E-Paper
Advertisement

చన్నీళ్ల స్నానానికి గుడ్‌బై.. రూ. 8 వేల లోపే బెస్ట్ గీజర్లు.. సామాన్యులకు పండగే!

చన్నీళ్ల స్నానానికి గుడ్‌బై.. రూ. 8 వేల లోపే బెస్ట్ గీజర్లు.. సామాన్యులకు పండగే!
Advertisement

Best Geysers 2026: వర్షాకాలం, చలికాలంలో ఉదయాన్నే స్నానం చేయడం ఎంత కష్టంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చల్లటి నీళ్లతో స్నానం ఊహించుకుంటేనే చాలా మంది వణికిపోతుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రస్తుతం మార్కెట్ లో చాలా గీజర్లు (వాటర్ హీటర్) అందుబాటులో ఉన్నాయి. అయితే మార్కెట్లో వందలాది మోడల్స్ ఉండటంతో ఏది కొనాలో తెలియక చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో రూ. 8,000 లోపు బడ్జెట్ లో టాప్ – 5 గీజర్లను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

AO Smith VAS Plus 25L

25 లీటర్ల కెపాసిటీతో వచ్చే ఈ గీజర్.. చిన్న కుటుంబాలకు సరిగ్గా సరిపోతుంది. దీని ఇన్నర్ ట్యాంక్ నాణ్యత చాలా బాగుంటుంది. పైగా నీరు త్వరగా వేడెక్కుతుంది. బడ్జెట్ ధరలో మంచి ఆల్ రౌండ్ గీజర్ ఇదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

Crompton Arno Prime 25L

Advertisement

తక్కువ ఖర్చులో ఎక్కువ బెనిఫిట్స్ కోరుకునేవారు దీనిని ట్రై చేయవచ్చు. ఇది కూడా 25 లీటర్ల ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంది. ఇది నీటిని త్వరగా హీట్ ఎక్కించడంతో పాటు విద్యుత్ ను కూడా ఆదా చేస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. అధిక నీటి నిల్వ సామర్థ్యం, నమ్మకమైన బ్రాండ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పవచ్చు.

Havells Monza Pro 15L

చాలా ప్రాంతాల్లో ఉప్పు నీరు లేదా హార్డ్-వాటర్ (కఠిన జలాలు) వల్ల గీజర్లు త్వరగా పాడైపోతుంటాయి. అలాంటి సమస్య ఉన్నవారికి హావెల్స్ మోంజా ప్రో 15 లీటర్ల గీజర్ చక్కగా సరిపోతుంది. దీనిలోని యాంటీ-కొరోసివ్ టెక్నాలజీ ఉప్పు నీటి వల్ల ట్యాంక్ తుప్పు పట్టకుండా కాపాడుతుంది. 15 లీటర్ల కెపాసిటీ కలిగిన ఈ గీజర్.. 3 నుండి 4 గురు ఉన్న చిన్న కుటుంబానికి సరిగ్గా సరిపోతుంది.

V-Guard Divino 15L

Advertisement

15 లీటర్ల సామర్థ్యం గల ఈ గీజర్.. హై-రైజ్ అపార్ట్‌మెంట్లలో ఉండే వాటర్ ప్రెజర్‌ను కూడా తట్టుకోగలదు. ప్రతిరోజూ ఎటువంటి ఇబ్బంది లేకుండా, సురక్షితంగా వేడి నీటిని ఇది అందిస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: యువతకు BSNL బంపరాఫర్.. సొంత ఊరిలో ఉంటూ.. నెలకు రూ.లక్ష సంపాదించే ఛాన్స్!

Polycab Celestia 25L

గీజర్ వాడినప్పటికీ తక్కువ పవర్ బిల్లు రావాలని కోరుకునేవారికి ఇది సరిగ్గా సరిపోతుంది. ఈ 25 లీటర్ల గీజర్ అత్యుత్తమ ఎనర్జీ ఎఫిషియన్సీ ఫీచర్లతో వచ్చింది. ఇది నీటిని ఎక్కువ సేపు వేడిగా ఉంచడం ద్వారా పదే పదే గీజర్ ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు. తద్వారా కరెంటు బిల్లును భారీగా ఆదా చేసుకోవచ్చు.

Also Read: రూ.4,500కే సూపర్ హెల్మెట్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లైట్‌ వింగ్ భలే ఉంది భయ్యా!

Related News

టైపింగ్ మాత్రమే కాదు..మీ ఫోన్ కీబోర్డ్ చేసే అద్భుతమైన పనులు ఇవే!

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.789కే.. బ్లెండ్‌జెట్ పోర్టబుల్ జ్యూసర్

‘ఐస్ బ్యాటరీ’ వింత.. రాత్రి నీరు గడ్డకట్టిస్తారు.. పగలు భవనాన్ని చల్లబరుస్తారు..!

ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్..రూ.799కే ఇయర్‌బడ్స్

మీరు ఆఫ్ చేయాల్సిన అవసరమే లేదు.. ఫుడ్ రెడీ అవగానే ఆగిపోతాయ్

రూ.30 వేలలోపే 50 ఇంచుల టీవీ..ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు!

తక్కువ స్థలంలో ఎక్కువ స్టోరేజ్..అమెజాన్ ఆఫర్‌లో మినీ ఫ్రిడ్జ్‌‌లు

Jio రూ.299 vs Airtel రూ.349.. రెండిటిలో ఏ ప్లాన్ బెస్ట్.. దేనివల్ల బెనిఫిట్స్ ఎక్కువ?

Big Stories

Advertisement
×