E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఏంటీ, ‘Bluetooth On’లో ఉంటే.. ఇన్ని ఘోరాలు జరుగుతాయా? సర్వం కోల్పోవాల్సిందేనా!

ఏంటీ, ‘Bluetooth On’లో ఉంటే.. ఇన్ని ఘోరాలు జరుగుతాయా? సర్వం కోల్పోవాల్సిందేనా!
Advertisement

Bluetooth Security: ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ ను వినియోగిస్తున్నారు. అయితే ఫోన్ వాడుతున్నప్పుడు చేసే చిన్న పొరపాట్లు ఒక్కోసారి పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంటాయి. అలాంటి వాటిలో బ్లూటూత్ ను ఎల్లప్పుడూ ఆన్ లో ఉంచడం ఒకటి. హెడ్‌సెట్లు, స్మార్ట్ వాచ్‌లు వాడటం కోసం చాలామంది బ్లూటూత్ ను 24 గంటలూ ఆన్‌లోనే వదిలేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వ్యక్తిగత డేటా మాత్రమే కాకుండా.. బ్యాంక్ ఖాతా వివరాలు సైతం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

బ్లూటగ్గింగ్ గురించి తెలుసా?

రద్దీగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్‌లో ఉన్నప్పుడు ఫోన్ బ్లూటూత్ ఆన్‌లో ఉంటే సైబర్ నేరగాళ్లకు అది ఒక సులువైన దారిగా మారుతుంది. హ్యాకర్లు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి మీ అనుమతి లేకుండానే మీ ఫోన్‌కు కనెక్ట్ అయిపోతారు. దీనినే సైబర్ పరిభాషలో ‘బ్లూబగ్గింగ్’ (Bluetugging) లేదా ‘బ్లూటగ్గింగ్’ అంటారు. మీ ఫోన్ రేంజ్‌లో (10 మీటర్ల పరిధి) ఉన్న ఏ హ్యాకర్ అయినా దీని ద్వారా మీ ఫోన్‌లోకి చొరబడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జరిగే నష్టాలు ఇవే..

Advertisement

ఒక్కసారి హ్యాకర్ మీ బ్లూటూత్ ద్వారా ఫోన్‌లోకి ప్రవేశిస్తే.. మీ ప్రమేయం లేకుండానే కొన్ని నష్టాలు జరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఫోన్ గ్యాలరీలోని ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్స్, మెసేజ్‌లను హ్యాకర్లు ఈజీగా దోచేస్తారని చెబుతున్నారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో రహస్యంగా వినడమే కాకుండా వాటిని రికార్డ్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మీ మెసేజ్‌లను వారు చదవగలుగుతారు కాబట్టి బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన ఓటీపీలను తీసుకొని డబ్బులు దోచేసే ప్రమాదముంది. అలాగే ఫోన్‌లో స్పైవేర్ ను ఇన్‌స్టాల్ చేసి ఫోన్‌ను వారి ఆధీనంలోకి తెచ్చుకుంటారు.

ఛార్జింగ్ కూడా మటాషే..!

బ్లూటూత్ ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండటం వల్ల కేవలం భద్రతా పరమైన సమస్యలే కాకుండా ఫోన్ బ్యాటరీ చాలా వేగంగా అయిపోతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో డివైజ్‌ల కోసం నిరంతరం సెర్చ్ చేస్తూ ఉండటం వల్ల ఫోన్ ప్రాసెసర్‌పై భారం పడి మొబైల్ త్వరగా హీట్ ఎక్కుతుంది. దీనివల్ల ఫోన్ లైఫ్ టైమ్ కూడా తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

Also Read: ఇస్త్రీ కష్టాలకు చెక్.. రూ.2,000 బడ్జెట్‌లో.. అత్యుత్తమ స్టీమర్స్ ఇవే!

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

బ్లూటూత్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా పైన పేర్కొన్న ముప్పు నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. వారి ప్రకారం ఇయర్‌ఫోన్స్ లేదా స్మార్ట్ వాచ్‌తో పని అయిపోగానే బ్లూటూత్‌ను వెంటనే ఆఫ్ చేయడం అలవాటు చేసుకోండి. అలాగే బ్లూటూత్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘Hidden’ లేదా ‘Non-discoverable’ మోడ్‌లో పెట్టుకోండి. దీనివల్ల ఇతరుల ఫోన్లలో మీ బ్లూటూత్ పేరు కనిపించదు. మీ ఫోన్‌కు వచ్చే ఎలాంటి అపరిచిత బ్లూటూత్ పెయిరింగ్ రిక్వెస్ట్‌లను ఒకే చేయెుద్దని నిపుణులు సూచిస్తున్నారు. మరి ముఖ్యంగా పబ్లిక్ వై-ఫై, బ్లూటూత్ వాడకపోవడమే బెస్ట్ అని హితవు పలుకుతున్నారు.

Also Read: అమెజాన్‌ బంపరాఫర్.. సగం ధరకే రోబోటిక్ క్లీనర్లు.. ఒక్క బటన్‌తో ఇల్లంతా క్లీన్!

Related News

నెట్‌ఫ్లిక్స్ వాడుతున్నారు సరే.. ఈ 7 సీక్రెట్స్ గురించి తెలుసా? లేదంటే చాలా మిస్ అవుతున్నట్లే!

జర్మనీలో చాలా ఇళ్లలో ఏసీలు ఉండవు? అసలు కారణం ఇదే!

ఇల్లు మెరవాలా? ఈ మల్టీ-సర్ఫేస్ వ్యాక్యూమ్ క్లీనర్‌తో క్లీనింగ్ చిటికెలో!

సూపర్ ఫాస్ట్ కూలింగ్‌తో.. దుమ్మురేపుతున్న 5 బెస్ట్ స్ప్లిట్ ఏసీలు!

ఎండలైనా, వర్షాలైనా ఫుడ్ సూపర్ ఫ్రెష్! స్మార్ట్ ఫ్రిజ్‌ల లిస్ట్ మీ కోసం

రూ.35 వేల బడ్జెట్‌లో ల్యాప్‌టాప్ లాంటి టాబ్లెట్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్!

అమెజాన్‌లో షాకింగ్ ప్రైస్ డ్రాప్.. రూ.37,000 తగ్గిన Samsung Galaxy S26 Plus ఫోన్ ధర!

Big Stories

×