Redmi Note 17 Series: టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 17 సిరీస్ లాంచ్‌కు సమయం ఆసన్నమైంది. ఈ నెలలోనే చైనా మార్కెట్లో ఈ సరికొత్త ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మిడ్‌రేంజ్ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లను అందించే ఈ సిరీస్‌పై మార్కెట్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో Redmi Note 17, Note 17 Pro, Note 17 Pro Max మోడల్స్ రానున్నాయి.
ఈ సిరీస్‌లో వచ్చే బేస్ వేరియంట్ Redmi Note 17 స్క్రీన్ పరంగా చాలా బాగుండనుంది. లీక్స్ ప్రకారం.. ఇది 6.83 ఇంచుల 1.5K రెజల్యూషన్ డిస్‌ప్లేతో రానుంది. స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరాను అందించే అవకాశం ఉంది. అలాగే దీనికి 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది.
Also Read: గోల్డెన్ ఛాన్స్ భయ్యా.. ఏకంగా రూ.65,000 తగ్గింపు.. శాంసంగ్ ప్రీమియం ఫోన్‌పై ఊహించని డీల్!
ఇక Redmi Note 17 Pro మోడల్ విషయానికొస్తే.. దీనిలో ఫ్లాట్ 1.5K డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఇది స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రొసెసర్‌తో రన్ అవుతుంది. కెమెరా పరంగా ఇందులో కూడా 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. అయితే ఈ ఫోన్ ప్రధాన హైలైట్ దీని బ్యాటరీనే. ఏకంగా 9000mAh భారీ బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఇది రానున్నట్లు తెలుస్తోంది.
అన్నిటికంటే ఎక్కువగా Redmi Note 17 Pro Max మోడల్‌పైనే అందరి కళ్లూ ఉన్నాయి. ఈ టాప్ ఎండ్ వేరియంట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7500 చిప్‌సెట్‌ను వాడబోతున్నట్లు సమాచారం. ఫొటోగ్రఫీ లవర్స్ కోసం ఇందులో ఏకంగా 200MP ప్రైమరీ కెమెరాను ఇస్తున్నారు. ఇది మిడ్‌రేంజ్ సెగ్మెంట్లో ఒక కొత్త సంచలనమనే చెప్పాలి.
Note 17 Pro Max మోడల్‌లో 10100mAh సామర్థ్యం గల అత్యంత భారీ బ్యాటరీని ఇవ్వనున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. దీనికి తోడు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సాధారణంగా మెయిన్‌స్ట్రీమ్ స్మార్ట్‌ఫోన్లలో ఇంత పెద్ద బ్యాటరీని మనం చూడలేం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫీచర్లు గనుక నిజమైతే.. ఈ ఏడాది మిడ్‌రేంజ్ మొబైల్ మార్కెట్లో Redmi Note 17 సిరీస్ తిరుగులేని రికార్డులు సృష్టించడం ఖాయం.
Also Read: ఏకంగా 9000mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్‌తో కొత్త సిరీస్.. ఫీచర్లు లీక్!