E-Paper
Advertisement

అల్లు అర్జున్ మూవీలో సీరియల్ బ్యూటీకి ఛాన్స్.. ఇదిగో ప్రూఫ్..

అల్లు అర్జున్ మూవీలో సీరియల్ బ్యూటీకి ఛాన్స్.. ఇదిగో ప్రూఫ్..
Advertisement

Podarillu : స్టార్ మా ప్రేక్షకులకు పొదరిల్లు సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ సీరియల్ మొదలయ్యి కొద్దిరోజులు అయినా కూడా మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఇటీవల కాలంలో ఈ సీరియల్ కన్నా క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఐదుగురు ఆ మగవాళ్ళు ఉన్న ఇంటికి ఒక ఆడపిల్ల వెళితే ఎలా ఉంటుంది అన్న స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ రోజురోజుకీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. ఇటీవల కాలంలో ఈ సీరియల్ లో ఎన్ని ట్విస్టులు ఎదురైనా కూడా జనాలు మాత్రం ఆదరిస్తూనే వదుస్తున్నారు. ఇందులో కన్నడ హీరోయిన్ కృతిక ఉమాశంకర్ మహాలక్ష్మి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ అమ్మడు గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈమె ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ మరోసారి వార్తలు ఊపందుకున్నాయి.. మహాలక్ష్మి అల్లు అర్జున్ సినిమాలో నటిస్తుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. అసలు అల్లు అర్జున్ సినిమాలో ఈమెకు అవకాశం ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం.

అల్లు అర్జున్ మూవీలో ఛాన్స్..?

పొదరిల్లు సీరియల్ హీరోయిన్ మహాలక్ష్మి అలియాస్ కృతిక ఉమాశంకర్ అల్లు అర్జున్తో దిగిన ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. అల్లు అర్జున్ అభిమానులు మహాలక్ష్మి అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అల్లు అర్జున్ తో మహాలక్ష్మి ఎక్కడ ఫోటో దిగింది అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. కేవలం పొదిరిల్లు మహాలక్ష్మి మాత్రమే కాదు చక్రీ కూడా అల్లు అర్జున్తో ఫోటో దిగాడు.. ఫోటోలను కూడా ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. అల్లు అర్జున్ ని వీళ్లిద్దరు ఎక్కడ కలిశారు? సినిమాలో ఏమైనా నటిస్తున్నారా..? అసలు అల్లు అర్జున్ ఎందుకు వీళ్ళతో ఫోటో దిగాడు? అన్న ప్రశ్న అభిమానుల్లో వినిపిస్తుంది. ఏది ఏమైనా కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పక్కన వీళ్లిద్దరు ఫోటోలు దిగడంతో వాళ్ల అభిమానులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు.. మరి వీళ్ళిద్దరూ ఆయన సినిమాలో నటిస్తున్నారా? లేదా? అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే..

Advertisement

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. అల్లు అర్జున్, తమిళ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రాకా చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజైన పోస్టర్లు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆ పోస్టర్లో ఆయన లుక్కు చూసి ఫీదా అయిపోయారు.. ప్రస్తుతం ‘రాకా’ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను ముంబైలో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది.. త్వరగా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయాలి అని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసిందే. ఈ రెండు సినిమాల తర్వాత సుకుమార్ డైరెక్షన్లో పుష్ప 3 షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం..

Advertisement

 

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ మాటతో రామరాజు షాక్.. శ్రీవల్లి ఫుల్ హ్యాపీ.. ప్రేమను రెచ్చగొట్టిన వల్లి..

Related News

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. శృతి దొరుకుతుందా..? ప్రభాకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. గోపికకు మైండ్ బ్లాక్.. మాధవ్ కు టెన్షన్..

Karthika Deepam 2 Serial Today Episode September 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని బెదిరించడంతో జ్యోత్స్నను జాబ్ లోంచి తీసేసిన కేఫ్ ఓనరు             

Illu Illalu Pillalu Today Episodes: భాగ్యంకు షాక్.. ప్రేమ మాటతో ఫ్యూజుల్ అవుట్.. ప్రేమ పెళ్లికి రెడీ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్.. అవని దెబ్బకు షాక్.. పల్లవి పై అనుమానం..

Gundeninda Gudigantalu : ఒడియమ్మ బంటి.. ఒకరు కాదు.. ఇద్దరు అవుట్..

Big Stories

Advertisement
×