Best earbuds under 1000: స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందంటే ఇయర్ బడ్స్ లేకుండా క్షణం కూడా గడవని రోజులు ఇవి.ప్రయాణాల్లో ఉన్నా, ఆఫీస్ వర్క్ చేస్తున్నా, లేదా జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్నా మ్యూజిక్ మనకు మంచి కంపెనీ ఇస్తుంది. అయితే.. ఎక్కువ ధర పెట్టి కొనలేక, అలా అని చీప్ క్వాలిటీ వస్తువులు వాడ లేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం ప్రముఖ బ్రాండ్లు రూ.1,000లోపు బడ్జెట్లోనే అద్భుతమైన ఫీచర్లతో ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్ బడ్స్‌ను మార్కెట్లోకి తెచ్చాయి. అవేంటో ఇప్పుడు డీటెయిల్డ్‌గా చూద్దాం!
యూత్‌లో బోట్ బ్రాండ్‌కు ఉండే క్రేజే వేరు.రూ.1,000 లోపు బడ్జెట్లో బోట్ సంస్థ అందించే కొన్ని ఎంట్రీ లెవెల్ ఇయర్‌బడ్స్ అద్భుతమైన బేస్ క్వాలిటీని ఇస్తాయి.బడ్జెట్లో మంచి ఇయర్ బడ్స్ కావాలనుకునే వారికి ఇది ఫర్పెక్ట్ అని చెప్పొచ్చు.
ధర:సుమారు రూ.799 – రూ.999 మధ్య లభిస్తుంది.
ప్రత్యేకతలు: ఏఎస్ఏపీ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, రోజంతా సరి పోయే బ్యాటరీ బ్యాకప్, వాటర్ రెసిస్టెన్స్ దీనిలో ఉంటాయి.
అతి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే.. వారికి పిట్రాన్ ఒక మంచి ఛాయిస్. ఈ బడ్స్ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉండి, చెవిలో చాలా బాగా సెట్ అవుతాయి.ధర కూడా చాలా తక్కువ కాబట్టి ఈజీగా కొనొచ్చు.
ధర: దాదాపు రూ.699-రూ.899 ధరలో దొరుకుతాయి.
ప్రత్యేకతలు: హెచ్డీ సౌండ్ క్వాలిటీ, టచ్ కంట్రోల్స్ ,మంచి కాల్ క్లారిటీ కోసం బిల్ట్-ఇన్ మైక్ ఉంటుంది.
ట్రెండీ డిజైన్లు, ఫ్యూచరిస్టిక్ లుక్‌తో వచ్చే బౌల్ట్ ఇయర్ బడ్స్ తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయి. మ్యూజిక్ లవర్స్‌కి ఇది మంచి ఆప్షన్.
ధర: సుమారు రూ.849-రూ.999రేంజ్లో ఉంది.
ప్రత్యేకతలు: లాంగ్ బ్యాటరీ లైఫ్ (టోటల్ ప్లేటైమ్ ఎక్కువ), గేమింగ్ కోసం తక్కువ లేటెన్సీ మోడ్.
మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అయిన మివి తన క్వాలిటీకి చాలా పేరు సంపాదించింది. తక్కువ బడ్జెట్ లో క్లియర్ ఆడియో, పంచీ బేస్ కోరు కునే వారికి ఇది పర్ఫెక్ట్.
ధర: సుమారు రూ.899-రూ.999 మధ్య లభిస్తుంది.
ప్రత్యేకతలు: అద్భుత మైన స్పీకర్ డ్రైవర్లు, ఎక్కువ సేపు నిలిచే బ్యాటరీ , బలమైన బిల్డ్ క్వాలిటీ.
Also Read: ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!
బడ్జెట్ యాక్సెసరీస్‌లో జెబ్రోనిక్స్ ఎప్పుడూ ముందుంటుంది. స్టైలిష్ కలర్స్, కాంపాక్ట్ ఛార్జింగ్ కేస్‌తో ఇవి వస్తాయి.
ధర: సుమారు రూ.749-రూ.899 వరకు ఉంటుంది.
ప్రత్యేకతలు: వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, ఈజీ బ్లూటూత్ కనెక్టివిటీ ,డీసెంట్ బ్యాటరీ బ్యాకప్.
రూ.1,000 లోపు బడ్జెట్లో బెస్ట్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వారికి ఈ ఆప్షన్లు అదుర్స్ అనిపించక మానవు. మీ బడ్జెట్, అవసరాలకు తగినట్లు వీటిలో మీకు నచ్చిన మోడల్‌ను ఎంచుకోండి.