E-Paper
Advertisement

పవిత్ర గౌడ మాజీ భర్త మృతి.. అసలేం జరిగిందంటే?

పవిత్ర గౌడ మాజీ భర్త మృతి.. అసలేం జరిగిందంటే?
Advertisement

Pavitra Gowda:సినిమాలు, సీరియల్స్ చేస్తూ చక్కగా కెరియర్ కొనసాగిస్తున్న సమయంలో అనుకోకుండా భర్త, పిల్లలు ఉన్నప్పటికీ ఇంకొకరితో రిలేషన్ పెట్టుకోవడం.. అది తట్టుకోలేక అభిమానులు ఆమెపై విచక్షణా రహితంగా విరుచుకుపడడంతో తట్టుకోలేకపోయిన ఆమె..తన ప్రియుడితో చెప్పి అభిమానిని అత్యంత కిరాతకంగా హత్య చేయించింది. అభిమాని హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఊసలు లెక్కబెడుతున్న ఆమెకు మరో షాక్ తగిలింది. మరి ఆమె ఎవరు ? అసలేం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.. కన్నడ హీరో దర్శన్ (Darshan)తో దాదాపు 10 ఏళ్లకు పైగా రిలేషన్ కొనసాగిస్తున్న ప్రముఖ నటి పవిత్ర గౌడ(Pavitra Gowda ) చిత్రదుర్గ రేణుక స్వామి (Renuka swamy) హత్య కేసులో మొదటి ముద్దాయిగా పరప్పన జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

పవిత్ర గౌడ మాజీ భర్త మృతి..

ఈమె మాజీ భర్త సంజయ్ సింగ్ (Sanjay singh) మరణించాడు. అయితే ఆయన మరణించి సుమారుగా 8 నెలల సమయం అవుతున్నా.. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి రావడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా సంజయ్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతూ రాజస్థాన్లో చికిత్స పొందుతూ మృతి చెందాడని సమాచారం. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఎలాంటి అనారోగ్య సమస్యతో మరణించారు? అనే విషయాలు మాత్రం బయటకు తెలియ రావడం లేదు. ఏది ఏమైనా పవిత్ర గౌడ మాజీ భర్త ఎనిమిది నెలల క్రితమే మరణించినా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Advertisement

ALSO READ:ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న జబర్దస్త్ పవిత్ర.. వీడియో వైరల్!

పవిత్ర గౌడ మొదటి భర్త , వివాహం..

పవిత్ర గౌడ ఇండస్ట్రీలోకి రాకముందు చామరాజపేటెలో ఒక సాధారణ యువతిగా ఉన్నప్పుడు సంజయ్ సింగ్ ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. అతడు స్థానికంగా వ్యాపారం చేసేవాడు. పైగా వీరిద్దరి వివాహానికి గుర్తుగా ఒక కూతురు కూడా జన్మించింది. తర్వాత నటన మీద ఆసక్తి పెంచుకున్న పవిత్ర గౌడ టీవీ సీరియల్, సినిమాల ద్వారా భారీగానే పేరు సొంతం చేసుకుంది. ఇకపోతే ఫేమ్ వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ బంధం బీటలు వారింది. అలా ఇద్దరు విడిపోయారు.

తాగుడుకు బానిసై..

Advertisement

ఇక కూతురు తన వద్ద ఉంచుకున్న పవిత్ర గౌడ.. తన కెరియర్ లో బిజీ అయిపోయింది. అయితే ప్రేమించిన భార్య, కన్నకూతురు దూరం అవడంతో సంజయ్ సింగ్ తాగుడుకు బానిస అయ్యాడట. ఇక తర్వాత ఆయన ఎక్కడ కనిపించలేదు. కానీ రేణుక స్వామి హత్య కేసు తరువాత ఆమె గురించి సంజయ్ సింగ్ తొలిసారి మాట్లాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మరణ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

పవిత్ర గౌడ కెరియర్:

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఈమె తొలుత ఫ్యాషన్ డిజైనర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి , ఆ తర్వాత నటిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. 2016లో 54321 అనే చిత్రంతో ఇండస్ట్రీకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత చత్రిగాలు సార్ చత్రిగాలు , ఆగమ్య, సాగువ దారియాలి అనే చిత్రాలలో కూడా నటించింది.

Related News

ఎన్టీఆర్, భూమిక మూవీల తర్వాత మాదే.. ‘మోడ్రన్ మిస్సమ్మ’ నుండి ఫస్ట్ సింగిల్!

‘ఇరుముడి’ హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టాలో తెలుసా..?

తాడ్‌బండ్ ఆలయంలో వరుణ్ తేజ్, లావణ్య ప్రత్యేక పూజలు..

Theater Release : ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

ఆడవాళ్లే ఆడవాళ్లను ఎందుకంటే ..శ్రావణ భార్గవి షాకింగ్ కామెంట్స్!

అంజి మామకు బిగ్ షాక్.. రూ.23 లక్షలు పోయాయట!

విజయ్ పక్కన త్రిష.. విమర్శలకు సంజనా గల్రాని దిమ్మతిరిగే ఆన్సర్!

Big Stories

Advertisement
×