Best microwave oven in India: మన ఇండియన్ కిచెన్‌లో మైక్రోవేవ్ అంటే.. కేవలం చల్లారిన ఫుడ్ వేడి చేసుకోవడానికి మాత్రమే అనుకుంటే పొరపాటే! రోజు వారీ వంటలో టైమ్ సేవ్ చేయడంతో పాటు క్రిస్పీ తందూరీ, టేస్టీ కేకులు, ఆయిల్ లెస్ స్నాక్స్ చేయాలంటే.. సరైన మైక్రోవేవ్ ఓవెన్ ఉండాల్సిందే. ముఖ్యంగా మీ అవసరాలకు తగ్గట్టుగా బేకింగ్, గ్రిల్లింగ్, రీహీటింగ్ వంటి మల్టీ టాస్కింగ్ ఈజీ చేసే టాప్ 5 మైక్రోవేవ్ ఓవెన్లను ఇప్పుడు చూద్దాం.
పెద్ద ఫ్యామిలీలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. 30 లీటర్ల కెపాసిటీతో.. వచ్చే ఈ ఓవెన్ బేకింగ్, రోస్టింగ్‌కి అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో మోటరైజ్డ్ రోటిస్సరీ ఉంటుంది. దీని వల్ల చికెన్ గ్రిల్ లేదా పనీర్ టిక్కా ఈవెన్‌గా తయారవుతాయి. 101 ఆటో-కుక్ మెనూలు, స్టెయిన్‌లెస్ స్టీల్ క్యావిటీ దీని ప్రత్యేకతలు.
హెల్దీగా, టేస్టీగా వండుకోవాలి అనుకునేవారికి LG చార్కోల్ సిరీస్ బెస్ట్. దీనిలోని స్పెషల్ ఫీచర్ వల్ల రెస్టారెంట్ తిన్నంత నాచురల్ తందూరీ టేస్ట్ వస్తుంది. తక్కువ ఆయిల్‌తో ఫ్రైస్ చేసుకునే ‘Diet Fry’ ఆప్షన్, అలాగే ఇంట్లోనే పెరుగు, నెయ్యి చేసుకునే ఇండియన్ కుకింగ్ ఫీచర్లు ఉన్నాయి.
ఫ్యామిలీ సైజుకి బడ్జెట్ ఫ్రెండ్లీగా, స్టైలిష్‌గా ఉండే మైక్రోవేవ్ ఇది. దీనిలోని ‘Slim Fry’ టెక్నాలజీ వల్ల ఆయిల్ లేకుండా లేదా చాలా తక్కువ నూనెతో క్రిస్పీ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. అంతే కాకుండా దీని లోపల సిరామిక్ ఎనామెల్ క్యావిటీ ఉండటం వల్ల తుప్పు పట్టదు. క్లీన్ చేయడం చాలా ఈజీ.
తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, ఎక్కువ టైం వారంటీ కోరుకునే వారికి ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్. అంతే కాకుండా దీనిలోని మల్టీ-స్టేజ్ కుకింగ్, గ్రిల్లింగ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. 5 ఏళ్ల కాంప్రహెన్సివ్ వారంటీతో రావడం వల్ల ఇది ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది.
Also Read: తక్కువ ధరలో అదిరిపోయే సౌండ్..మ్యూజిక్ లవర్స్‌కు పండగే!
చిన్న లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు (3-4 మంది ఉన్న ఇళ్లకు) ఈ కాంపాక్ట్ మైక్రోవేవ్ సెట్ అవుతుంది. ‘360° Heat Wrap’ టెక్నాలజీతో ఏ ఫుడ్ అయినా సమానంగా వేడి అవుతుంది. లేదా కుక్ అవుతుంది.అంతే కాకుండా తక్కువ స్థలం దీనికి సరిపోతుంది, క్విక్ డీఫ్రాస్ట్, రీహీటింగ్ ఫీచర్లు చాలా ఫాస్ట్‌గా పని చేస్తాయి.
Also Read:రూ.1,599 ధరకే.. బ్లూటూత్ సౌండ్‌బార్, ఆర్జీబీ లైట్లతో..అద్దిరిపోయే సౌండ్
మీ ఇంట్లో బేకింగ్, గ్రిల్లింగ్ రెగ్యులర్‌గా చేస్తుంటే.. IFB లేదా lg మోడల్స్ తీసుకోవడం మంచిది. బడ్జెట్ , డైలీ రీహీటింగ్ అవసరం అయితే Samsung లేదా Panasonic పర్ఫెక్ట్ గా సరి పోతాయి. మీ ఇంటి సభ్యుల సంఖ్య, బడ్జెట్‌ను బట్టి సరైన మోడల్‌ను ఎంచుకోండి.