E-Paper
Advertisement

కరెంట్ పోతే ఏంటీ ? సినిమా మాత్రం ఆగదు బాస్!

కరెంట్ పోతే ఏంటీ ? సినిమా మాత్రం ఆగదు బాస్!
Advertisement

Best portable battery powered projectors: ఈ రోజుల్లో.. మన కాల క్షేపం అంతా ఓటీటీ ప్లాట్‌ ఫారమ్‌లు, యూ ట్యూబ్ చుట్టూనే.. తిరుగుతోంది. చిన్న ఫోన్ స్క్రీన్ కంటే.. పెద్ద టీవీలో లేదా ప్రొజెక్టర్‌లో సినిమా చూస్తే.. వచ్చే కిక్కే వేరు. కానీ, లాంగ్ జర్నీలు చేసేటప్పుడు.. లేదా సడన్‌గా కరెంట్ పోయినప్పుడు ఆ మజాకు సడన్‌గా బ్రేక్ పడుతుంది. ఈ సమస్యకు శాశ్వత చెక్ పెట్టడమే లక్ష్యంగా ..ఇప్పుడు మార్కెట్లో ‘పోర్టబుల్ బ్యాటరీ పవర్డ్ ప్రొజెక్టర్లు’ ట్రెండ్ సృష్టిస్తున్నాయి. వీటిలో పవర్ కేబుల్స్ తో పని ఉండదు, కేవలం ఛార్జ్ చేసుకుంటే చాలు. ఎక్కడికంటే అక్కడికి ప్రొజెక్టర్ మన బ్యాగులో మోసుకెళ్లొచ్చు!

1. వైర్లెస్ ఫ్రీడమ్‌తో అన్‌స్టాపబుల్ ఎంటర్‌టైన్‌మెంట్:

ఈ ప్రొజెక్టర్ల ప్రత్యేకత ఏంటంటే ఇవి చాలా కాంపాక్ట్‌గా ఉండి, హ్యాండ్‌ బ్యాగ్‌లో కూడా ఈజీగా పట్టేస్తాయి. బిల్ట్-ఇన్ రీచార్జబుల్ బ్యాటరీలు .. ఉండటం వల్ల ఎలాంటి వైరింగ్ గొడవ లేకుండా గంటల తరబడి సినిమాలు, వెబ్ సిరీస్‌లు లేదా గేమింగ్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు రూమ్ లోపల ఉన్నా, టెర్రస్ మీద ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ..చేసుకుంటున్నా, లేదా లాంగ్ డ్రైవ్‌లో క్యాంపింగ్ చేస్తున్నా ఇవి పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతాయి.

2. లేటెస్ట్ ఫీచర్లు:

Advertisement

ప్రస్తుత గూగుల్ అప్‌డేట్లు, యూజర్ల సెర్చ్ ట్రెండ్ ప్రకారం.. ప్రజలు ఇప్పుడు వైర్లెస్, స్మార్ట్ గాడ్జెట్లను విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఈ లేటెస్ట్ బ్యాటరీ ప్రొజెక్టర్లలో కేవలం బ్యాటరీ బ్యాకప్ మాత్రమే కాదు, హై-స్పీడ్ వై-ఫై, బ్లూటూత్ ,ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ సపోర్ట్ కూడా నేరుగా లభిస్తోంది. అంటే.. మీ స్మార్ట్‌ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను కేవలం ఒక్క క్లిక్‌తో కనెక్ట్ చేసి నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలను నేరుగా పెద్ద స్క్రీన్ మీద ప్లే చేసుకోవచ్చు.

3. టాప్ 5 బ్యాటరీ ప్రొజెక్టర్ల ప్రత్యేకతలు:

అవుట్‌డోర్ ఫ్రెండ్లీ డిజైన్: ఇవి తక్కువ బరువుతో ఉండటంతో .. పాటు ప్రయాణాల్లో కింద పడినా తట్టుకునేలా స్ట్రాంగ్ షాక్-ప్రూఫ్ బిల్డ్ క్వాలిటీతో వస్తున్నాయి.

Advertisement

లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ: సింగిల్ ఛార్జ్‌తో .. సుమారు 2 నుంచి 4 గంటల వరకు నాన్‌ స్టాప్ వీడియో ప్లేబ్యాక్ అందిస్తాయి. అంటే.. ఎలాంటి అడ్డులేకుండా ఒక పూర్తి సినిమాను హాయిగా చూసేయొచ్చు.

ఆటో ఫోకస్ & కీస్టోన్ కరెక్షన్: ప్రొజెక్టర్‌ను ఎక్కడ పెట్టినా, స్క్రీన్ అలైన్‌మెంట్.. అదే ఆటో మేటిక్‌గా సెట్ చేసుకుంటుంది. గోడ ఎగుడు దిగుడుగా ఉన్నా షార్ప్ పిక్చర్ కనిపిస్తుంది.

