LG 24 inch LED TV: ప్రస్తుతం పెద్ద స్క్రీన్ టీవీలతో పాటు, చిన్న రూమ్‌లు, బెడ్‌రూమ్‌లు లేదా ఆఫీసులు, షాపుల కోసం చిన్న సైజ్ టీవీలకు కూడా మంచి డిమాండ్ ఉంది. తక్కువ బడ్జెట్‌లో.. నమ్మకమైన బ్రాండ్ కావాలనుకునే వారికి LG 24 Inch LED Full HD TV (24MN48) ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. సుమారు రూ.8,900 ధరలో లభిస్తున్న ఈ టీవీ, బడ్జెట్ కస్టమర్లకు చక్కటి విజువల్ ఫీల్ అందిస్తుంది. ఈ చిన్న టీవీ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఇళ్లలో అందరూ పెద్ద టీవీలను కోరుకున్నప్పటికీ, కిచెన్, స్టడీ రూమ్, బెడ్‌రూమ్ లేదా చిన్న షాపుల కోసం చిన్న సైజ్ టీవీలు చాలా అవసరం అవుతాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఎల్జీ (LG) నుంచి వస్తున్న ఈ 24 ఇంచుల టీవీ తక్కువ ధరలో బెస్ట్ క్వాలిటీ అందిస్తుంది.
సాధారణంగా ఈ బడ్జెట్‌లో వచ్చే చిన్న టీవీలు కేవలం హెచ్‌డీ రెడీ రిజల్యూషన్‌తో మాత్రమే వస్తాయి. కానీ.. ఈ ఎల్జీ టీవీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది Full HD రిజల్యూషన్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల 24 అంగుళాల చిన్న స్క్రీన్‌పై కూడా వీడియోలు, సినిమాలు చాలా క్లారిటీతో, స్పష్టంగా కనిపిస్తాయి. రంగులు కూడా చాలా సహజంగా ఉంటాయి.
ఈ టీవీలో మరో పెద్ద ప్లస్ పాయింట్ దీని వ్యూయింగ్ యాంగిల్. మీరు గదిలో ఏ కోణంలో కూర్చుని చూసినా పిక్చర్ కలర్స్ మారకుండా స్పష్టంగా కనిపిస్తాయి. గోడకు మౌంట్ చేసుకున్నప్పుడు లేదా టేబుల్ మీద పెట్టుకున్నప్పుడు ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగ పడుతుంది.
చిన్న టీవీ అయినప్పటికీ..అవసరమైన అన్ని రకాల పోర్ట్స్ ఇందులో అందించారు.
HDMI, USB పోర్ట్స్: మీ దగ్గర ఉన్న సెట్-టాప్ బాక్స్, లాప్‌టాప్ లేదా పెన్ డ్రైవ్‌ను ఈజీగా కనెక్ట్ చేసు కోవడానికి హెచ్‌డీఎంఐ , యూఎస్‌బీ పోర్ట్‌లు ఉన్నాయి. దీని వల్ల మీరు మీ పెన్ డ్రైవ్ లోని వీడియోలు, ఫోటోలను నేరుగా టీవీలో ప్లే చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
Also Read: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? దీని కంటే..బెస్ట్ ఉండదేమో !
ఎల్జీ ప్రొడక్ట్ ఎప్పుడూ వాటి మన్నికకు పేరుగాంచాయి. ఈ టీవీ డిజైన్ చాలా సింపుల్‌గా, కాంపాక్ట్‌గా ఉంటుంది. బరువు కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల గోడకు అమర్చడం చాలా ఈజీ. కరెంట్ కూడా తక్కువ ఖర్చు చేసేలాగా దీన్ని రూపొందించారు, కాబట్టి కరెంట్ బిల్లు సమస్య కూడా ఉండదు.
మీ బడ్జెట్ రూ.10,000 లోపు ఉండి, బెడ్‌రూమ్, కిచెన్ లేదా చిన్న షాపులు కోసం ఒక మంచి బ్రాండెడ్ టీవీ కావాలనుకుంటే.. ఈ మోడల్ కచ్చితంగా బెస్ట్ ఛాయిస్. కేవలం రూ.8,900 ధరలో లభించే ఈ టీవీ మీ అవసరాలను పూర్తిగా తీరుస్తుంది.