BigTV English

Double Crown Hair: తలపై రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిల్లు అవుతాయా?

Double Crown Hair: తలపై రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిల్లు అవుతాయా?

Double Crown Hair:

ప్రతి ఒక్కరి జుట్టు రంగు, నాణ్యత, ఆకారం భిన్నంగా ఉంటాయి. స్త్రీ, పురుషుల జుట్టు పెరుగుదలలో కూడా తేడా ఉంటుంది. కానీ, చాలా మంది జుట్టుకు సంబంధించి ఓ అంశం కామన్ గా ఉంటుంది. అదే తలపై ఉన్న సుడుడు. స్త్రీలతో పోల్చితే, పురుషులలో తలలోని సుడులు ఈజీగా కనిపిస్తాయి. అయితే, కొంత మంది ఒక సుడి కనిపిస్తే, మరికొందరిలో రెండు సుడులు కనిపిస్తాయి. ఇంతకీ ఎందుకలా కనిపిస్తాయి? వాటి వెనుక కారణాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


రెండు సుడుల వెనుక రహస్యం

స్త్రీల విషయంలో అంతగా చర్చ లేనప్పటికీ, పురుషుల సుడులకు సంబంధించి చర్చ కాస్త ఎక్కువగానే జరుగుతుంది. మగాల్లో రెండు సుడులు చూడగానే వామ్మో రెండు ఉన్నాయి కదా? ఈ వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకుంటాడు అంటూ ఆట పట్టిస్తుంటారు. అయితే, ఇందులో వాస్తవం ఎంత? లేకపోతే అపోహ మాత్రమేనా? శాస్త్రీయ కోణంలో చూస్తే, తలపై ఉన్న సుడులు అనేవి DNA పై ఆధారపడి ఉంటుంది. అంటే, మన తల్లిదండ్రులు, తాతా మామలకు రెండు సుడులు ఉంటే, ఆ లక్షణాలు వారి వారసుల తలకు కూడా బదిలీ చేయబడతాయి. అమెరికాలోని NHGRI అధ్యయనం ప్రకారం, ప్రపంచంలోని 5 శాతం మందికి మాత్రమే వారి తలపై రెండు సుడులు ఉంటాయని వెల్లడించింది. రెండు సుడులు అనేది కాస్త అరుదైన విషయంగా అభివర్ణించింది.

జ్యోతిష్యం ఏం చెప్తుందంటే?

ఇప్పుడు, జ్యోతిషశాస్త్రం కోణం నుంచి పరిశీలిస్తే, రెండు సుడులు ఉన్న వ్యక్తులు ముక్కుసూటిగా, ప్రశాంతంగా, సంయమనంతో, చాలా సహాయకారిగా ఉంటారని చెబుతోంది.  వారి లక్ష్యం వారి చుట్టూ ఉన్న ప్రజలను సంతోషంగా ఉంచడం. అయితే, కొంతమంది జ్యోతిష్కులు అలాంటి వ్యక్తుల వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండవచ్చని వాదిస్తున్నారు. కొన్నిసార్లు మొదటి వివాహం కొనసాగదని, రెండవ వివాహం జరిగే అవకాశం ఉందని నమ్ముతారు. కానీ, దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. రెండు సుడుల గురించి గ్రామాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ, అది కేవలం భౌతిక నిర్మాణం మాత్రమే అనేది మరికొంత మంది వాదన. వాటి ఆధారంగా ఒకరి భవిష్యత్తు, వివాహం, విధిని నిర్ణయించడం తప్పు అంటున్నారు.


రెండు సుడులు ఉంటే అదృష్టమా?

కొన్ని అధ్యయనాలు రెండు సుడులు ఉన్న వ్యక్తులు సృజనాత్మకంగా ఆలోచిస్తారని సూచిస్తున్నాయి. అంతేకాదు, వారిలో  కొత్త ఆలోచనలు ఉంటాయని, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారని వెల్లడించాయి. అందుకే కొంతమంది రెండు సుడులను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అయితే, తలపై రెండు సుడులు ఉండటం కచ్చితంగా అరుదైన విషయంగా పరిగణించాలి. కానీ, అది జన్యుపరమైన కారణాల వల్ల మాత్రమే. జ్యోతిష్యం దీనికి కొన్ని ప్రత్యేక లక్షణాలను ఆపాదిస్తున్నప్పటికీ, వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది విశ్లేషకుల మాట. సో, రెండు సుడులు ఉన్న వారు నిజంగా అదృష్టవంతులుగానే భావించాలి. మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా రెండు సుడులు ఉన్నాయేమో, వెంటనే వారికి ఈ విషయం చెప్పేయండి!

Read Also: వానల్లో జనాలకు సాయం.. స్విగ్గి, జొమాటో డెలివరీ బాయ్స్‌ పై హైదరాబాదీలు ప్రశంసలు!

Related News

Gongura Prawns Curry: గోంగూర రొయ్యల కర్రీ.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తినాల్సిందే !

Vegetable Pulao: రెస్టారెంట్ స్టైల్‌లో వెజిటెబుల్ పులావ్.. ఇలా చేస్తే అదిరపోయే టేస్ట్

Eggs: డైలీ ఎగ్స్ తినడం వల్ల.. మతిపోయే లాభాలు !

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఇలా అస్సలు చేయొద్దు

Pomegranates: దానిమ్మ తినేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా ?

Walking: ఖాళీ కడుపుతో లేదా తిన్న తర్వాత.. ఎప్పుడు నడిస్తే మంచిది ?

Muscle Growth: జిమ్‌కి వెళ్ళాల్సిన పనే లేదు.. మజిల్స్ పెరగాలంటే ఇవి తినండి చాలు

Big Stories

×