Delimitation Bill: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే డి లిమిటేషన్ మరియు మహిళా రిజర్వేన్ బిల్లుపై అకాలీ దళ్ పార్టీ అద్యక్షుడు ఖ్ బీర్ సింగ్ బాదల్ శిరోమణి కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే నిష్పక్షపాతమైన, న్యాయమైన నియోజకవర్గాల పునర్విభజన జరగాలని శిరోమణి అకాలీ దళ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డి లిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుకు శిరోమణి అకాలీ దళ్ మద్దతు తెలిపారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సీట్లను ఏకరీతిగా 50 శాతం పెంచాలని భారత ప్రభుత్వ ప్రతిపాదనను సమర్ధించారు. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజనను తక్షణమే చేపట్టాలని శిరోమణి అకాలీ దళ్ డిమాండ్ చేసారు. దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని అన్నారు. శిరోమణి అకాలీ దళ్ సిక్కుల బోధనల నుండి స్ఫూర్తి పొందిందని అన్నారు.
Also Read: నామినేటెడ్ పదవుల తుది జాబితా సిద్ధం.. సీఎం వద్దకు చేరిన సీక్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్టు!
దేశలో మహిళల గౌరవం, సమానత్వం సమాన హక్కుల కోసం సిక్కు గురువులు పోరాడారని గుర్తు చేశాడు. శిరోమణి గురుద్వారా పర్బందక్ కమిటీ సభలో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఇప్పటికే శిరోమణి అకాలీ దళ్ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఇటీవల పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీని సుఖ్ బీర్ సింగ్ బాదల్ కలిసారు. లోక్ సభలో శిరోమణి అకాలీ దళ్ పార్టీ నుండి ఓక స్థానాన్ని కలిగి ఉంది.
Also Read: నామినేటెడ్ పదవుల తుది జాబితా సిద్ధం.. సీఎం వద్దకు చేరిన సీక్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్టు!