BoAt Ultima Vogue 2 smartwatch: ఈ రోజుల్లో స్మార్ట్ వాచ్ కేవలం టైం చూడటానికి మాత్రమే కాదు, ఒక పర్ఫెక్ట్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్ , డెయిలీ హెల్త్ ట్రాకర్. తక్కువ ధరలోనే.. ప్రీమియం డిజైన్, కస్టమర్‌లకు కావాల్సిన ఫీచర్లు అందించడంలో బోట్ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. ఆ క్రమంలోనే.. బోట్ కంపెనీ సరికొత్త ఈ స్మార్ట్‌వాచ్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. 1.96-ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే, డైరెక్ట్ టైప్-సి ఛార్జింగ్ సపోర్ట్, ఫంక్షనల్ క్రౌన్ ,అమేజింగ్ బ్యాటరీ లైఫ్‌తో వచ్చిన ఈ వాచ్ ఫీచర్లు, మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం!
ఈ మోడల్ లో మెయిన్ అట్రాక్షన్ దీని 1.96-ఇంచుల డిస్‌ప్లే. 410 x 502 పిక్సెల్స్ రెజల్యూషన్‌తో వస్తున్న ఈ స్క్రీన్ పిక్చర్ క్వాలిటీని చాలా స్పష్టంగా చూపిస్తుంది. అంతే కాకుండా ఇందులో 1000 నిట్స్ బ్రైట్‌నెస్ ఇవ్వడం వల్ల కంటికి వెలుతురు తీవ్రంగా ఉండే మధ్యాహ్నం వేళల్లో కూడా నోటిఫికేషన్లు స్పష్టంగా కనిపిస్తాయి.
ఫంక్షనల్ క్రౌన్: మెటాలిక్ ఫ్రేమ్‌తో.. కూడిన బాడీకి నావిగేషన్ కోసం సైడ్‌లో ఫంక్షనల్ క్రౌన్ అందించారు. దీని ద్వారా వాచ్ ఫేసెస్ మార్చడం, మెనూ స్క్రోల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది.
సాధారణంగా స్మార్ట్ వాచ్‌లకు ప్రత్యేకమైన పిన్ ఛార్జర్లు అవసరం అవుతాయి, కానీ ఈ మోడల్ లో డైరెక్ట్ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ సపోర్ట్ ఇచ్చారు. దీని వల్ల మీ స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ టైప్-సి కేబుల్‌తోనే దీనికి ఛార్జ్ చేసుకోవచ్చు.
బ్యాటరీ పెర్ఫార్మెన్స్: సాధారణ వాడకంలో ఒకే ఛార్జ్‌పై ఏకంగా 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. (కాలింగ్ ఫీచర్ నిరంతరం వాడితే 2-3 రోజులు వస్తుంది).
ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ v5.4 కనెక్టివిటీతో పాటు ఇన్-బిల్ట్ హెచ్డీ మైక్రో ఫోన్, లౌడ్ స్పీకర్ ఇచ్చారు. ఫోన్ తీయకుండానే.. వాచ్ నుంచే.. నేరుగా కాల్స్ ఆన్సర్ చేయడం, డయల్ ప్యాడ్ ఉపయోగించడం, కాంటాక్ట్స్‌ను సేవ్ చేసుకునే వీలుంది. అంతే కాకుండా మేసేజ్ లేదా కాల్ వచ్చప్పుడు ప్రీ-సెట్ క్విక్ రిప్లైస్ కూడా పంపొచ్చు.
24/7 హెల్త్ ట్రాకింగ్: గుండె వేగం , రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు , స్ట్రెస్ ,స్లీప్ క్వాలిటీని నిరంతరం ట్రాక్ చేస్తుంది.
100+ స్పోర్ట్స్ మోడ్లు: జిమ్, రన్నింగ్, వాకింగ్, యోగా, క్రికెట్ వంటి 100 కంటే.. ఎక్కువ స్పోర్ట్స్ మోడ్లు ఉన్నాయి. వీటి వల్ల వాకింగ్, రన్నింగ్‌లను ఆటోమేటిక్‌గా రికార్డ్ చేస్తుంది.
IP68 రేటింగ్: వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కావడంతో చెమట, వర్షం నీటి చుక్కల నుంచి వాచ్‌కి పూర్తి రక్షణ ఉంటుంది.
ఎమర్జెన్సీ SOS: అత్యవసర సమయాల్లో.. సహాయం కోసం SOS ఫీచర్ అందించడం అదనపు ప్లస్ పాయింట్.
Also Read: అతి తక్కువ ధరలో.. స్మార్ట్ టీవీ! హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ గ్యారంటీ
మార్కెట్లోఈ స్మార్ట్‌వాచ్ ఆన్‌లైన్ ప్రారంభ ధర రూ. 2,799 గా ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, అధికారిక బోట్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంది.
రూ. 3,000 లోపు బడ్జెట్‌లో ప్రీమియం డిజైన్, డిస్‌ప్లే, టైప్-సి ఛార్జింగ్, అడ్వాన్స్డ్ కాలింగ్ ఫీచర్లు కోరుకునే వారికి ఈ మోడల్ ఒక పర్ఫెక్ట్ అండ్ వర్త్ చాయిస్.