Boltt Ace 5G and Boltt Evo: స్మార్ట్‌వాచ్‌ల మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫైర్‌బోల్ట్.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ రంగంలోకి అడుగుపెట్టింది. బోల్ట్ పేరుతో కొత్త సబ్‌బ్రాండ్‌ను పరిచయం చేస్తూ భారత్‌లో ఒకేసారి రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. Bolt Ace 5G, Bolt Evo పేరుతో వచ్చిన ఈ రెండు ఫోన్లు బడ్జెట్ ధరలో పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, మంచి కెమెరా వంటి ఫీచర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
రెండు ఫోన్లలోనూ 6.79 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్ లభిస్తుంది. అలాగే 6,000mAh భారీ బ్యాటరీని అందించారు. ఏస్ 5Gలో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
Also Read: ఇక వాట్సప్ స్టిక్కర్లకు కొదవలేదు.. ChatGPTలో క్రేజీ ఫీచర్.. మీ ఆలోచనలతోనే స్టిక్కర్లు!
పెర్ఫార్మెన్స్ కోసం బోల్ట్ ఏస్ 5Gలో Unisoc T8200 ప్రాసెసర్‌ను, బోల్ట్ ఈవోలో Unisoc T7250 చిప్‌సెట్‌ను అందించారు. రెండు ఫోన్లు Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి. రోజువారీ పనులు, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ వంటి అవసరాలకు ఇవి సరిపోయేలా ఉన్నాయి.
ఇక కెమెరా పరంగా చూసుకుంటూ.. ఏస్ 5Gలో 64MP మెయిన్ కెమెరా ఉంది. ఈవోలో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP మైక్రో సెన్సార్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం రెండు మోడళ్లలోనూ 8MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. మంచి ఫొటోలు కావాలనుకునే ఫొటో ప్రియులు ఏస్ 5Gని ఎంచుకోవడం ఉత్తమం.
బోల్ట్ ఈవో 4GB+64GB వేరియంట్ ధర రూ.10,999 కాగా, 6GB వేరియంట్ రూ.11,999. ఏస్ 5G 4GB+64GB ధర రూ.13,999, 8GB+128GB ధర రూ.15,999గా ఉంది. తొలి రోజు కొనుగోలుపై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌లో ఆ రెండు స్మార్ట్‌ఫోన్లు విక్రయానికి రానున్నాయి.
Also Read: ఈ రక్షా బంధన్‌కు కజిన్స్‌ను ఇంప్రెస్ చేసే 5 యూనిక్ టెక్ గిఫ్ట్స్.. బడ్జెట్ ధరలోనే!