమస్య పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

‘పే సేఫ్’, ‘సేఫ్టీ స్విచ్’

Advertisement

ఎవరికైనా డబ్బులు పంపే ముందు పేయీ (Payee) అసలు పేరును సరిచూసుకోవడానికి ఇందులోని ‘పే సేఫ్’ ఆప్షన్ ఉపయోగపడనుంది. లేదంటే యూపీఐ ఐడీ లేదా క్యూఆర్ కోడ్ అప్‌లోడ్ చేసి సంబంధిత వ్యక్తి లేదా సంస్థ వివరాలును ధృవీకరించుకోవచ్చు. ఒకవేళ ఫోన్ పోయినా, ఖాతా దుర్వినియోగం అవుతోందని అనుమానం వచ్చినా, అనుమానాస్పదంగా డబ్బులు కట్ అయినా.. ‘సేఫ్టీ స్విచ్’ ద్వారా సంబంధిత బ్యాంక్ ఖాతాను తక్షణమే బ్లాక్ చేసి తదుపరి లావాదేవీలను అడ్డుకోవచ్చు.

Also Read: డేటా అక్కర్లేని వారికి గుడ్‌ న్యూస్.. Airtel, Jio, Vi నుంచి.. అత్యంత చౌకైన ప్లాన్స్ వచ్చేస్తున్నాయ్!

తెలుగులోనూ అందుబాటులో..

యూపీఐ ద్వారా జరుగుతున్న సైబర్ మోసాలు, సైబర్ నేరగాళ్లు పంపే మెసేజ్ లపై అవగాహన పెంచుకోవడానికి ‘MyUPI’ ఫీచర్ ని అడిగి తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఏఐ సేవలు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే మరిన్ని ప్రాంతీయ భాషల్లోకి రానున్నాయి. అయితే భద్రత దృష్ట్యా డబ్బులు పంపే ప్రతి లావాదేవీకి యూజర్ యూపీఐ పిన్ ను ఎంటర్ చేయడం తప్పనిసరి.

Also Read: కీబోర్డ్ F, J కీలపై ఉండే చిన్న గీతల కథేంటి? టైపింగ్ వేగానికి, ఆరోగ్యానికి ఉన్న లింకేంటి?

Tags

Related News

అమెజాన్ Vs ఫ్లిప్‌కార్ట్ సేల్..వస్తువులు కొనడానికి ఏది బెస్ట్?

ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే అందే అద్భుతమైన లాభాలు!

రూమ్ చిన్నదైనా సౌండ్ మాత్రం అదుర్స్.. క్రిస్టల్ క్లియర్ ఆడియోనిచ్చే మినీ థియేటర్లు!

డేటా అక్కర్లేని వారికి గుడ్‌ న్యూస్.. Airtel, Jio, Vi నుంచి.. అత్యంత చౌకైన ప్లాన్స్ వచ్చేస్తున్నాయ్!

కరెంట్ పోతే ఏంటీ ? సినిమా మాత్రం ఆగదు బాస్!

బట్టలను క్షణాల్లో క్లీన్ చేసే అద్భుతమైన టెక్నాలజీ..బెస్ట్ 8కేజీల వాషింగ్ మెషీన్స్ లిస్ట్

పండగ వేళ అమెజాన్ సేల్..ఈ ట్రిక్స్‌తో తక్కువ ధరకే షాపింగ్!

Big Stories

Advertisement
×