బిల్ట్-ఇన్ డాల్బీ స్పీకర్లు: బయట తిరిగేటప్పుడు ప్రత్యేకంగా ఎక్స్‌టర్నల్ స్పీకర్లు మోసుకెళ్లాల్సిన పని లేదు. వీటిలో వచ్చే సరౌండ్ సౌండ్ స్పీకర్లు మంచి ఆడియో ఫీల్ ఇస్తాయి.

Also Read: బట్టలను క్షణాల్లో క్లీన్ చేసే అద్భుతమైన టెక్నాలజీ..బెస్ట్ 8కేజీ వాషింగ్ మెషీన్స్ లిస్ట్

టైప్-సి పవర్ బ్యాంక్ సపోర్ట్: కొన్ని మోడల్స్ అయితే.. టైప్-సి పోర్ట్ ద్వారా మామూలు పవర్ బ్యాంక్‌తో కూడా ఛార్జ్ చేసుకునే వెసులు బాటును కల్పిస్తున్నాయి.

మొత్తానికి చూస్తే.. ఎంటర్‌టైన్‌ మెంట్ రంగంలో.. ఇదొక అద్భుత మైన విప్లవం అని చెప్పొచ్చు. పవర్ కట్లతో.. సంబంధం లేకుండా.. ప్రకృతి ఒడిలో లేదా ప్రయాణాల్లో సినిమా చూసే థ్రిల్ కావాలనుకునే.. వారికి ఈ పోర్టబుల్ బ్యాటరీ ప్రొజెక్టర్లు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ నెక్స్ట్ ట్రిప్ లేదా వీకెండ్ ప్లాన్ కోసం ఒక ట్రెండీ ప్రొజెక్టర్‌ను ఎంచుకుని మీ కాలక్షేపాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లండి.

5 మోడల్స్- ధరలు: 

1. శామ్‌సంగ్ ది ఫ్రీస్టైల్ (Samsung The Freestyle): అత్యంత కాంపాక్ట్ డిజైన్, ఆటో-లెవలింగ్ , స్మార్ట్ టీవీ ఫీచర్లు.. కలిగిన ఈ మోడల్ ధర సుమారు రూ.55,000 నుంచి రూ.60,000 మధ్య ఉంటుంది.

2. ఎక్స్‌జిమి మోగో ప్రొ (Xgimi MoGo Pro): బిల్ట్-ఇన్ బ్యాటరీ బ్యాకప్, ఫుల్ హెచ్‌డీ క్లారిటీతో.. వచ్చే ఈ ప్రొజెక్టర్ ధర సుమారు రూ. 39,000 నుంచి రూ. 49,000 వరకు ఉంటుంది.

3.యాంకర్ నెబ్యులా క్యాప్సూల్ (Anker Nebula Capsule): సోడా క్యాన్ సైజులో ఉండే పాకెట్ ఫ్రెండ్లీ డిజైన్, అద్భుతమైన బ్యాటరీ లైఫ్ కలిగిన దీని ధర సుమారు రూ. 42,000 నుంచి రూ. 52,000 మధ్యలో లభిస్తుంది.

4. వ్యూసోనిక్ ఎం1 ప్లస్ (ViewSonic M1 Plus G2): హర్మన్ కార్డాన్ స్పీకర్లు, బిల్ట్-ఇన్ బ్యాటరీతో వచ్చే.. ఈ పోర్టబుల్ ప్రొజెక్టర్ ధర సుమారు రూ. 35,000 నుంచి రూ. 37,000 ఉంటుంది.

5. పోర్ట్రోనిక్స్ బీమ్ సిరీస్ (Portronics Beem Series): బడ్జెట్ ధరలో.. వైర్‌ లెస్ కనెక్టివిటీ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్. దీని ధర సుమారు రూ. 15,000 నుంచి రూ. 22,000 మధ్యలో ఉంటుంది.

Related News

బట్టలను క్షణాల్లో క్లీన్ చేసే అద్భుతమైన టెక్నాలజీ..బెస్ట్ 8కేజీ వాషింగ్ మెషీన్స్ లిస్ట్

పండగ వేళ అమెజాన్ సేల్..ఈ ట్రిక్స్‌తో తక్కువ ధరకే షాపింగ్!

రూ.16,999కే OnePlus ఫోన్.. 7,000mah బ్యాటరీతో వావ్ అనిపించే ఫీచర్లు!

సిమ్ కార్డుల దుర్వినియోగంపై DoT తీవ్ర హెచ్చరిక.. 3 ఏళ్ల జైలు, 50 లక్షల జరిమానా!

ఐఫోన్ యూజర్లకు కీలక అప్‌డేట్.. భారత్‌లోకి Apple Pay ఎంట్రీ, మరి UPI సంగతేంటి?

ఇంటర్నెట్ వాడని వారికి భారీ ఊరట.. TRAI కొత్త రూల్స్‌తో రీఛార్జ్ ఖర్చు తగ్గే ఛాన్స్!

హోటల్ బాత్రూమ్ అద్దంతో పాటలు వినొచ్చా? ఈ హైటెక్ ఫీచర్‌ను ఎప్పుడైనా గమనించారా?

Big Stories

Advertisement
×