Mi 43 inch 4X TV: ప్రస్తుతం స్మార్ట్ టీవీల హవా నడుస్తోంది. తక్కువ ధరలో.. మంచి 4K క్వాలిటీ, స్మార్ట్ ఫీచర్స్ కావాలనుకునే వారికి.. Mi 43 Inch Ultra HD (4X) టీవీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సుమారు రూ. 26,750 ధరలో లభిస్తున్న ఈ టీవీ, సాధారణ డిస్‌ప్లే కంటే చాలా మెరుగైన విజువల్స్ , సౌండ్ అందిస్తుంది. మీరు మీ పాత టీవీని మార్చాలనుకున్నా లేదా కొత్తగా కొనాలని అనుకున్నా..ఈ టీవీ ఎందుకు బెస్ట్ ఆప్షన్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం టీవీ అంటే చూడటం మాత్రమే కాదు, ఓటిటి కంటెంట్, గేమింగ్ ,స్మార్ట్ ఫీచర్స్ కూడా ముఖ్యం. Xiaomi సంస్థ తీసుకొచ్చిన ఈ 4X సిరీస్ టీవీ బడ్జెట్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది.
ఈ టీవీలో అతిపెద్ద అట్రాక్షన్ దాని 4K UHD రిజల్యూషన్. 10-బిట్ ప్యానెల్ ఉండటం వల్ల రంగులు చాలా సహజంగా, షార్ప్‌గా కనిపిస్తాయి. ఇందులో.. ఉన్న ‘వివిడ్ పిక్చర్ ఇంజిన్’ టెక్నాలజీ, వీడియో క్వాలిటీని మెరుగు పరుస్తుంది. మీరు నెట్‌ఫ్లిక్స్ లేదా ప్రైమ్ వీడియోలో 4K కంటెంట్ చూస్తున్నప్పుడు థియేటర్ ఫీల్ ఖచ్చితంగా పొందుతారు.
చాలా మంది బడ్జెట్ టీవీల్లో సౌండ్ తక్కువగా ఉంటుందని ఫిర్యాదు చేస్తుంటారు. కానీ, Mi 4X టీవీలో 20W స్పీకర్లు ఉన్నాయి. ఇవి డాల్బీ ఆడియో, DTS-HD సపోర్ట్‌తో వస్తాయి. చిన్న లేదా మీడియం సైజ్ గదులకు ఈ సౌండ్ అవుట్‌పుట్ చాలా బాగుంటుంది. మరింత క్లారిటీ కోసం మీరు సౌండ్‌బార్‌ను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు.
Xiaomi టీవీలకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ప్యాచ్‌వాల్ . ఇది కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి యాప్స్ అన్ని ఒకే చోట కనిపిస్తాయి. ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్ కావడంతో.. మీరు ప్లే స్టోర్ నుంచి మీకు నచ్చిన ఏ యాప్‌నైనా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అలాగే, గూగుల్ అసిస్టెంట్ సాయంతో వాయిస్ కమాండ్స్ ఇచ్చి టీవీని కంట్రోల్ చేయొచ్చు.
Also Read: ఏఐ సపోర్ట్‌తో డెల్ ల్యాప్‌టాప్.. స్టూడెంట్స్,ప్రొఫెషనల్స్ కోసం బెస్ట్
ఈ టీవీ చూడటానికి చాలా ప్రీమియంగా ఉంటుంది. స్లిమ్ బెజెల్స్ ఉండటం వల్ల డిస్‌ప్లే పెద్దదిగా కనిపిస్తుంది. ఇందులో 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి గేమ్ కన్సోల్స్ లేదా పెన్‌డ్రైవ్‌లను ఈజీగా కనెక్ట్ చేయవచ్చు.అంతే కాకుండా బ్లూటూత్ 5.0, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉండటంతో ఇంటర్నెట్ వేగంగా పని చేస్తుంది.
మీరు సుమారు రూ. 25,000 నుంచి రూ. 27,000 బడ్జెట్‌లో ఒక నమ్మకమైన 43-ఇంచుల 4K స్మార్ట్ టీవీ కోసం చూస్తుంటే,ఈ మోడల్ కచ్చితంగా వాల్యూ ఫర్ మనీ ఆప్షన్. అయితే.. కొనే ముందు ప్రస్తుత ఆన్‌లైన్ సేల్స్ లేదా బ్యాంక్ ఆఫర్లను చెక్ చేసుకోండి. తద్వారా మీరు ఇంకా తక్కువ ధరకు ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు.