Akhil Akkineni: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఏం తింటారు? ఎలాంటి దుస్తులు వేసుకుంటారు? ఎలాంటి బ్రాండ్ ఉపయోగిస్తారు? ముఖ్యంగా వాళ్లకు ఎవరంటే ఇష్టం? వాళ్ళ మొబైల్ లో ఇష్టమైన వారిని ఎలాంటి పేరుతో ఫీడ్ చేసుకున్నారు? ఎవరి ఫోటోని వాల్ పేపర్ గా పెట్టుకున్నారు? ఇలా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సదరు సెలబ్రిటీలు కూడా తమ పర్సనల్ విషయాలను అభిమానులతో అప్పుడప్పుడు పంచుకుంటూ సర్ప్రైజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా సెలబ్రిటీలు ఉపయోగించే మొబైల్ స్క్రీన్ పై ఎవరి ఫోటోలు ఉంటాయి అనే విషయం తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో.. ఒక్కొక్కసారి అనుకోకుండా సెలబ్రిటీల మొబైల్ వాల్ పేపర్స్ వైరల్ అయితే.. మరొకసారి వారే స్వయంగా స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక హీరో కూడా గత 12 ఏళ్లుగా ఆయన ఫోటోనే తన మొబైల్ వాల్ పేపర్ గా పెట్టుకున్నాను అని ప్రత్యక్షంగా చూపించి అందరిని సర్ప్రైజ్ చేశారు.

ఆయన ఎవరో కాదు ప్రముఖ యంగ్ హీరో అఖిల్ అక్కినేని. ప్రస్తుతం ‘లెనిన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వరుసగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు అఖిల్ . ఈ నేపథ్యంలోనే తన మొబైల్ వాల్ పేపర్ గురించి మాట్లాడుతూ..” నాకు మా తాతయ్య దివంగత అక్కినేని నాగేశ్వరరావు అంటే ఎంతో ఇష్టం, అభిమానం. అందుకే గత 12 సంవత్సరాలుగా మా తాత ఫోటోనే నేను వాల్ పేపర్ గా పెట్టుకున్నాను. అందులో బ్లాక్ అండ్ వైట్ లుక్లో ఆయన చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. అంటూ తన తాత ఫోటోని..తన మొబైల్ స్క్రీన్ ఫోటోగా పెట్టుకున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు అఖిల్. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
also read:61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్!
అఖిల్ విషయానికి వస్తే.. సిసింద్రీ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టిన అఖిల్.. హలో, అఖిల్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ స్టార్ స్టేటస్ మాత్రం లభించడం లేదు. చివరిగా ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. మూడేళ్లు గ్యాప్ తీసుకొని ఇప్పుడు లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో మాస్ రగ్గడ్ లుక్ లో అభిమానులను ఆకట్టుకోబోతున్నారు అఖిల్. ఇక ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించగా.. అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. పైగా భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య జూలై 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. సక్సెస్ కోసం ఆరాటపడుతున్న అఖిల్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయం అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి చూద్దాం అక్కినేని అఖిల్ కి వివాహం తర్వాత చేస్తున్న ఈ మొదటి సినిమా ఏ మేరకు కలిసి వస్తుందో..