E-Paper
Advertisement

అమెజాన్‌లో బెస్ట్ సెమీ ఆటోమేటిక్.. వాషింగ్ మెషీన్లు

అమెజాన్‌లో బెస్ట్ సెమీ ఆటోమేటిక్.. వాషింగ్ మెషీన్లు
Advertisement

Best semi automatic washing machine: ఏంటండీ.. ఉతకాల్సిన బట్టలు చూస్తుంటేనే.. కళ్లు బైర్లు కమ్ముతున్నాయా? ఉదయం లేచింది.. మొదలు ఆఫీస్ పరుగులొకవైపు, పిల్లల స్కూల్ యూనిఫాంల గోల మరో వైపు, ఇంట్లో పెద్దల బట్టలు, బెడ్‌ షీట్ల మోతతో నలిగిపోతున్న లార్జ్ ఫ్యామిలీల కోసం ఇదిగో అసలైన గుడ్ న్యూస్! గంటల తరబడి బట్టలు.. నాన బెట్టి ఉతికే.. రోజులు పోయాయి. ఇప్పుడు మార్కెట్‌ను షేక్.. చేస్తున్న టాప్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు.. అమెజాన్‌లో అదిరి పోయే.. ఆఫర్లతో దొరుకుతున్నాయి.  ఆ అల్టిమేట్ టాప్-5 వాషింగ్ మెషీన్లు ఏంటో  ఇప్పుడు చూసేద్దాం.

1.వర్ల్‌పూల్ 11 కేజీ వాషింగ్ మెషీన్:

పెద్ద ఫ్యామిలీల కోసం వర్ల్‌పూల్ బ్రాండ్ తెచ్చిన ఈ 11 కేజీల జెయింట్ మెషీన్ మార్కెట్లో.. సెన్సేషన్ సృష్టిస్తోంది. ఒక్క సారితో గుట్టల కొద్దీ బట్టలను ఇది ఇటుకలా.. ఉతికి పారేస్తుంది. ఇందులో ఉండే 3D టర్బో ఇంపెల్లర్ , డైనమిక్ డిటర్జెంట్ డిస్పెన్సర్ వల్ల బట్టలపై ఒక్క చిన్న మురికి మరక కూడా మిగలదు. ఇక ధర విషయానికి వస్తే.. అమెజాన్‌లో ఇది సుమారు రూ.13,500 నుంచి రూ.15,000 మధ్యలో అందుబాటులో ఉంది.

2.శాంమ్సంగ్ 10.5 కేజీ  వాషింగ్ మెషీన్:

Advertisement

టెక్నాలజీలో రారాజు అయిన శాంమ్సంగ్ నుంచి వచ్చిన ఈ 10.5 కేజీల మోడల్ లార్జ్ ఫ్యామిలీలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 5-స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉండటంతో.. కరెంట్ బిల్లు షాక్ అస్సలు తగలదు. దీని లోని ఏయిర్ టర్బో డ్రై సిస్టమ్ బట్టలను మెరుపు వేగంతో ఆరబెట్టేస్తుంది. ఈ ట్రెండీ అండ్ పవర్‌ఫుల్ మెషీన్ ధర అమెజాన్‌లో.. దాదాపు రూ. 14,990 వరకు ఉంది.

3.లాయిడ్ 9 కేజీ వాషింగ్ మెషీన్:

ఎక్కువ బట్టలు ఉతికే వారికి లాయిడ్ 9 కేజీ వాషింగ్ మెషీన్ ఒక అద్భుతమైన ఆప్షన్. ఇది సూపర్-స్ట్రాంగ్ మోటార్‌తో వస్తుంది కాబట్టి, మందపాటి జీన్స్‌లు, పెద్ద బెడ్‌ షీట్లను కూడా ఇట్టే ఉతుకుతుంది. రస్ట్-ప్రూఫ్ బాడీ ఉండటం వల్ల ఇది చాలా కాలం పాటు మెరుస్తూ మన్నుతుంది. ఈ స్టైలిష్ మెషీన్ ధర సుమారు రూ. 11,500 వద్ద ట్రెండింగ్‌లో ఉంది.

Advertisement

Also Read: చేతికి అదిరిపోయే లుక్.. బెస్ట్ అమోలెడ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్!

4.టీసీఎల్ 8.5 కేజీ  వాషింగ్ మెషీన్:

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ కెపాసిటీ కావాలనుకునే.. స్మార్ట్ బయ్యర్ల కోసం టీసీఎల్ 8.5 కేజీ వాషింగ్ మెషీన్ పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. దీని హై-స్పిన్ స్పీడ్ బట్టల్లోని.. నీటిని చిటికెలో పిండేస్తుంది. అంతేకాదు.. మ్యాజిక్ ఫిల్టర్ బట్టల నుంచి వచ్చే నురుగును నీట్‌గా తొలగిస్తుంది. ఈ పాకెట్-ఫ్రెండ్లీ వాషింగ్ మెషీన్ ధర అమెజాన్‌లో సుమారు రూ. 10,000 నుంచి రూ. 11,000 లోపే లభిస్తోంది.

5.పానాసోనిక్ 8 కేజీ  వాషింగ్ మెషీన్:

క్వాలిటీలో ఏమాత్రం రాజీపడని వారి కోసం పానాసోనిక్ 8 కేజీ సెమీ ఆటోమేటిక్ మెషీన్ అదిరి పోయే పర్ఫార్మెన్స్ ఇస్తుంది.పవర్ ఫుల్ టెక్నాలజీ మొంచి మరకలను ఇట్టే వదిలిస్తుంది. తక్కువ నీటి సరఫరా ఉండే ఇళ్లకు ఇది బెస్ట్ ఛాయిస్. ఈ ప్రీమియం లుకింగ్ మెషీన్ ధర అమెజాన్‌లో సుమారు రూ.11,990 దాకా ఉంది.

Related News

85 ఇంచుల బిగ్ స్క్రీన్, గూగుల్ జెమిని ఫీచర్.. హైయర్ నుంచి అద్భుతమైన స్మార్ట్ టీవీలు!

క్షణాల్లోనే ఇల్లు తళతళా మెరిసిపోవాలా? టాప్ 5 వాక్యూమ్ క్లీనర్లు మీ కోసం!

రూ.11,000 లోపే 6000mAh బ్యాటరీ ఫోన్.. మార్కెట్‌లోకి బోల్ట్ ఏస్ 5G, బోల్ట్ ఈవో!

ఇక వాట్సప్ స్టిక్కర్లకు కొదవలేదు.. ChatGPTలో క్రేజీ ఫీచర్.. మీ ఆలోచనలతోనే స్టిక్కర్లు!

ఆ రాత్రి హాస్టల్ రూమ్‌లో జరిగిన ఆ చిన్న తప్పు.. ప్రపంచాన్ని ఏలే Googleగా ఎలా అవతరించింది?

ఈ రక్షా బంధన్‌కు కజిన్స్‌ను ఇంప్రెస్ చేసే 5 యూనిక్ టెక్ గిఫ్ట్స్.. బడ్జెట్ ధరలోనే!

బడ్జెట్ యూజర్లకు పండగే పండగ.. రూ.10 వేలలోపు మూడేళ్ల వారంటీతో Realme C100i వస్తోంది!

Big Stories

Advertisement
×