E-Paper
Advertisement

ఏఐ సపోర్ట్‌ డెల్ ల్యాప్‌టాప్.. స్టూడెంట్స్,ప్రొఫెషనల్స్ కోసం బెస్ట్

ఏఐ సపోర్ట్‌ డెల్ ల్యాప్‌టాప్.. స్టూడెంట్స్,ప్రొఫెషనల్స్ కోసం బెస్ట్
Advertisement

Dell 15 AI Powered Laptop: ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి పనికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తోడవుతోంది. కాలేజీ స్టూడెంట్స్ అయినా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులైనా తమ పనులను వేగంగా పూర్తి చేసుకోవడానికి ఏఐ సపోర్ట్ ఉన్న ల్యాప్‌టాప్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. సరిగ్గా టెక్ లవర్స్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ బ్రాండ్ డెల్ సంస్థ ‘Dell 15 AI Powered Laptop’ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. సుమారు రూ. 72,490 ధరలో లభిస్తున్న ఈ ప్రీమియం ల్యాప్‌టాప్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Dell 15 AI Powered Laptop ఫీచర్లు:

1.ప్రాసెసర్, ఏఐ పవర్ :

ఈ ల్యాప్‌టాప్ మెయిన్ హైలైట్ ఇందులో ఉండే.. ఇంటెల్ కోర్ అల్ట్రా 5 225H ప్రాసెసర్. ఇది కేవలం సాధారణ వేగాన్ని మాత్రమే కాకుండా.. ఏఐ ఆధారంగా చేసే పనులను చాలా ఈజీగా నిర్వహించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. మీరు వీడియో ఎడిటింగ్ చేస్తున్నా.. పెద్ద సాఫ్ట్‌వేర్లు రన్ చేస్తున్నా లేదా మల్టీటాస్కింగ్ చేస్తున్నా ఎలాంటి లాగ్ సమస్య లేకుండా చాలా స్మూత్‌గా పని చేస్తుంది.

Advertisement

2.మెమొరీ , స్టోరేజ్:

ఈ డివైజెస్‌లో 8GB DDR5 RAM, ఫాస్ట్ 512GB SSD స్టోరేజ్ దీనిలో అందించారు. డిడిఆర్5 రామ్ కారణంగా అప్లికేషన్లు క్షణాల్లో ఓపెన్ అవుతాయి. అలాగే 512 జీబీ ఎస్ఎస్‌డీ ఉండటం వల్ల మీ డేటా, సినిమాలు, ఆఫీస్ ఫైల్స్ అన్నీ భద్రంగా దాచుకోవడానికి సరిపడా స్పేస్ లభిస్తుంది. సిస్టమ్ బూట్ అయ్యే సమయం కూడా చాలా తక్కువగా ఉంటుంది.

Advertisement

3.డిస్ప్లే, గ్రాఫిక్స్ :

ల్యాప్‌టాప్ వాడేటప్పుడు డిస్ప్లే క్వాలిటీ చాలా ముఖ్యం. ఇందులో 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ యాంటీ-గ్లేర్ డిస్ప్లే ఇచ్చారు. దీనిలో యాంటీ-గ్లేర్ కోటింగ్ ఉండటం వల్ల ఎక్కువ సేపు స్క్రీన్ ముందు కూర్చున్నా.. కళ్ళపై ఒత్తిడి పడదు. ఇక గ్రాఫిక్స్ విషయానికి వస్తే.. ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ సపోర్ట్ ఉండటం వల్ల గేమింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ పనులు ఎంతో చక్కగా చేసుకోవచ్చు.

Also Read: రూ.999కే బ్లూటూత్ కాలింగ్ వాచ్..ఈ ఆఫర్ అస్సలు మిస్ కాకండి!

4.ప్రత్యేక ఫీచర్లు, సాఫ్ట్‌వేర్ :

ఈ ల్యాప్‌ టాప్‌లో కీబోర్డ్‌పై ప్రత్యేకంగా ‘డెడికేటెడ్ కోపైలట్ కీ’ఇచ్చారు.కేవలం.. బటన్ నొక్కితే చాలు, విండోస్ ఏఐ అసిస్టెంట్ మీ సహాయానికి సిద్ధంగా ఉంటుంది. అలాగే.. రాత్రి పూట పని చేసుకోవడానికి బ్యాక్‌ లిట్ కీబోర్డ్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. సాఫ్ట్‌వేర్ పరంగా.. ఇది లేటెస్ట్ విండోస్ 11 హోమ్, మైక్రో సాఫ్ట్ ఆఫీస్ హోమ్ & స్టూడెంట్ 2024తో వస్తుంది. కాబట్టి కొన్న వెంటనే ఆఫీస్ పనులు ప్రారంభించవచ్చు.

మీరు మీ బడ్జెట్ పరిధిలో అడ్వాన్స్డ్ ఏఐ ఫీచర్లు, అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్, లాంగ్ లాస్టింగ్ బిల్డ్ క్వాలిటీ ఉన్న ల్యాప్‌ టాప్ కోసం వెతుకుతుంటే..రూ.72,490 ధరలో లభించే ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడే దీన్ని మీ సొంతం చేసుకొని మీ డిజిటల్ లైఫ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోండి మరి..

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×