E-Paper
Advertisement

ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో 388 ఎకరాల కబ్జాపై విచారణ జరపాలి: జనసేన

ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో 388 ఎకరాల కబ్జాపై విచారణ జరపాలి: జనసేన
Advertisement

Jana Sena: ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లోని 388 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాపై ఎలాంటి పక్షపాతం లేకుండా తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ జనసేన కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పార్టీ ప్రతినిధులు పలు కీలక ప్రశ్నలను లేవనెత్తారు.

ఆ రూ.1,400 కోట్లు ఎక్కడున్నాయి?

Advertisement

క్విడ్-ప్రో-కో ద్వారా బీఆర్ఎస్‌కు రూ.1,400 కోట్లు సమకూరాయని కేటీఆర్ సోదరి కవిత చెప్పిన విషయాన్ని జనసేన గుర్తుచేసింది. ఇంత పెద్దమొత్తంలో నిధులు ఏ ఖాతాల్లో ఉన్నాయి? వాటికి సంబంధించిన అసలు మూలాలు, ఆడిట్ రికార్డులను వెంటనే బయటపెట్టాలని స్పష్టం చేసింది.

ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా-ఈ రేస్ ఏమయ్యాయి?

Advertisement

గతంలో సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ వ్యవహారంలో రూ.55 కోట్ల కేసు పురోగతి ఏంటో ప్రభుత్వం వెల్లడించాలని కోరింది. దీంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు ఎవరి ఆదేశాలతో, ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారో నిర్ నిర్మొహమాటంగా తేల్చాలంది. గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాలను కూడా బహిర్గతం చేయాలని నిలదీసింది.

అక్రమాలపై సీబీఐ విచారణ..

2014 నాటి ఎన్నికల అఫిడవిట్లలో నాయకులు ప్రకటించిన ఆస్తులకూ, వారి ప్రస్తుత ఆస్తులకూ ఉన్న తేడాపై స్పష్టత ఇవ్వాలని జనసేన కోరింది. రాష్ట్రంలో జరిగిన ప్రజాధనం, భూములు, నిధుల బదిలీలపై పూర్తిస్థాయి విచారణ అవసరమని పేర్కొంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఏమైనా లోపాయికారీ రాజకీయ అవగాహన ఉందా అని అనుమానం వ్యక్తం చేసిన జనసేన.. నిజాలు బయటకు రావాలంటే అవసరమైతే సీబీఐ ద్వారా గానీ, హైకోర్టు పర్యవేక్షణలోని సిట్టింగ్ జడ్జితో గానీ స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.

Also Read: RTA లో అవినీతి దందా.. 9 ఏళ్లుగా ఒకే చోట తిష్ట!

Tags

Related News

మలక్‌పేటలో విషాదం.. యువతికి వీడియో కాల్ చేసి..  కానిస్టేబుల్ ఆత్మహత్య!

RTA లో అవినీతి దందా.. 9 ఏళ్లుగా ఒకే చోట తిష్ట!

పరీక్షల పేరుతో రక్తం పిండుతున్నారా? హుజూరాబాద్‌లో కార్మికుల శాంపిళ్ల సేకరణపై వివాదం!

తల లేదు, కాళ్లు లేవు… NTTPS కాలువలో కట్ చేసిన మొండం! అసలు ఎవరా మహిళ?

కేసీఆర్ ఫాంహౌజ్‌పై కాంగ్రెస్ డ్రామాలు బంద్ చేయాలి- బండి సంజయ్

హైదరాబాద్ టెక్కీ ఆత్మహత్య వెనుక.. అనాథలైన కవలలు, గొడవలే అసలు కారణమా?

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

Big Stories

Advertisement
×