E-Paper
Advertisement

Kissik Talks: నిజాలు అక్కర్లేదు.. ఆరేళ్ల బంధంపై సోనియా ఊహించని కామెంట్!

Kissik Talks: నిజాలు అక్కర్లేదు.. ఆరేళ్ల బంధంపై సోనియా ఊహించని కామెంట్!
Advertisement

Kissik Talks: యూట్యూబర్ గా, సినీ నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సోనియా సింగ్ (Soniya Singh) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా తోటి నటుడు పవన్ సిద్ధూ(Pawan siddhu) తో రిలేషన్ లో ఉంటూ అటు సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ షోతో ఊహించని పాపులారిటీ అందుకున్న ఈమె ‘విరూపాక్ష’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను మరింత దోచుకున్నారు. అలాంటి ఈమె తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగానే తన లవ్ రిలేషన్ పై కామెంట్లు చేసిన సోనియా తమ రిలేషన్ పై వచ్చిన కామెంట్స్, తమ బంధాన్ని చూసి ఓర్వలేక కొంతమంది చేసిన కామెంట్లను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు..

ఆరేళ్లు రిలేషన్షిప్..

సోనియా మాట్లాడుతూ.. “పవన్ సిద్ధూ , నేను గత ఆరు సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్నాము. పెళ్లి కాకుండానే రిలేషన్ లో ఉండడాన్ని చాలామంది తప్పు పట్టారు. ముఖ్యంగా మా అమ్మకు మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని నమ్మకం ఉన్నా.. బయటి వాళ్ళ ఒత్తిడి వల్ల మా అమ్మ మాపై ఇన్ సెక్యూర్ ఫీలయ్యారు. వాళ్ల కూతుర్లు ఏమైపోయినా పర్లేదు కానీ పక్క వాళ్ళ కూతుళ్ళపై ఎప్పుడూ పడి చచ్చే అమ్మలు ఎక్కువే ఉన్నారు. వాళ్లకి ఎవరికీ నిజాలు అక్కర్లేదు.. అక్క, తమ్ముడు కలిసి వెళ్ళినా సరే రూమర్స్ అంటగట్టే సమాజంలో బ్రతుకుతున్నాము. ఆ సమయంలో నరకం చూసాను. బాధ తట్టుకోలేకపోయాను. ముఖ్యంగా ఒకరిని మార్చగలం.. ఇద్దరిని మార్చగలం.. కానీ ప్రపంచం మొత్తం ఇలాగే ఉన్నప్పుడు మనం మార్చలేము కదా.. ఒకరితో రిలేషన్ లో ఉన్నప్పుడు అన్నింటినీ భరించాలి. ముందుకు వెళ్లాలి అంటే మనపై ఎన్ని రూమర్స్ వచ్చినా .. విమర్శలు గుప్పించినా అన్నింటిని అధిగమించి ముందుకు వెళ్లినప్పుడే మన బంధం బలంగా నిలుస్తుంది “అంటూ లవ్ రిలేషన్ పై సోనియా కామెంట్లు చేసారు.

ఆ నరకం భరించలేకపోయాను..

Advertisement

సాధారణంగా ప్రేమ జంటల్లో గొడవలు, విడిపోవడాలు సహజమే. ఇక మా విషయంలో కూడా అదే జరిగింది. దాదాపు మూడు నెలల పాటు మా ఇద్దరి మధ్య గొడవలు పీక్స్ కి చేరిపోయాయి. ఇక విడిపోతామేమో అనే ఆలోచన కూడా వచ్చింది. కానీ జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత ఒకరికి ఒకరం తోడుగా ఉంటామని ప్రామిస్ చేసుకున్నాక.. గొడవలు ఎన్ని వచ్చినా సరే ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాల్సిందే” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఎంత బాధలో ఉన్నా సరే ఆ క్షణం ఒకరికొకరు గొడవపడినా.. ఆ తర్వాత సైలెంట్ గా ఉండి మా సమస్యలను మేము క్లియర్ చేసుకుంటాము. ముఖ్యంగా ప్రేమికుల మధ్య గొడవలు వస్తే ఈగోలు ఉండకూడదు , మనస్పర్ధలు ఉండకూడదు అని తెలిపారు.

లవ్ రిలేషన్ లో ట్రాన్స్పరెంట్ లైఫ్ ముఖ్యం..

ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ.. ఒకరితో లవ్ లో రిలేషన్ లో ఉన్నప్పుడు మనం పూర్తిగా ట్రాన్స్పరెంట్ లాగే ఉండాలి. ఎదుటి వ్యక్తి కూడా అలాగే ఉండాలి. రహస్యాలు, గోప్యతలు ఉండకూడదు. ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలిసి ఉండా.లి అప్పుడే ఆ బంధం మరింత బలంగా ఉంటుంది అంటూ తెలిపారు .

ట్రోల్స్ పై సోనియా కామెంట్..

Advertisement

సోనియా మాట్లాడితే డబుల్ మీనింగ్ డైలాగులు అని చాలామంది కామెంట్లు చేసేవారు. ముఖ్యంగా ఈమె కావాలని ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతుందా లేక తెలుగు రాక ఆమె మాట్లాడే మాటలు అలా దొర్లుతాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇదే విషయంపై హోస్ట్ వర్ష అడగగా. నేను పక్కా హైదరాబాద్ అమ్మాయిని.. హైదరాబాదులోనే పుట్టి, పెరిగి, ఇక్కడే చదువు పూర్తి చేశాను. అయితే నేను కొందరి దగ్గర ఉన్నప్పుడు పూర్తిగా కంఫర్ట్ జోన్లోకి వెళ్లిపోతాను. ముఖ్యంగా సిద్ధూతో ఉంటే నేను మరింత చిన్నపిల్లను అయిపోతాను . ఇక నా మాటలు అలా ఒకరికి డబుల్ మీనింగ్ లో అనిపించిండొచ్చు నాపై కూడా చాలా ట్రోల్స్ జరిగాయి అంటూ తెలిపారు సోనియా.

also read: మేము గుర్తులేమా? ఖుష్బూపై సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్!

Related News

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

Big Stories

Advertisement
×