E-Paper
Advertisement

కరెంట్ బిల్లు టెన్షన్ లేకుండా.. ఇల్లు కూల్ అవ్వాలా? ఈ ఏసీలపై ఓ లుక్కేయండి!

కరెంట్ బిల్లు టెన్షన్ లేకుండా.. ఇల్లు కూల్ అవ్వాలా? ఈ ఏసీలపై ఓ లుక్కేయండి!
Advertisement

Blue Star 1.2 Ton AC:  భగభగమండే ఎండల నుంచి ఉపశమనం పొందడానికి.. ఇంట్లో ఏసీ ఉండాల్సిందే. అయితే.. మీ రూమ్ మీడియం సైజులో ఉండి, బడ్జెట్ పరిధిలో బెస్ట్ బ్రాండ్ ఏసీ కోసం చూస్తుంటే.. Blue Star 1.2 Ton 3 Star Split AC (3HW15VCTU) పర్ఫెక్ట్ ఛాయిస్ కాగలదు. మార్కెట్లో నమ్మకమైన బ్రాండ్‌గా పేరున్న బ్లూ స్టార్ నుంచి వచ్చిన ఈ మోడల్ రూమ్‌ని ఎంతవరకు కూల్ చేస్తుంది? కరెంట్ బిల్లు ఎంత వస్తుంది? దీని పూర్తి స్పెసిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

ఎండలను తరిమికొట్టే.. బ్లూ స్టార్ ఏసీ.. ఫీచర్లు ఇవే!

ఈ రోజుల్లో ఏసీ కొనడం లగ్జరీ కాదు, కనీస అవసరం. అయితే మార్కెట్లో.. వందల మోడల్స్ ఉన్నాయి. వాటిలో బ్లూ స్టార్ 1.2 టన్ ఏసీ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా 110 నుంచి 140 చదరపు అడుగుల లోపు ఉండే బెడ్‌రూమ్స్ లేదా ఆఫీస్ క్యాబిన్స్‌కు సరిగ్గా సరిపోతుంది.

Advertisement

పవర్‌ఫుల్ కూలింగ్.. రోటరీ కంప్రెసర్:

ఈ ఏసీలో రోటరీ కంప్రెసర్‌ను ఉపయోగించారు. ఇది 4010 వాట్ల హై కూలింగ్ కెపాసిటీని.. అందిస్తుంది. అంటే బయట ఎండలు ఎంత దంచికొడుతున్నా.. రూమ్ ఆన్ చేసిన కొన్ని నిమిషాల్లోనే.. హాయిగా ఊటీలా మారి పోతుందన్నమాట. ఇందులో ఉండే టర్బో కూలింగ్ ఫీచర్ ఎండలో.. బయటి నుంచి రాగానే.. రూమ్‌ను ఇన్స్టంట్‌గా కూల్ చేయడానికి హెల్ప్ అవుతుంది.

Advertisement

రాగి లాంటి గట్టిదనం:
ఏసీ లైఫ్ లాంగ్ రావాలన్నా.. రిపేర్లు రాకూడదన్నా అందులో కాపర్ కాయిల్ ఉండాలి. Blue Star 3HW15VCTU మోడల్‌లో ఇండోర్ , అవుట్‌డోర్ రెండింటిలోనూ 100% కాపర్ కండెన్సర్ కాయిల్ వాడారు. దీని వల్ల హీట్ ట్రాన్స్‌ఫర్ చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. మెయింటెనెన్స్ ఖర్చు కూడా తగ్గుతుంది.

హెల్తీ ఎయిర్.. యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్స్:
ఇది కేవలం చల్లటి గాలిని మాత్రమే కాదు. క్లీన్ ఎయిర్‌ను కూడా అందిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ , డస్ట్ ఫిల్టర్ గాలిలో ఉండే చిన్న చిన్న దుమ్ము కణాలను, హాని కరమైన బ్యాక్టీరియాలను సమర్థవంతంగా అడ్డుకుంటాయి. ఇంట్లో.. పిల్లలు, వృద్ధులు ఉంటే.. ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగ పడుతుంది.

కరెంట్ బిల్లు ఎంత రావచ్చు?
ఇది 3 స్టార్ BEE రేటింగ్ కలిగిన నాన్-ఇన్వర్టర్ ఏసీ. దీని పవర్ కన్సప్షన్ దాదాపు 1131 వాట్లుగా ఉంటుంది. రోజూ మీడియంగా 5 నుంచి 6 గంటలు వాడేవారికి.. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఒక వేళ మీరు రోజంతా 12 గంటల పైనే ఏసీ ఆన్ చేసి ఉంచుతామనుకుంటే.. మాత్రం ఇన్వర్టర్ మోడల్స్ వైపు వెళ్లడం బెటర్.

ముఖ్యమైన ఫీచర్లు ఒకేచోట:
ఆటో రీస్టార్ట్: అర్ధరాత్రి పవర్ కట్ అయి మళ్లీ వస్తే.. ఏసీ ఆటోమేటిక్‌గా మీరు సెట్ చేసిన పాత టెంపరేచర్‌తోనే స్టార్ట్ అవుతుంది. మీరు నిద్ర లేవాల్సిన పనిలేదు.

డీహ్యూమిడిఫికేషన్: వర్షాకాలంలో లేదా ఉక్కపోత ఎక్కువగా ఉన్నప్పుడు గాలిలోని తేమను తీసేసి రూమ్‌ను కంఫర్ట్‌గా ఉంచుతుంది.

సెల్ఫ్ డయాగ్నసిస్: ఏసీలో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే డిస్‌ప్లే పైనే.. ఎర్రర్ కోడ్ రూపంలో చూపిస్తుంది.

ఈ మోడల్‌కు కంపెనీ ప్రొడక్ట్ పై 1 సంవత్సరం,కంప్రెసర్‌పై 4 నుంచి 5 సంవత్సరాల వరకు వారంటీని అందిస్తోంది.

మీరు రూ.31,000 నుంచి రూ. 34,000 బడ్జెట్ పరిధిలో ఒక బ్రాండెడ్, నమ్మకమైన, లాంగ్ లైఫ్ వచ్చే ఏసీ కోసం చూస్తుంటే.. బ్లూ స్టార్ 1.2 టన్ 3 స్టార్ ఏసీ బెస్ట్ ఆప్షన్.

Related News

ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. Airtel టాప్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇవే!

2-పిన్, 3-పిన్ ప్లగ్‌ల మధ్య తేడా ఏంటి? ఇవి కేవలం డిజైన్ కోసమేనా లేక సేఫ్టీ కోసమా?

ల్యాప్‌టాప్ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే షట్ డౌన్ చేయాలా? లేదా స్లీప్ మోడ్ బెటరా?

ఫోన్ ఛార్జ్ ఇట్టే పోతుందా? ఈ యాప్స్ ఏ కారణం!

120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!

10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్

రూ.849కే పోర్టబుల్ స్పీకర్..సౌండ్ వింటే మైండ్ బ్లాక్!

రూ.699కే ఫైర్‌బోల్ట్ ఇయర్‌బడ్స్..అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×