E-Paper
Advertisement

డబ్బులు అస్సలు వేస్ట్ కావు! బెస్ట్ మైక్ క్వాలిటీతో..బడ్జెట్ ఇయర్‌బడ్స్!

డబ్బులు అస్సలు వేస్ట్ కావు! బెస్ట్ మైక్ క్వాలిటీతో..బడ్జెట్ ఇయర్‌బడ్స్!
Advertisement

Best TWS earbuds under 3000: బయట జర్నీలో ఉన్నప్పుడు క్లియర్‌గా ఫోన్ మాట్లాడాలన్నా, లేదా నచ్చిన పాటలు వింటూ మైమరచిపోవాలన్నా ఒక మంచి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ జేబులో ఉండాల్సిందే. అయితే మార్కెట్లో వందల ఆప్షన్స్ ఉండటంతో ఏది కొనాలో చాలా మందికి అర్థం కాదు. ముఖ్యంగా మూడు వేల బడ్జెట్‌లో బెస్ట్ మైక్ క్వాలిటీ, అదిరిపోయే బేస్ ఇచ్చే బడ్స్ కోసం వెతికే.. వాళ్ల కోసమే ఈ ఇయర్ బడ్స్. ఈ నెల ఇండియన్ మార్కెట్లో విపరీతంగా ట్రెండ్ అవుతూ, వాల్యూ ఫర్ మనీ అనిపించే టాప్ 5 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ లిస్ట్‌ మీకోసం.

బడ్జెట్ ధరలో ప్రీమియం వైబ్స్:

ఈ రోజుల్లో బడ్జెట్ రేంజ్ ఇయర్‌ బడ్స్‌లోనే కంపెనీలు యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, క్వాడ్ మైక్స్ వంటి నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ ఇస్తున్నాయి. మరి మ్యూజిక్, కాల్స్ రెండింటికీ పర్ఫెక్ట్‌గా సరిపోయే.. ఆ 5 బెస్ట్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌..

1.OnePlus Nord Buds 3:

Advertisement

రూ.3వేల బడ్జెట్‌లో ఒన్‌ప్లస్ బ్రాండ్ నుంచి వస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఇది.ఇందులో.. 32dB యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ ఉంది. దీని వల్ల బయటి గోల చాలా వరకు తగ్గుతుంది. ఇక కాల్స్ విషయానికి వస్తే, ఇందులో ఉన్న డ్యూయల్ మైక్స్, ఏఐ నోయిస్ క్యాన్సిలేషన్ వల్ల అవతలి వాళ్లకు మీ వాయిస్ చాలా క్లియర్‌గా వినబడుతుంది. దీని సిగ్నేచర్ బేస్ మ్యూజిక్ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది.

2.Realme Buds Air 6 Neo:

మీకు ట్రాఫిక్‌లో లేదా జర్నీలో ఉన్నప్పుడు బయటి శబ్దాలు అస్సలు వినపడకూడదు అనుకుంటే రియల్‌మి బడ్స్ ఎయిర్ 6 నియో బెస్ట్ ఛాయిస్. ఇందులో ఏకంగా.. 50dB అల్ట్రా-కాన్సిలేషన్ ANC ఫీచర్ ఇచ్చారు. బ్యాటరీ లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మైక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది.

3. boAt Nirvana Ion:

Advertisement

ఒక్కసారి ఛార్జ్ చేస్తే..నెల రోజులు రావాలి అనుకునే వాళ్ల కోసం బోట్ నిర్వాణ అయాన్ పర్ఫెక్ట్. కేవలం బడ్స్‌లోనే 24 గంటల ప్లేటైమ్, కేస్‌తో కలిపి ఏకంగా 120 గంటల భారీ బ్యాటరీ లైఫ్ దీని సొంతం. ఇందులో ENx టెక్నాలజీతో కూడిన క్వాడ్ మైక్స్ (4 మైక్రోఫోన్లు) ఉన్నాయి. ఇవి మీ ఆఫీస్ మీటింగ్స్ లేదా నార్మల్ కాల్స్‌కు అద్భుతమైన క్లారిటీని ఇస్తాయి.

4. Anker Soundcore R50i NC:

సౌండ్‌కోర్ బ్రాండ్ ఆడియో క్వాలిటీకి చాలా ఫేమస్. రూ.2,000 నుంచి రూ.2,500 రేంజ్‌లో లభించే ఈ బడ్స్‌లో అడాప్టివ్ ANC ఫీచర్ ఉంది. దీని యాప్ సపోర్ట్ ద్వారా మీకు నచ్చినట్లు ఈక్వలైజర్ సెట్ చేసుకోవచ్చు.కాలింగ్ కోసం మల్టిపుల్ మైక్స్ ఉండటంతో వాయిస్ అస్సలు బ్రేక్ అవ్వదు.

5. Boult Audio UFO:

మీరు మ్యూజిక్‌తో పాటు పబ్జీ, ఫ్రీఫైర్ లాంటి గేమ్స్ ఎక్కువగా ఆడుతుంటే.. బౌల్ట్ యూఎఫ్ఓ బెస్ట్ ఆప్షన్. ఇందులో 45ms అల్ట్రా-లో లేటెన్సీ ఉంటుంది. అంటే గేమ్‌లో బుల్లెట్ సౌండ్స్ ఎక్కడా లాగ్ లేకుండా వినబడతాయి. దీని కేస్‌కు ఉండే.. ఆకర్షణీయమైన RGB లైట్స్ యూత్‌కు బాగా నచ్చుతాయి. కాల్స్ కోసం జెన్ మోడ్ ENC మైక్స్ ఇందులో ఉన్నాయి.

Related News

Google Pixel 10 ధర భారీగా తగ్గింది.. అమెజాన్‌లో రూ.15 వేలకు పైగా ఆదా చేసే ఛాన్స్!

iPhone Ultra నాలుగు రంగుల్లో రానుందా? తాజా లీక్‌లో కనిపించిన కలర్స్ ఇవే!

గేమింగ్ నుంచి మ్యూజిక్ వరకు.. Beyerdynamic టాప్ 5 హెడ్‌ఫోన్స్ ఇవే!

ఖరీదైన పవర్ బ్యాంక్ నిజంగా బెస్టేనా? డబ్బు ఖర్చుపెట్టే ముందు ఇవి తెలుసుకోండి!

అమెజాన్ ప్రైమ్ ఉచితంగా కావాలా? జియో, వీఐలో బెస్ట్ ప్లాన్లు ఇవే.. బెనిఫిట్స్ కూడా ఎక్కువే!

టీవీ రిమోట్‌లోని ఈ బటన్‌ను చాలామంది వాడరు.. కానీ దీని పని తెలిస్తే షాక్ అవుతారు!

మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి కార్బన్.. ZenZ Proతో రీఎంట్రీకి రెడీ?

బడ్జెట్‌లో చూడగానే నచ్చేసే టెక్నో కొత్త ఫోన్.. 120Hz డిస్‌ప్లే, AI ఫీచర్లతో లాంచ్!

Big Stories

Advertisement
×