E-Paper
Advertisement

బోట్ నుంచి కొత్త అల్టిమా ప్రైమ్ స్మార్ట్‌వాచ్.. ఫీచర్లకు మైండ్ బ్లాక్

బోట్ నుంచి కొత్త అల్టిమా ప్రైమ్ స్మార్ట్‌వాచ్.. ఫీచర్లకు మైండ్ బ్లాక్
Advertisement

boAt Ultima Prime:  స్మార్ట్‌వాచ్ అనేది ఇప్పుడు కేవలం టైమ్ చూసుకోవడానికో లేదా ఫోన్ నోటిఫికేషన్స్ కోసమో కాదు.. అదొక స్టైల్ స్టేట్‌మెంట్! అయితే.. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్, అమోలెడ్ స్క్రీన్ ఉన్న వాచ్ దొరకడం కాస్త కష్టమే. కానీ.. ప్రముఖ ఆడియో అండ్ వేరబుల్ బ్రాండ్ ‘boAt’ మన ముందుకు ఒక అదిరి పోయే స్మార్ట్‌వాచ్‌ను తీసుకొచ్చింది. అదే boAt Ultima Prime. కేవలం రూ. 2,999 ధరలో లభించే.. ఈ వాచ్ ఫీచర్లు, దీని స్పెషాలిటీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

boAt Ultima Prime పూర్తి వివరాలు:

1.1.43″ అల్ట్రా-ప్రీమియం డిస్‌ప్లే :

ఈ వాచ్‌కి స్పెషల్ అట్రాక్షన్ దీని స్క్రీన్. ఇందులో.. 1.43 ఇంచుల రౌండ్ AMOLED డిస్‌ప్లేను ఇచ్చారు. దీని వల్ల కలర్స్ చాలా బ్రైట్‌గా, క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తాయి. ఎండలో.. బయట తిరిగేటప్పుడు కూడా.. స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. పైగా ఇందులో. AOD ఫీచర్ ఉంది. అంటే.. మీరు వాచ్ ఆన్ చేయకుండానే..రొటేటింగ్  స్క్రీన్‌పై టైమ్, నోటిఫికేషన్స్ ఎల్లప్పుడూ కనిపిస్తూనే.. ఉంటాయి. ఇది వాచ్‌కి క్లాసీ అండ్ లగ్జరీ లుక్‌ని ఇస్తుంది.

2. ఫంక్షనల్ క్రౌన్ :

Advertisement

చాలా బడ్జెట్ వాచీల్లో.. సైడ్ బటన్ ఊరికే డిజైన్ కోసం ఇస్తారు. కానీ.. బోట్ అల్టిమా ప్రైమ్‌లో నిజమైన ‘ఫంక్షనల్ క్రౌన్’ ఇచ్చారు. దీన్ని తిప్పడం ద్వారా మీరు వాచ్ మెనూను స్క్రోల్ చేయవచ్చు. వాచ్ ఫేస్‌లను మార్చవచ్చు లేదా ఫీచర్లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ప్రీమియం ఆపిల్ వాచ్ తరహా ఫీలింగ్ ఇది మనకు ఇస్తుంది.

3. పర్సనలైజ్డ్ నడ్జెస్:

ఈ వాచ్‌లో ఉన్న ఒక యూనిక్ ఫీచర్ ‘పర్సనలైజ్డ్ నడ్జెస్’. ఇది కేవలం అలారాలు పెట్టడమే కాదు.. మీ రోజు వారీ పనులను గుర్తు చేస్తుంది. మీరు ఎక్కువ సేపు ఒకే.. చోట కూర్చుంటే ‘కాసేపు నడవండి’ అని.. నీళ్లు తాగడం మర్చిపోతే.. ‘వాటర్ తాగండి’ అని స్మార్ట్ అలర్ట్స్ ఇస్తుంది. అలాగే.. మీ డైలీ స్టెప్స్ టార్గెట్ పూర్తి కాగానే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది.

4. హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ట్రాకింగ్:

Advertisement

ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే వారి కోసం ఇందులో బోట్ హెల్త్ ఎకోసిస్టమ్ ఉంది.

Heart Rate Monitor: 24 గంటల హార్ట్ రేట్ చెకింగ్.

SpO2 Sensor: రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని ట్రాక్ చేస్తుంది.

Sleep Tracker: మీరు ఎంతసేపు ప్రశాంతంగా నిద్రపోయారో చెప్తుంది.

Multiple Sports Modes: రన్నింగ్, సైక్లింగ్, జిమ్, యోగా లాంటి ఎన్నో స్పోర్ట్స్ మోడ్స్ ఇందులో ఉన్నాయి.

5. బ్లూటూత్ కాలింగ్ & బ్యాటరీ లైఫ్:

ఇందులో ఇన్-బిల్ట్ మైక్ , స్పీకర్ ఉన్నాయి. దీని వల్ల ఫోన్ జేబులోంచి తీయకుండానే వాచ్ నుంచే నేరుగా కాల్స్ మాట్లాడవచ్చు. కాలింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. నార్మల్ యూసేజ్‌లో ఇది 5 నుంచి 7 రోజుల వరకు వస్తుంది. ఒకవేళ బ్లూటూత్ కాలింగ్ ఎక్కువగా వాడితే 2 రోజులు వస్తుంది.

ప్లస్ పాయింట్స్:

ధర కేవలం రూ. 2,999 మాత్రమే (వాల్యూ ఫర్ మనీ).

అద్భుతమైన మెటాలిక్ ఫినిషింగ్, స్టైలిష్ లుక్.

అమోలెడ్ డిస్‌ప్లే మరియు రొటేటింగ్ క్రౌన్ సూపర్ వర్కింగ్.

వందలాది క్లౌడ్ వాచ్ ఫేసెస్.

Also Read: రూ.1,299 కే టైప్-సి ఛార్జింగ్, ఫంక్షనల్ క్రౌన్ స్మార్ట్‌వాచ్.. ఫీచర్స్ అదిరాయిగా!

మైనస్ పాయింట్స్:

కాలింగ్ కంటిన్యూస్‌గా వాడితే.. బ్యాటరీ కాస్త త్వరగా అయిపోతుంది.

భారీ వర్షంలో.. లేదా స్విమ్మింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి (IP రేటింగ్ ఉన్నప్పటికీ పూర్తి వాటర్‌ప్రూఫ్ కాదు).

మీ బడ్జెట్ రూ. 3,000 లోపు ఉండి, చూడటానికి యాపిల్ లేదా శామ్‌సంగ్ వాచ్ రేంజ్‌లో ప్రీమియంగా కనిపించే రౌండ్ డయల్ స్మార్ట్‌వాచ్ కావాలంటే.. boAt Ultima Prime కళ్లూ మూసుకుని కొనేయొచ్చు. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇలాంటి AMOLED డిస్‌ప్లే, ఫంక్షనల్ క్రౌన్ కాంబినేషన్ దొరకడం చాలా రేర్.

Related News

ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. Airtel టాప్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇవే!

2-పిన్, 3-పిన్ ప్లగ్‌ల మధ్య తేడా ఏంటి? ఇవి కేవలం డిజైన్ కోసమేనా లేక సేఫ్టీ కోసమా?

ల్యాప్‌టాప్ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే షట్ డౌన్ చేయాలా? లేదా స్లీప్ మోడ్ బెటరా?

ఫోన్ ఛార్జ్ ఇట్టే పోతుందా? ఈ యాప్స్ ఏ కారణం!

120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!

10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్

రూ.849కే పోర్టబుల్ స్పీకర్..సౌండ్ వింటే మైండ్ బ్లాక్!

రూ.699కే ఫైర్‌బోల్ట్ ఇయర్‌బడ్స్..అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×