E-Paper
Advertisement

ఇంటిని డిస్కో థియేటర్‌లా మార్చేయండి! టాప్ 5 హై-పెర్ఫార్మెన్స్ ఎల్జీ సౌండ్‌బార్స్!

ఇంటిని డిస్కో థియేటర్‌లా మార్చేయండి! టాప్ 5 హై-పెర్ఫార్మెన్స్ ఎల్జీ సౌండ్‌బార్స్!
Advertisement

LG Bluetooth Soundbars 2026: ఇంట్లో కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు.. లేదా పాటలు వింటున్నప్పుడు థియేటర్ లాంటి సౌండ్ ఎఫెక్ట్ రావాలంటే.. మంచి సౌండ్‌బార్ ఉండాల్సిందే. ముఖ్యంగా ఆడియో క్వాలిటీని ఎక్కువగా ఇష్టపడేవారి కోసం ఎల్జీ కంపెనీ లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన సౌండ్‌ బార్‌లను మార్కెట్లోకి తెచ్చింది. బ్లూటూత్ కనెక్టివిటీ, డాల్బీ అట్మాస్ , పవర్‌ ఫుల్ సబ్‌వూఫర్‌లతో వస్తున్న ఆ టాప్ 5 హై-పెర్ఫార్మెన్స్ ఎల్జీ సౌండ్‌బార్లు, వాటి ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 5 ఎల్జీ సౌండ్‌బార్లు: 

1. ఎల్జీ ఎస్‌పీసీ2 (LG SPC2 Soundbar):

చిన్న లివింగ్ రూమ్‌ల కోసం, తక్కువ బడ్జెట్‌లో మంచి సౌండ్ కోరుకునే వారికి ఎల్జీ SPC2 పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు క్లియర్ వోకల్స్ దీని ప్రత్యేకత.

Advertisement

ధర: సుమారు రూ.9,990 నుంచి రూ. 12,990 మధ్య అందుబాటులో ఉంది.

2. ఎల్జీ ఎస్ఎన్4 (LG SN4 300W Soundbar) :

300 వాట్ల పవర్‌ఫుల్ అవుట్‌ పుట్‌తో వచ్చే ఈ సౌండ్‌ బార్‌లో ప్రత్యేకమైన కార్బన్ వూఫర్ డయాఫ్రమ్ ఉంటుంది. ఇది మ్యూజిక్ బీట్స్ ,యాక్షన్ మూవీస్ చూసేటప్పుడు అదిరిపోయే బాస్‌ను అందిస్తుంది.

Advertisement

ధర: దీని ధర సుమారు రూ.16,990 నుంచి రూ.21,990 వరకు ఉంది.

3. ఎల్జీ ఎస్‌75క్యూ (LG S75Q 3.1 Ch Dolby Atmos Soundbar):

డాల్బీ అట్మాస్ , DTS:X సపోర్ట్ కోరుకునే మూవీ లవర్స్ కోసం ఇది ఒక అద్భుతమైన మోడల్. 3.1 ఛానెల్ సౌండ్ సిస్టమ్ ద్వారా సౌండ్ నలుమూలల నుంచి వ్యూవర్స్‌కు చేరుతుంది.

ధర: సుమారు రూ.29,900 నుంచి రూ.35,900 ధరలో లభిస్తోంది.

4. ఎల్జీ ఎస్‌95ఆర్‌ఐ (LG S95QR 9.1.5 Ch Premium Soundbar):

ఇది అసలైన ఆడియో ఫైల్స్ కోసం డిజైన్ చేసిన అల్ట్రా-ప్రీమియం మోడల్. 9.1.5 ఛానెల్స్, వైర్‌ లెస్ రియర్ స్పీకర్లతో ఇది నిజమైన సినిమా థియేటర్ ఫీల్ ఇస్తుంది. హై-ఎండ్ సౌండ్ క్వాలిటీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

ధర: మోడల్ ఫీచర్లను బట్టి సుమారు రూ. 89,900 నుంచి రూ.1,09,000 వరకు ఉంటుంది.

Also Read: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026..ఈ పొరపాట్లు చేస్తే మీ డబ్బు వేస్టే!

5. ఎల్జీ ఈజీఎస్ఆర్7 (LG EHS7 Soundbar):

స్లిమ్ డిజైన్ ,మోడ్రన్ లుక్‌తో పాటు పవర్‌ ఫుల్ పెర్ఫార్మెన్స్ అందించే.. ఈ సౌండ్‌ బార్ స్మార్ట్ టీవీలకు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. బ్లూ టూత్ 5.0 సపోర్ట్‌తో స్మార్ట్‌ ఫోన్ నుంచి కూడా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.

ధర: సుమారు రూ.24,900 నుంచి రూ.28,900 మధ్య లభిస్తుంది.

సౌండ్‌బార్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన చిట్కాలు:

1.మీ రూమ్ సైజ్ కు తగిన వాటేజ్ ఉన్న సౌండ్‌ బార్‌ను ఎంచుకోండి.

2.డాల్బీ అట్మాస్ లేదా DTS:X సపోర్ట్ ఉంటే సినిమా సౌండ్ మరింత ఎక్కువగా ఉంటుంది.

3.సేల్ ఆఫర్లు లేదా క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లు వాడుకుంటే.. వీటిని మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

4.మీ ఇంట్లోనే థియేటర్ లాంటి మ్యూజిక్, సినిమా ఫీల్ పొందాలనుకుంటే, ఈ ఎల్జీ బ్లూ టూత్ సౌండ్‌ బార్లలో మీ బడ్జెట్‌కు సరి పోయేదాన్ని ఇప్పుడే ఎంచుకోండి!

Related News

బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు.. Moto Buds 2 Fusion ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!

కొత్త ఫోన్ కొనేటప్పుడు ర్యామ్,ప్రాసెసర్,కెమెరా లేదా ఏది ముఖ్యం?

అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేస్తోన్న Samsung Galaxy Tab S12.. లాంచ్ డేట్ లీక్!

ల్యాప్‌టాప్‌లపై 40% డిస్కౌంట్..స్టూడెంట్స్ అస్సలు మిస్ కావద్దు!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026..ఈ పొరపాట్లు చేస్తే మీ డబ్బు వేస్టే!

కీబోర్డ్‌లో ‘స్పేస్ బార్’ అంత పెద్దగా ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే!

ఫోన్ కెమెరా బాగున్నా ఫోటోలు బాగా రావడం లేదా? ఈ తప్పులు వెంటనే మానేయండి!

Big Stories

Advertisement
×