E-Paper
Advertisement

ఇలాంటి స్మార్ట్ గ్యాడ్జెట్ ఒకటుందని తెలిస్తే.. అసలు స్టవ్ మీద గుడ్లు ఉడకబెట్టడమే మానేస్తారు!

ఇలాంటి స్మార్ట్ గ్యాడ్జెట్ ఒకటుందని తెలిస్తే.. అసలు స్టవ్ మీద గుడ్లు ఉడకబెట్టడమే మానేస్తారు!
Advertisement

Best Electric Egg Boilers: ఉదయాన్నే ఆఫీసు హడావుడిలోనో లేదా పిల్లలను స్కూల్‌కి పంపే కంగారులోనో కోడిగుడ్లు ఉడకబెట్టడం ఒక పెద్ద టాస్క్. స్టవ్ మీద పెడితే ఎప్పుడు ఉడుకుతాయో చూస్తూ కూర్చోవాలి. ఒక్కోసారి నీళ్లు ఎక్కువై గుడ్లు పగిలిపోతుంటాయి. ఈ ఇబ్బందులన్నీ తప్పించి.. కొన్ని నిమిషాల్లోనే పర్ఫెక్ట్‌గా గుడ్లను ఉడకబెట్టేవే ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్స్. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మంచి రేటింగ్, వాల్యూ ఉన్న టాప్-5 ఎగ్ బాయిలర్స్ గురించిన పూర్తి సమాచారం మీకోసం.

AGARO Grand Egg Boiler & Poacher

ఎక్కువ మంది ఉన్న కుటుంబాలకు లేదా జిమ్‌కి వెళ్తూ రోజూ ఎక్కువ గుడ్లు తినే వారికి ఇది చాలా బాగా సెట్ అవుతుంది. దీనిలో ఒకేసారి 8 గుడ్ల వరకు ఉడకబెట్టుకోవచ్చు. 500 వాట్ల పవర్‌తో పనిచేసే ఈ మోడల్‌కు కంపెనీ రెండేళ్ల వారంటీ కూడా ఇస్తోంది. ధర కూడా రూ.1000 లోపే ఉండటం విశేషం. అయితే ఇందులో ఎగ్ పోచింగ్ (ఆమ్లెట్ లాంటిది) ఆప్షన్ ఉన్నప్పటికీ.. నార్మల్ బాయిలింగ్ అంత పర్ఫెక్ట్‌గా రాకపోవచ్చు.

KENT Super Egg Boiler

Advertisement

బ్రాండ్ వాల్యూ, నమ్మకమైన సర్వీస్ కోరుకునే వారికి కెంట్ బెస్ట్ ఛాయిస్. దీని బాడీ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రావడం వల్ల తుప్పు పట్టకుండా చాలా కాలం మన్నికగా ఉంటుంది. అయితే దీనిలో ఒకసారికి 6 గుడ్లు మాత్రమే ఉడకబెట్టే వీలుంటుంది. పెద్ద ఫ్యామిలీస్ అయితే రెండు సార్లు వాడుకోవాల్సి వస్తుంది. కానీ క్వాలిటీ విషయంలో మాత్రం ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.

Also Read: యాపిల్ లవర్స్‌కు పండగే.. iPhone 17 Pro Maxపై కళ్లు చెదిరే డిస్కౌంట్.. కొనేయండిలా!

Borosil Electric Plus Egg Boiler

Advertisement

ఈ బాయిలర్ కేవలం గుడ్లు ఉడకబెట్టడానికే కాకుండా కూరగాయలు, మోమోస్ వంటివి స్టీమ్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది. మల్టీ పర్పస్ యూజ్ కోసం చూసేవారికి ఇది చక్కటి ఆప్షన్. బోరోసిల్ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ ప్రొడక్ట్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. కానీ, కొంతమంది యూజర్స్ feedback ప్రకారం కొన్ని నెలలు వాడిన తర్వాత దీని ఆటో-షటాఫ్ ఫీచర్‌లో చిన్నచిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Milton 2-in-1 Egg Boiler & Poacher

మిల్టన్ కంపెనీ హోమ్ సర్వీస్ సపోర్ట్‌తో వస్తున్న ఈ మోడల్ కూడా 8 గుడ్ల కెపాసిటీని కలిగి ఉంటుంది. రోజూ వాడుకోవడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. ఒకవేళ ప్రొడక్ట్‌లో ఏదైనా సమస్య వస్తే ఇంటికే వచ్చి సర్వీస్ చేయడం దీని ప్లస్ పాయింట్. కాకపోతే.. దీనిని ఎక్కువ రోజులు వాడినప్పుడు బేస్ పార్ట్ నుండి స్వల్పంగా నీరు లీక్ అవుతున్నట్లు కొందరు కొనుగోలుదారులు చెప్తున్నారు.

Lifelong 2-in-1 Egg Boiler & Poacher

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కావాలనుకునే వారికి లైఫ్‌లాంగ్ బెస్ట్ ఆప్షన్. తక్కువ ధరలోనే 8 గుడ్ల కెపాసిటీతో పాటు పోచింగ్ ట్రే కూడా లభిస్తుంది. బడ్జెట్ పరంగా ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. అయితే దీని ధర తక్కువ కాబట్టి.. రోజూ హెవీగా వాడేవారికి లాంగ్ రన్‌లో దీని మన్నిక కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది.

Also Read: ఫ్యాన్ వేస్తే గది చల్లబడుతుందా? మనమంతా నమ్మే ఈ అబద్ధం వెనుకున్న అసలు నిజమిదే!

Related News

యాపిల్ లవర్స్‌కు ఇది కదా కావాల్సింది.. iPhone 17 Proపై ఏకంగా రూ.78,000 తగ్గింపు!

క్యూఆర్ కోడ్ వైపు చూస్తే చాలు.. జియో ఏఐ గ్లాసెస్‌తో పేమెంట్స్ సక్సెస్!

రూ.799కే బోట్ సౌండ్‌బార్..దీని ముందు హోం థియేటర్ బలాదూర్

డిస్‌ప్లే ఇయర్‌బడ్స్ చూశారా?మార్కెట్‌లో జెబీఎల్ లైవ్ బీమ్ 4 లాంచ్

పార్టీ లవర్స్ కోసం JBL కొత్త పార్టీబాక్స్ స్పీకర్లు.. 18 గంటల బ్యాటరీ, AI కారోకే మైక్స్‌తో లాంచ్!

టెక్కీలకు పండగే.. ఒకేసారి మల్టిపుల్ డివైజ్‌లను ఛార్జ్ చేసే షావోమి పవర్ బ్యాంక్!

ఫోన్ అప్‌డేట్ చేయకపోతే వాట్సప్ గోవిందా.. సీక్రెట్‌గా టెస్టింగ్ మొదలుపెట్టిన మెటా సంస్థ!

అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!

Big Stories

Advertisement
×