Xiaomi 18 Fold: స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ మార్కెట్‌లో మరోసారి తమ సత్తా చాటేందుకు షియోమీ సిద్ధమవుతోంది. సెప్టెంబర్‌లో రెండు కొత్త ప్రీమియం డివైజ్‌లను చైనాలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో Xiaomi 18 Fold పేరుతో కొత్త బుక్‌స్టైల్ ఫోల్డబుల్ ఫోన్, Xiaomi Pad 9 Pro Max పేరుతో హైఎండ్ ట్యాబ్లెట్ ఉండనున్నాయి. 2024లో వచ్చిన మిక్స్ ఫోల్డ్ 4 తర్వాత షియోమీ నుంచి వస్తున్న ఫోల్డబుల్ ఫోన్ ఇదే కావడం ప్రత్యేకత.
ఈ రెండు డివైజ్‌లలో షియోమీ కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన ఎక్స్‌రింగ్ 03 (Xring 03) ప్రాసెసర్‌ను ఉపయోగిస్తోంది. ఈ చిప్‌తో మార్కెట్లోకి వస్తున్న తొలి డివైజ్‌లు ఇవే. అంతేకాదు.. AI పనులను మరింత వేగంగా నిర్వహించేందుకు ఎక్స్‌రింగ్ O100 AI యాక్సిలరేషన్ చిప్, ఎక్స్‌రింగ్ D100 AI చిప్లను కూడా ఇందులో భాగం చేసింది. ఈ మూడు చిప్‌ల కాంబినేషన్ ద్వారా సాధారణ పనులతో పాటు AI ఆధారిత ఫీచర్లు కూడా మరింత వేగంగా, స్మూత్‌గా పనిచేసే అవకాశం ఉంది.
Also Read: ఇంత తక్కువ ధరకి 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరానా? Lava Virat V1 Pro 5G వచ్చేసిందోచ్!
పెర్ఫార్మన్స్ విషయంలో ఎక్స్‌రింగ్ 03 ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. 3nm ప్రాసెస్‌పై తయారైన ఈ చిప్‌లో 10 కోర్ CPU ఉంది. ఇది గరిష్టంగా 4.35GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. AnTuTu బెంచ్‌మార్క్‌లో ఏకంగా 52 లక్షలకు పైగా స్కోర్ సాధించినట్లు షియోమీ వెల్లడించింది.
గేమింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇందులో 16-కోర్ GPUను కూడా అందించారు. మెరుగైన గ్రాఫిక్స్‌ను అందించడంతో పాటు, గత తరంతో పోలిస్తే పవర్ వినియోగాన్ని 64 శాతం వరకు తగ్గించేలా దీనిని రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది.
AI పనితీరులోనూ ఎక్స్‌రింగ్ 03 బలమైన స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. ఇది 200 TOPS AI పనితీరును అందించడంతో పాటు, లేటెస్ట్ LPDDR6 RAM టెక్నాలజీకి కూడా సపోర్ట్ చేస్తుంది. సొంత చిప్‌సెట్, హైఎండ్ గ్రాఫిక్స్, AI సామర్థ్యాలు, కొత్త తరం RAM సపోర్ట్‌తో షియోమీ 18 ఫోల్డ్, ప్యాడ్ 9 ప్రో మ్యాక్స్ ప్రీమియం సెగ్మెంట్‌లో ఆసక్తిని పెంచుతున్నాయి. లాంచ్ తేదీని మాత్రం షియోమీ ఇంకా వెల్లడించలేదు. అయితే సెప్టెంబర్‌లోనే ఈ రెండు డివైజ్‌లు చైనా మార్కెట్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది.
Also Read: Galaxy S27 Ultra కెమెరా రీ-డిజైన్.. Qi2 మాగ్నెటిక్ ఛార్జింగ్‌తో రాబోతుందా?