Best glass door side by side refrigerator: ప్రస్తుతం మోడ్రన్ కిచెన్‌ల లుక్ పూర్తిగా మారిపోయింది. సాధారణ ఫ్రిడ్జ్‌ల స్థానంలో ప్రీమియం గ్లాస్ డోర్ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్లు ట్రెండ్‌గా మారాయి. ఇవి చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా.. ఎక్కువ స్టోరేజ్ స్పేస్, లేటెస్ట్ కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. మీ బడ్జెట్ కాస్త ఎక్కువగా ఉండి, కిచెన్‌కు రిచ్ లుక్ తేవాలనుకుంటే.. మార్కెట్లో అందుబాటులో ఉన్న.. బెస్ట్ గ్లాస్ డోర్ రిఫ్రిజిరేటర్ల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రత్యేకతలు: గోద్రెజ్ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ మోడల్ స్ట్రామ్ బ్లూ గ్లాస్ డోర్ డిజైన్‌తో అద్భుతంగా కనిపిస్తుంది. ఇది పవర్ సేవ్ చేయడంలో ముందుంటుంది. దీనిలోని కన్వర్టిబుల్ జోన్స్ అవసరానికి తగినట్లుగా స్పేస్‌ను సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. సౌండ్ తక్కువగా ఉండే ఇన్వర్టర్ కంప్రెసర్ దీని సొంతం.
ధర: రూ.69,990
2. హయర్ 596 లీటర్స్ ఎక్స్‌పర్ట్ ఇన్వర్టర్ గ్లాస్ ఫినిష్ ఫ్రిజ్:
ప్రత్యేకతలు: మోడర్న్ ఫ్యామిలీల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించారు. దీని గ్లాస్ ఫినిష్ లుక్ కిచెన్‌కు హై-ఎండ్ వైబ్ ఇస్తుంది. ఇది 100% కన్వర్టిబుల్ స్పేస్‌ను కలిగి ఉంది. అంటే ఫ్రిజ్, ఫ్రీజర్ అవసరాలను మీరు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఇందులో ఉన్న బిల్ట్-ఇన్ వాటర్ డిస్పెన్సర్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు.
ధర: రూ.71,990
3. శామ్‌సంగ్ 653 లీటర్స్ కన్వర్టిబుల్ 5-ఇన్-1 గ్లాస్ ఫినిష్ రిఫ్రిజిరేటర్:
ప్రత్యేకతలు: టెక్ లవర్స్ కు శామ్‌సంగ్ బెస్ట్ ఆప్షన్. డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వచ్చే ఈ ఫ్రిజ్ తక్కువ కరెంట్ వినియోగించుకుంటుంది. దీని 5-ఇన్-1 కన్వర్టిబుల్ మోడ్ ద్వారా ఫ్రీజర్‌ను సాధారణ ఫ్రిజ్‌గా మార్చుకోవచ్చు. దీని గ్లాస్ డోర్ ఫినిషింగ్ ఫింగర్ ప్రింట్స్ పడకుండా చాలా క్లీన్‌గా ఉంటుంది.
ధర: రూ.79,990
4. ఎల్‌జీ 655 లీటర్స్ స్మార్ట్ ఇన్వర్టర్ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్:
ప్రత్యేకతలు: ఎల్‌జీ అంటేనే నమ్మకం. ఈ మోడల్ మల్టిపుల్ ఎయిర్ ఫ్లో కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది. దీని గ్లాస్ , ప్రీమియం ఫినిషింగ్ కిచెన్‌ను మోడర్న్‌గా మారుస్తుంది. ఫుడ్ ఫ్రెష్‌నెస్‌ను కాపాడటంలో ఇది అగ్రగామిగా ఉంది. దీనికి వచ్చే 10 సంవత్సరాల కంప్రెసర్ వారంటీ దీని స్పెషల్ అట్రాక్షన్.
ధర:రూ.76,990
Also Read: తక్కువ ధరలో బెస్ట్ ఎల్జీ టీవీ.. బడ్జెట్ ధరలో అద్భుతమైన క్వాలిటీ
5.వోల్టాస్ బెకో 563 లీటర్స్ ప్రోమార్ట్ ఇన్వర్టర్ గ్లాస్ డోర్ ఫ్రిజ్:
ప్రత్యేకతలు: తక్కువ బడ్జెట్‌లో గ్లాస్ డోర్ లుక్ కోరుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.ఇది ప్రోమార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్‌తో పని చేస్తుంది కాబట్టి శబ్దం చాలా తక్కువగా ఉంటుంది. కూరగాయలు ,పండ్లు చాలా రోజుల పాటు తాజాగా ఉండేలా ఆయోన్ గార్డ్ టెక్నాలజీని ఇందులో పొందుపరిచారు.
ధర: రూ.54,490