Kalki sequel:ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhash) హీరోగా తెరకెక్కిన విజువల్ వండర్ కల్కి 2898AD. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్ల వసూలు సాధించడమే కాకుండా ఎన్నో జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయం అందుకోవడంతో ఈ సినిమాకి కొనసాగింపుగా సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అయితే ఈ సినిమా ఉంటుందని ప్రకటించినప్పటికీ, సినిమాకు సంబంధించి ఏ విషయం కూడా బయట పెట్టకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ఈమధ్య ఆడియన్స్ లో ఆసక్తి కలిగించడానికి ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అప్డేట్, కాస్టింగ్ వివరాలు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ మొదటి భాగం మంచి సక్సెస్ అందుకోవడంతో.. ఇప్పుడు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా సీక్వెల్ ప్లానింగ్ తో దూసుకుపోతున్నారు.. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి అని సమాచారం. అయితే మరోవైపు ప్రభాస్ తన ఇతర బడా ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల షూటింగ్ ను కాస్త తాత్కాలికంగా కొన్నాళ్లపాటు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది . ఇకపోతే తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మళ్లీ రంగంలోకి దిగారు. అక్టోబర్ చివర్లోనే ప్రధాన తారాగణంతో కొత్త షెడ్యూల్ ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నామని ప్రకటించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా మరొకవైపు కల్కి మొదటి భాగంలో గర్భవతి అయిన సుమతి పాత్రలో బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకొనే చాలా అద్భుతంగా నటించారు. అయితే రెండవ భాగంలో ఆమె స్థానంలో ఎవరు నటిస్తారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ విషయంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. సుమతి పాత్రను సీక్వెల్ లో కొనసాగించాలని అనుకోవట్లేదు అని చెప్పి రూమర్స్ కి చెక్ పెట్టారు. అయినా సరే ఫిలిం నగర్ నగర్ నుంచి ఈ సుమతి పాత్రకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మేరకు ఫిలిం వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. సుమతి పాత్రలో సాయి పల్లవి రాబోతున్నారని, నవంబర్ నుంచి ఆమె సెట్స్ లో జాయిన్ కానున్నారని సమాచారం.. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ ఆమె ఎంట్రీ దాదాపు ఖరారు అయినట్టే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ భారీ ప్రాజెక్టు రామాయణ చిత్రం షూటింగ్ గా బిజీగా గడుపుతోంది.
also read:అలీకి అబ్దుల్ కలాం అవార్డు..ఆయన చేతుల మీదుగా స్వీకరణ!
ఇప్పటికే నాగ్ అశ్విన్ సుమతి పాత్ర కల్కి 2లో ఉండదు అని చెప్పారు. మరి సాయి పల్లవిని కథలో మరో కీలకమైన పాత్ర కోసం తీసుకోబోతున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే ఇప్పటికే నాగ్ అశ్విన్ మొదటి భాగంలో ఉన్న భారీ తారాగణంతోనే సినిమాను ముందుకు నడిపిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడేమో సాయి పల్లవి ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఉన్న నిజం ఎంత? నిజంగానే సాయి పల్లవి ఇందులో బాగా కాబోతోందా? లేక ఇదంతా కేవలం సోషల్ మీడియా రూమర్స్ మాత్రమేనా అన్నది తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా అప్పుడు నాగ్ అశ్విన్ ఇచ్చిన క్లారిటీకి.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు పొంతన లేకపోవడం గమనార్హం. మరి ఈ వార్తలపై చిత్ర బృందం ఎప్పుడు స్పందించి క్లారిటీ ఇస్తుందో చూడాలి.