Best TVs under 50000: ప్రస్తుత రోజుల్లో ఇళ్లలో హోమ్ థియేటర్ సెటప్ అనేది సర్వసాధారణం అయిపోయింది. పెద్ద స్క్రీన్, క్రిస్టల్ క్లియర్ సౌండ్, అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ కోరుకునే.. వారి కోసం మార్కెట్లో అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే రూ. 50,000 లోపు బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్ టీవీని.. ఎంచుకోవడం కొంచెం కష్టమైన పనే. అదృష్టవశాత్తు, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో.. హై-ఎండ్ టీవీలు కూడా భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. వాటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రాండ్ , క్వాలిటీ విషయంలో సోనీకి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. రూ.50,000 బడ్జెట్‌లో సోనీ బ్రావియా 4K స్మార్ట్ టీవీ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎక్స్-రియాలిటీ ప్రొ టెక్నాలజీ, డాల్బీ ఆడియో సపోర్ట్ దీని సొంతం. సినిమాలు చూసేటప్పుడు రంగులు చాలా సహజంగా, అద్భుతంగా కనిపిస్తాయి. సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్లతో ఇది మరింత తక్కువ ధరకే లభిస్తుంది.
పెద్ద స్క్రీన్ కోరుకునే వారి కోసం శాంసంగ్ 55 అంగుళాల మోడల్ పర్ఫెక్ట్ ఛాయిస్. 4K రిజల్యూషన్, మెగా కాంట్రాస్ట్ , ప్యూర్‌కలర్ టెక్నాలజీతో ఇది వస్తుంది. అంతే కాకుండా స్లీక్ డిజైన్, వైఫై కనెక్టివిటీ దీని ప్రత్యేకతలు. అమెజాన్ సేల్‌లో ఈ మోడల్‌పై భారీ ప్రైస్ కట్ అందుబాటులో ఉంది.
ఎల్జీ ప్రత్యేకమైన webOS ప్లాట్ ఫారమ్‌పై పని చేసే ఈ టీవీ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ దీని స్పెషల్ అట్రాక్షన్. α5 AI ప్రాసెసర్ 4K జెన్6 టెక్నాలజీ కారణంగా.. వీడియో క్వాలిటీ చాలా షార్ప్‌గా ఉంటుంది. గేమింగ్ లవర్స్ కూడా ఇది చక్కటి ఫీల్ ఇస్తుంది.
Also Read: బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!
తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి TCL బ్రాండ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. 55 ఇంచుల పెద్ద క్యూఎల్ఈడీ స్క్రీన్, డాల్బీ విజన్ ,డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్‌తో ఇది వస్తుంది. గూగుల్ టీవీ ఓఎస్ ద్వారా అన్ని ఓటీటీ యాప్‌లను ఈజీగా యాక్సెస్ చేయెచ్చు. రూ.50వేల లోపు లభించే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీ ఇది.
బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో లేటెస్ట్ ఫీచర్లు కోరుకునేవారికి.. షావోమి లేదా ఐక్యూ 55 ఇంచ్ మోడల్స్ చక్కగా సరి పోతాయి. వివిడ్ పిక్చర్ ఇంజిన్,పవర్ ఫుల్ స్పీకర్లు , స్టైలిష్ బెజెల్‌లెస్ డిజైన్ వీటి సొంతం. సేల్ సమయంలో లభించే కూపన్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ల ద్వారా వీటిని మరింత ఈజీగా కొనొచ్చు.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ సమయంలో.. లభించే ఈ అద్భుతమైన ఆఫర్లను సద్వినియోగం చేసుకొని, మీ బడ్జెట్‌కు సరి పోయే బెస్ట్ స్మార్ట్ టీవీని ఇంటికి తెచ్చుకోండి. అద్భుతమైన విజువల్స్ ,సౌండ్‌తో మీ ఎంటర్ టైన్మెంట్ డబుల్ చేసుకోండి.