E-Paper
Advertisement

రూ.15వేలలోపు.. బెస్ట్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లు!

రూ.15వేలలోపు.. బెస్ట్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లు!
Advertisement

Best single door refrigerator under 15000: ఇంట్లో చిన్న కిచెన్ ఉందా? తక్కువ బడ్జెట్‌లో.. మంచి ఫ్రిజ్ కొనాలని చూస్తున్నారా? చిన్న ఫ్యామిలీలకు కొన్ని రకాల సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లు బెస్ట్ ఆప్షన్. ఇవి తక్కువ కరెంట్ వాడుకుంటూ.. తక్కువ ప్లేస్‌లో ఇమిడిపోతాయి. ప్రస్తుత మార్కెట్లో రూ.15,000 లోపు అనేక అద్భుతమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఎనర్జీ ఎఫిషియంట్ ఫీచర్స్, స్టైలిష్ లుక్ , బెస్ట్ కూలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే మోడల్స్ కూడా మార్కెట్‌లో ఉంటాయి.

నేటి బిజీ లైఫ్‌లో ఫ్రిజ్ అనేది ప్రతి ఇంటికి అత్యవసరం. ముఖ్యంగా బ్యాచిలర్స్ లేదా చిన్న ఫ్యామిలీల విషయానికి వస్తే.. భారీ సైజు రిఫ్రిజిరేటర్లు అవసరం ఉండదు. తక్కువ ధరలో.. ఎక్కువ కూలింగ్ ఇచ్చే సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లు వాడటానికి ఇష్టపడుతున్నారు. మరి మీ బడ్జెట్ కూడా రూ.15,000 లోపు ఉంటే, అమెజాన్‌లో లభిస్తున్న ఈ టాప్ 5 మోడల్స్ పై ఓ లుక్కేద్దామా..

1. LG 185 L 5 Star Inverter Direct-Cool Single Door:

Advertisement

LG రిఫ్రిజిరేటర్లు ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. ఇందులో ఇన్వర్టర్ కంప్రెసర్ ఉండటం వల్ల కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువ వస్తుంది. ఇది 5 స్టార్ రేటింగ్‌తో వస్తుంది కాబట్టి ఎనర్జీ సేవింగ్స్ విషయంలో.. నంబర్ వన్ అని చెప్పొచ్చు.

ధర: రూ.14,500 – రూ.14,990

2.Samsung 183 L 3 Star Digital Inverter:

Advertisement

శామ్‌సంగ్ ఫ్రిడ్జ్‌లు స్టైలిష్ డిజైన్‌కు మారుపేరు. ఇందులో ‘డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ’ ఉంటుంది. దీని వల్ల పవర్ కట్స్ ఉన్నప్పుడు కూడా ఇన్‌వర్టర్‌పై పని చేస్తుంది. చిన్న కిచెన్ లుక్ చాలా వరకు మార్చేస్తుంది. తక్కువ ధరలో బెస్ట్ మోడల్స్ కావాలనుకునే వారు వీటిని కొనొచ్చు.

ధర: రూ.13,000-రూ.13,800

3. Whirlpool 184 L 2 Star Direct-Cool:

తక్కువ ధరలో బెస్ట్ కూలింగ్ కావాలనుకునే వారికి వర్ల్పూల్ బెస్ట్ ఛాయిస్. ఇందులో ‘ఇన్సులేటెడ్ క్యాపిల్లరీ టెక్నాలజీ’ ఉంటుంది. దీని వల్ల పవర్ కట్ అయినా కూలింగ్ చాలా సేపు ఉంటుంది.

ధర: రూ.11,500 – రూ.12,200

4. Godrej 180 L 2 Star Home Direct-Cool:

ఇండియన్ వాతావరణానికి తగినట్లుగా గోద్రేజ్ రిఫ్రిజిరేటర్లు తయారు చేసారు. ఇందులో ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ వాడతారు. కాబట్టి ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ స్పేస్ కావాలనుకునే.. వారికి ఇది పర్ఫెక్ట్.

ధర: సుమారు రూ.10,500 – రూ.11,200

5. Haier 170 L 2 Star Direct-Cool:

చాలా చిన్న కుటుంబాలు లేదా బ్యాచిలర్లకు ఇది సరి పోతుంది. ఇది చాలా కాంపాక్ట్ సైజులో ఉంటుంది. తక్కువ ధరలో.. మంచి కూలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు ఇది ఎప్పుడూ మొదటి వరుసలో ఉంటుంది.

ధర: సుమారు రూ.9,500 – రూ.10,200

Also Read: రూ.899కే బోట్ హెడ్‌ఫోన్స్.. ఆఫీస్ మీటింగ్స్, కాల్స్ కోసం ఫర్ఫెక్ట్

ఫ్రిజ్ కొనేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి:

స్టార్ రేటింగ్: వీలైనంత వరకు 3 స్టార్ లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్నవి ఎంచుకోండి, ఇది కరెంట్ ఆదా చేస్తుంది.

స్టెబిలైజర్: మీ ఏరియాలో వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఉంటే.. స్టెబిలైజర్-ఫ్రీ ఆపరేషన్ ఉండే మోడల్స్ చూసుకోండి.

సర్వీస్: బ్రాండ్ సర్వీస్ సెంటర్ మీ ఇంటికి దగ్గరగా ఉందో లేదో చెక్ చేసుకోండి

తక్కువ స్థలం, తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు పైన పేర్కొన్న రిఫ్రిజిరేటర్లు బెస్ట్. ఇవి కేవలం మీ ఆహారాన్ని తాజాగా ఉంచడమే కాకుండా.. మీ కిచెన్‌కి అందాన్ని కూడా ఇస్తాయి. అమెజాన్ సేల్స్ సమయంలో వీటిపై ఇంకా మంచి డిస్కౌంట్లు లభించే అవకాశం ఉంది. కాబట్టి ఆఫర్లను చెక్ చూస్తూ ఉండండి.

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×