E-Paper
Advertisement

తక్కువ ధరలో.. పెద్ద స్క్రీన్ ఉన్న స్మార్ట్ టీవీ కావాలా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

తక్కువ ధరలో.. పెద్ద స్క్రీన్ ఉన్న స్మార్ట్ టీవీ కావాలా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి
Advertisement

Hisense 43 inch Full HD Smart TV: ఫ్యామిలీతో కలిసి సరదాగా సినిమా చూడాలన్నా.. లేదా మంచి విజువల్స్‌తో సిరీస్‌లు ఎంజాయ్ చేయాలన్నా పెద్ద స్క్రీన్ ఉన్న మంచి స్మార్ట్ టీవీ చాలా ముఖ్యం. అయితే ఎక్కువ ధర పెట్టి టీవీ కొనలేమని బాధపడేవారి కోసం మార్కెట్‌లో అద్భుతమైన బడ్జెట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ‘హైసెన్స్'(Hisense) నుంచి వచ్చిన ’43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ’ఇప్పుడు టెక్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం రూ. 17,999 ధరకే లభిస్తున్న ఈ టీవీ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం!

Hisense 43 inch Full HD Smart TV ఫీచర్లు:

1.అద్భుతమైన డిస్‌ప్లే, విజువల్స్:

ఈ స్మార్ట్‌ఫోన్ లేదా టీవీల విషయానికి వస్తే డిస్‌ప్లే చాలా ముఖ్యం. హైసెన్స్ 43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ (Full HD) డిస్‌ప్లేతో వచ్చే ఈ టీవీలో కలర్స్ చాలా సహజంగా, ప్రకాశవంతంగా కనిపిస్తాయి. సినిమా చూసేటప్పుడు లేదా వీడియోలు ప్లే చేసేటప్పుడు పిక్చర్ క్లారిటీ చాలా బాగుంటుంది. బెజెల్ లెస్ (Bezel-less) డిజైన్ కారణంగా స్క్రీన్ మరింత పెద్దదిగా కనిపిస్తుంది, ఇది హాల్‌కు ఒక మోడ్రన్ లుక్‌ను తెస్తుంది.

Advertisement

2.స్మార్ట్ ఫీచర్లు, ఆపరేటింగ్ సిస్టమ్:

ఈ టీవీ యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్స్ అన్నీ ఇందులో ఈజీగా రన్ అవుతాయి. వైఫై కనెక్టివిటీ, స్క్రీన్ మిర్రరింగ్ వంటి ఫీచర్లు ఉండటం వల్ల మీ మొబైల్ లేదా లాప్‌టాప్ స్క్రీన్‌ను నేరుగా టీవీకి కనెక్ట్ చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు. అంతే కాకుండా దీనిలో వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉండటం ద్వారా రిమోట్ ద్వారానే వాయిస్ కమాండ్స్ ఇచ్చి టీవీని ఆపరేట్ చేయవచ్చు.

Advertisement

Also Read: రూ.24,999 ధరకే..నథింగ్ ఫోన్, ఫీచర్లకు పిచ్చెక్కడం గ్యారంటీ

3.సౌండ్ క్వాలిటీ,కనెక్టివిటీ ఆప్షన్స్:

మంచి విజువల్స్‌తో పాటు.. పవర్‌ఫుల్ సౌండ్ ఉంటేనే థియేటర్ ఫీల్ కలుగుతుంది. ఈ టీవీలో డాల్బీ ఆడియో సపోర్ట్ కలిగిన స్ట్రాంగ్ స్పీకర్లను అమర్చారు. దీని వల్ల పాటలు వినేటప్పుడు..యాక్షన్ సీన్స్ చూసేటప్పుడు ఆడియో చాలా స్పష్టంగా, లౌడ్‌గా వినిపిస్తుంది. అలాగే.. ఎక్స్‌టర్నల్ స్పీకర్లు, గేమింగ్ కన్సోల్స్ లేదా సెట్-టాప్ బాక్స్ కనెక్ట్ చేసుకోవడానికి తగినన్ని హెచ్‌డీఎంఐ , యూఎస్‌బీ పోర్టులు ఇందులో అందు బాటులో ఉన్నాయి.

4.ధర :

మార్కెట్‌ లో ఈ స్మార్ట్ టీవీ అసలు ధర చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రత్యేక ఆఫర్ల ద్వారా ప్రస్తుతం కేవలం రూ. 17,999 ధర కే కస్టమర్లకు లభిస్తోంది.

తక్కువ బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్, ఫుల్ హెచ్‌డీ పిక్చర్ క్వాలిటీ, మంచి సౌండ్ , అన్ని స్మార్ట్ ఫీచర్లు ఉండే టీవీ కొనాలనుకునేవారికి హైసెన్స్ 43E43N ఒక అద్భుతమైన ఛాయిస్ అని చెప్పొచ్చు. ఇంకెందుకు ఆలస్యం రూ. 17,999 ధరలో లభించే ఈ బ్రాండెడ్ టీవీతో మీ ఇంటిని నిజమైన మినీ థియేటర్‌లా మార్చుకోండి!

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×