E-Paper
Advertisement

సింగిల్ ఛార్జ్‌తో..10 గంటల పాటలు! బోట్ నుంచి.. కిల్లర్ బ్లూటూత్ స్పీకర్

సింగిల్ ఛార్జ్‌తో..10 గంటల పాటలు! బోట్ నుంచి.. కిల్లర్ బ్లూటూత్ స్పీకర్
Advertisement

BoAt Stone 1000 Review: ఇంట్లో చిన్న పార్టీ అయినా, ఫ్రెండ్స్‌తో కలిసి అవుట్‌డోర్ ట్రిప్ వెళ్లినా… బ్యాక్‌గ్రౌండ్‌లో అదిరిపోయే బేస్‌తో సాంగ్స్ పడాల్సిందే! అలాంటి హెవీ మ్యూజిక్ లవర్స్ కోసం బోట్ తీసుకొచ్చిన రగ్గడ్ మాన్‌స్టర్ స్పీకర్ boAt Stone 1000. 14 వాట్ల పవర్‌ఫుల్ ఆడియో, దుమ్ము-ధూళి తగిలినా పాడవని రగ్గడ్ డిజైన్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో మార్కెట్లో.. హాట్ కేకులా అమ్ముడుపోతున్న ఈ బ్లూటూత్ స్పీకర్ పర్ఫార్మెన్స్, ధరలతో పాటు మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

boAt Stone 1000 రివ్యూ:

బోట్ స్టోన్ సిరీస్ స్పీకర్స్ అంటేనే.. బిల్డ్ క్వాలిటీకి కేరాఫ్ అడ్రస్. ఈ ‘స్టోన్ 1000’ కూడా సేమ్ అదే రేంజ్‌లో ఉంటుంది. చూడటానికి కొంచెం పెద్దగా, చాలా రగ్గడ్‌గా, చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఒక సిలికాన్ స్ట్రాప్‌తో వస్తుంది.

1. డిజైన్ & బిల్డ్ క్వాలిటీ:

Advertisement

ఈ స్పీకర్‌ను చాలా గట్టి ప్లాస్టిక్, సిలికాన్ మెటీరియల్‌తో డిజైన్ చేశారు. దీనికి IPX5 వాటర్ అండ్ షాక్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. అంటే పార్టీలో పొరపాటున దీనిపై నీళ్లు పడినా, లేదా చేతిలోంచి కింద పడినా అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ట్రిప్స్, క్యాంపింగ్ లేదా పూల్ పార్టీలకి తీసుకెళ్లడానికి ఇది ఒక పర్‌ఫెక్ట్ ఛాయిస్. అయితే కొంచెం బరువుగా (సుమారు 1.5 కేజీలు) ఉండటం వల్ల జేబులో పెట్టుకుని తిరగలేం గానీ, బ్యాగ్‌లో ఈజీగా క్యారీ చేయొచ్చు.

2. సౌండ్ క్వాలిటీ:

ఇందులో.. 14W డ్యూయల్ స్పీకర్స్ ఇచ్చారు. దీని అసలైన బలం దీని ‘బేస్’. మీరు గదిలో వాల్యూమ్ 70% పెంచితే చాలు. ఇల్లు మొత్తం బేస్ తో మోగిపోతుంది. వోకల్స్ , ఇన్‌స్ట్రుమెంట్ సౌండ్స్ కూడా చాలా క్లియర్‌గా వినబడతాయి. అవుట్‌డోర్‌లో ఓపెన్ ప్లేస్‌లో.. పెట్టినా కూడా సౌండ్ చాలా ఎక్కువగా వస్తుంది. పార్టీ సాంగ్స్, ఐటెం సాంగ్స్ వినేటప్పుడు మాత్రం ఈ స్పీకర్ ఇచ్చే కిక్కే వేరు.

3. కనెక్టివిటీ & కంట్రోల్స్:

Advertisement

ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు AUX కేబుల్ ఆప్షన్ కూడా ఉంది. మీ దగ్గర బ్లూటూత్ లేని పాత డివైజ్‌లు ఉన్నా కూడా ఆక్స్‌ కేబుల్ పెట్టి పాటలు వినొచ్చు. స్పీకర్ పైభాగంలో వాల్యూమ్ పెంచడానికి, తగ్గించడానికి, ట్రాక్స్ మార్చడానికి, కాల్స్ లిఫ్ట్ చేయడానికి రబ్బర్ బటన్స్ ఇచ్చారు. అవును.. ఇందులో ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్ కూడా ఉంది. కాబట్టి మీ ఫోన్‌కి వచ్చే కాల్స్‌ని స్పీకర్ ద్వారానే హ్యాండ్స్-ఫ్రీగా మాట్లాడుకోవచ్చు.

Also Read: సింగిల్ ఛార్జ్‌తో వారం రోజులు! రియల్‌మీ సరికొత్త ఇయర్‌బడ్స్ రివ్యూ!

బ్యాటరీ లైఫ్: 

boAt Stone 1000 లో 3000mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మీడియం వాల్యూమ్‌లో సుమారు 8 నుంచి 10 గంటల పాటు నాన్‌స్టాప్‌గా పాటలు ప్లే అవుతాయి. పార్టీల కోసం ఇదొక మంచి బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు. మైక్రో యూఎస్‌బీ పోర్ట్ ద్వారా దీనిని ఛార్జ్ చేసుకోవచ్చు, ఫుల్ ఛార్జ్ అవ్వడానికి దాదాపు 3 నుంచి 4 గంటల టైమ్ పడుతుంది.

మీకు తక్కువ బడ్జెట్‌లో రగ్గడ్ లుక్, పూల్ పార్టీల్లో తడిసినా పాడవని బిల్డ్ క్వాలిటీ, చెవులు అదిరిపోయే భారీ బేస్ కావాలనుకుంటే boAt Stone 1000 ని కళ్ళు మూసుకుని కొనేయొచ్చు.

Related News

ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. Airtel టాప్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇవే!

2-పిన్, 3-పిన్ ప్లగ్‌ల మధ్య తేడా ఏంటి? ఇవి కేవలం డిజైన్ కోసమేనా లేక సేఫ్టీ కోసమా?

ల్యాప్‌టాప్ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే షట్ డౌన్ చేయాలా? లేదా స్లీప్ మోడ్ బెటరా?

ఫోన్ ఛార్జ్ ఇట్టే పోతుందా? ఈ యాప్స్ ఏ కారణం!

120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!

10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్

రూ.849కే పోర్టబుల్ స్పీకర్..సౌండ్ వింటే మైండ్ బ్లాక్!

రూ.699కే ఫైర్‌బోల్ట్ ఇయర్‌బడ్స్..అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×