E-Paper
Advertisement

120 గంటల బ్యాటరీ బ్యాకప్..రూ.1,799కే అదిరిపోయే బోట్ ఇయర్‌బడ్స్!

120 గంటల బ్యాటరీ బ్యాకప్..రూ.1,799కే అదిరిపోయే బోట్ ఇయర్‌బడ్స్!
Advertisement

boAt Nirvana Ion: ప్రస్తుత టెక్ యుగంలో వైర్డు ఇయర్‌ఫోన్స్ పూర్తిగా కనుమరుగైపోయి, అంతటా ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ట్రెండ్ నడుస్తోంది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు, ఆఫీస్‌లో పనిచేసేటప్పుడు లేదా జిమ్‌ చేసేటప్పుడు ఇయర్‌బడ్స్ మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. అయితే.. చాలా మందిని వేధించే ప్రధాన సమస్య బ్యాటరీ అయిపోవడం. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రముఖ ఆడియో బ్రాండ్ బోట్ మార్కెట్‌లోకి తెచ్చిన అద్భుతమైన గ్యాడ్జెట్ boAt Nirvana Ion. ఈ గార్జెజ్ ఎందుకు స్పెషల్, ఫీచర్లు, ధరలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

boAt Nirvana Ion ఫీచర్లు:

1.120 గంటల భారీ బ్యాటరీ బ్యాకప్ :

ఈ ఇయర్‌బడ్స్ అతిపెద్ద హైలైట్, మార్కెట్లో ఇవి హాట్ టాపిక్ కావడానికి కారణం దీని బ్యాటరీ లైఫ్. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి ఇది ఏకంగా 120 గంటల (5 రోజులు) నాన్‌స్టాప్ ప్లేటైమ్‌ను అందిస్తుంది. అంటే ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజుల తరబడి మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు. ఛార్జర్ ఎక్కడో వెతుక్కోవాల్సిన పనే ఉండదు. లాంగ్ జర్నీలు చేసే వారికి , తరచూ ఛార్జ్ చేయడం ఇష్టపడని వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

2.క్రిస్టల్ బయోనిక్ సౌండ్ & డ్యూయల్ ఈక్యూ మోడ్స్ :

Advertisement

సౌండ్ క్వాలిటీ విషయంలో.. బోట్ ఎప్పుడూ రాజీపడదు. ఈ ఇయర్ బడ్స్ లో అందించిన టెక్నాలజీ ద్వారా పాటల్లోని ప్రతి చిన్న మ్యూజిక్ బీట్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. దీంతో పాటు ఇందులో డ్యూయల్ ఈక్యూ మోడ్స్ ఇచ్చారు. అంటే దీని ప్రత్యేకమైన 2 మోడ్స్ మధ్య మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ ఆడియో ఫీల్ మరింత పెంచుకోవచ్చు. డీప్ బేస్ ఇష్టపడే వారికి ఇది ఎంతో నచ్చుతుంది.

Also Read: 55 గంటల బ్యాటరీ బ్యాకప్.. అల్ట్రా బేస్ టెక్నాలజీ, ఇంతకంటే ఇంకేం కావాలి?

3. డిజైన్, కనెక్టివిటీ :

Advertisement

ఈ ఇయర్‌బడ్స్ డిజైన్ చాలా స్టైలిష్‌గా, మోడ్రన్‌గా , ప్రీమియమ్‌గా ఉంటుంది. చెవుల్లో పెట్టుకున్నప్పుడు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇవి చాలా హ్యాపీగా ఫిట్ అవుతాయి. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీ కారణంగా మీ స్మార్ట్‌ ఫోన్, ట్యాబ్లెట్ లేదా లాప్‌ టాప్‌కి ఇవి క్షణాల్లో కనెక్ట్ అవుతాయి. గేమింగ్ ఆడేవారి.. కోసం ప్రత్యేకమైన లో-లేటెన్సీ మోడ్ కూడా ఇందులో.. అందుబాటులో ఉంది. టచ్ కంట్రోల్స్ ద్వారా కాల్స్ లిఫ్ట్ చేయడం, మ్యూజిక్ ప్లే/పాజ్ చేయడం చాలా ఈజీ.

4. ధర:

ఇన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, ఏకంగా 120 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో వస్తున్న ఈ ఇయర్ బడ్స్ అసలు ధర మార్కెట్లో కేవలం రూ. 1,799 మాత్రమే. బడ్జెట్ ధరలో బెస్ట్ బ్యాటరీ, సౌండ్ క్వాలిటీ కోరుకునే వారికి ఇది ప్రస్తుతం నంబర్-1 ఆప్షన్. మీరు దీనిని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌ సైట్లు లేదా బోట్ అధికారిక వెబ్‌ సైట్‌లో తక్కువ ధరకే కొనొచ్చు.

Also Read: మార్కెట్‌ను షేక్ చేస్తున్న శాంసంగ్ ట్యాబ్.. దీని ముందు ల్యాప్‌టాప్‌లు వేస్ట్!

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×