E-Paper
Advertisement

కళ్యాణ్ రామ్ భయాన్ని పోగొడతానంటున్న అనిల్ రావిపూడి!

కళ్యాణ్ రామ్ భయాన్ని పోగొడతానంటున్న అనిల్ రావిపూడి!
Advertisement

Kalyan Ram:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హిట్ మెషిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి(Anil Ravipudi)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఆయన తీసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటూ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తోంది. అలాంటి అనిల్ రావిపూడి సినిమా వస్తోందంటే చాలు వరుస అప్డేట్లతో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాంటి అనిల్ రావిపూడి స్టేజ్ ఫియర్ తో ఇబ్బంది పడుతున్న కళ్యాణ్ రామ్(Kalyan Ram)భయాన్ని పోగొడతానంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ప్రమోషన్స్ లో అనిల్ రావిపూడితో కళ్యాణ్ రామ్ జోరు..

అసలు విషయంలోకి వెళ్తే డైరెక్టర్ గా మారాలని ఎన్నో కలలు కంటున్న అనిల్ రావిపూడికి ‘పటాస్’ రూపంలో కళ్యాణ్ రామ్ అవకాశం ఇచ్చి అనిల్ రావిపూడికి తన టాలెంటును ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అలాంటి అనిల్ రావిపూడి ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతూ.. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ తో మళ్లీ సినిమా మొదలుపెట్టారు. వెంకటేష్ (Venkatesh ) కళ్యాణ్ రామ్ కలయికలో మల్టీస్టారర్ మూవీగా వస్తున్న సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ను అప్పుడే మొదలు పెట్టేసారు అనిల్ రావిపూడి.

Advertisement

ALSO READ:కార్, నెక్లెస్ గిఫ్ట్ అన్నారు.. కానీ.. బిగ్ బాస్ ప్రైజ్ మనీ గుట్టు రట్టు చేసిన రైతుబిడ్డ!

కళ్యాణ్ రామ్ భయాన్ని పోగొడతానంటున్న అనిల్ రావిపూడి..

ఒకవైపు సినిమా అప్డేట్స్ వదులుతూనే.. మరొకవైపు సినిమా షూటింగ్ విషయాలను వీడియోల రూపంలో పంచుకుంటూ సినిమాపై అంచనాలు పెంచుతున్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు తాను జడ్జిగా వ్యవహరిస్తున్న డ్రామా జూనియర్స్ షో కి తను సినిమా హీరోలను కూడా పిలిపించి ఈ రకంగా కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా అనిల్ రావిపూడి డ్రామా జూనియర్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క సెలబ్రిటీ హాజరవుతూ మరింత క్రేజ్ పెంచేస్తున్నారు. అందులో భాగంగానే నిన్నటికి నిన్న శ్రీకాంత్ (Srikanth ) సతీమణి ఊహా (Ooha) షోకి రాగా.. నేడు కళ్యాణ్ రామ్ విచ్చేసారు.

అనిల్ రావిపూడి భలే సెట్ చేశారే..

Advertisement

అందులో భాగంగానే స్టేజ్ పైకి రాగానే కళ్యాణ్ రామ్ కి టీం స్పెషల్ ఆహ్వానం పలికింది. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ “నాకు స్టేజ్ ఫియర్ ఇంకా పోలేదు అని చెప్పగానే.. శ్రీకాంత్ మాట్లాడుతూ అనిల్ రావిపూడితో సినిమా అంటే ఫియర్ మొత్తం పోయినట్లే అంటూ కామెంట్లు చేశారు” ఇక అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఇప్పుడే మొదలైంది సార్ సినిమా ప్రమోషన్స్ మీతో చాలా చేయించాలి అంటూ చేసిన కామెంట్లు స్పెషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మొత్తానికి అయితే కళ్యాణ్ రామ్ స్టేజ్ ఫియర్ పోగొట్టి ఆయన పబ్లిక్ లో ధైర్యంగా మాట్లాడే ధైర్యాన్ని అనిల్ రావిపూడికి ఇవ్వాలి అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

Big Stories

Advertisement
×