E-Paper
Advertisement

రూ.499కే పిల్లల కోసం కిరాక్ గ్యాడ్జెట్.. పోర్ట్రానిక్స్ సరికొత్త రఫ్ ప్యాడ్స్ ఫీచర్లివే!

రూ.499కే పిల్లల కోసం కిరాక్ గ్యాడ్జెట్.. పోర్ట్రానిక్స్ సరికొత్త రఫ్ ప్యాడ్స్ ఫీచర్లివే!
Advertisement

Portronics Ruffpad: పిల్లలకు చదువుతో పాటు డ్రాయింగ్ నేర్పించడం, వారితో అల్లరి లేకుండా సరదాగా గడిపేలా చేయడం తల్లిదండ్రులకు పెద్ద సవాలే. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ గ్యాడ్జెట్ సంస్థ పోర్ట్రానిక్స్ భారత మార్కెట్లోకి కొత్త Ruffpad సిరీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. రంగురంగుల డిజైన్లు, చిన్నారులను ఆకట్టుకునే బొమ్మలతో తీసుకొచ్చిన ఈ డిజిటల్ రైటింగ్ ప్యాడ్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

మూడు సరికొత్త మోడల్స్..

ఈ కొత్త సిరీస్‌లో మొత్తం 3 రకాల ప్యాడ్స్‌ను పరిచయం చేశారు. అందులో 8.5 అంగుళాల స్క్రీన్‌తో టెడ్డీ బేర్ బొమ్మతో వచ్చే రఫ్ ప్యాడ్ టెడ్డీ, గ్రీన్ కలర్ డినో డిజైన్‌తో వచ్చే రఫ్ ప్యాడ్ డినో ఉన్నాయి. కొంచెం పెద్ద స్క్రీన్ కావాలనుకునే వారి కోసం 10 అంగుళాల డిస్‌ప్లేతో రఫ్ ప్యాడ్ పప్‌ఎక్స్ మోడల్‌ను అందుబాటులో ఉంచారు. దీనికి ఉండే కుక్కపిల్ల చెవుల వంటి హ్యాండిల్స్ వల్ల పిల్లలు ఎక్కడికైనా సులభంగా పట్టుకెళ్లవచ్చు.

Advertisement

Also Read: 64% పవర్ సేవింగ్ టెక్నాలజీతో షియోమీ కొత్త డివైజ్‌లు.. భారత్‌లోకి ఎప్పుడంటే?

ఎన్నో ఉపయోగకరమైన ఫీచర్లు..

ఈ ప్యాడ్స్‌పై పిల్లలు ఎంతైనా రాసుకోవచ్చు, బొమ్మలు వేసుకోవచ్చు. నచ్చకపోతే ఒక్క బటన్ నొక్కి మొత్తం చెరిపేసి మళ్లీ కొత్తగా ప్రారంభించవచ్చు. దీనివల్ల కాగితాల వృధా ఉండదు. చేతులకు సిరా మరకలు అంటవు. అలాగే చిన్నారుల కళ్లకు ఎలాంటి హాని కలగకుండా వీటిలో బ్లూలైట్ లేని ఎల్‌సీడీ స్క్రీన్‌ను వాడారు. అంతేకాకుండా.. పిల్లలు వేసిన బొమ్మలు పొరపాటున చెరిగిపోకుండా స్క్రీన్ లాక్ ఫీచర్ కూడా ఇచ్చారు. మొబైల్ యాప్ ద్వారా వారు వేసిన డ్రాయింగ్స్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవచ్చు.

బ్యాటరీ, డిజైన్..

Advertisement

ఇవి చాలా తేలికగా, బ్యాగ్‌లో సులభంగా పట్టేలా ఉంటాయి. వీటిలో చిన్న కాయిన్ బ్యాటరీలను ఉపయోగించారు. టెడ్డీ, పప్‌ఎక్స్ మోడల్స్ CR2025 బ్యాటరీతో పనిచేస్తే, డినో మోడల్ CR2016 బ్యాటరీతో నడుస్తుంది. చదువుకునే వయసు ఉన్న పిల్లలకు చేతిరాత అలవాటు చేయడానికి, వారిలోని సృజనాత్మకతను పెంచడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.

12 నెలల వారెంటీ..

ఇక ధరల విషయానికి వస్తే.. రఫ్ ప్యాడ్ డినో రూ.499 లభిస్తుండగా, టెడ్డీ మోడల్ ధర రూ.599గా ఉంది. ఇక పెద్ద మోడల్ పప్‌ఎక్స్ 10 ధరను రూ.749గా నిర్ణయించారు. వీటిపై కంపెనీ ఏడాది (12 నెలలు) వారంటీ ఇస్తోంది. పోర్ట్రానిక్స్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, ప్రముఖ రీటైల్ స్టోర్లలో ఇవి కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

Also Read: ఇంత తక్కువ ధరకి 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరానా? Lava Virat V1 Pro 5G వచ్చేసిందోచ్!

Tags

Related News

సేల్‌లో..టీవీలపై భారీ డిస్కౌంట్! ఎగబడి కొంటున్న జనం

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధమాకా..HP లాప్‌టాప్స్‌ ఇప్పుడు సగం ధరకే !

మీ ఐఫోన్ మెమరీ ఉన్నట్టుండి ఫుల్ అయిందా? ఈ ఒక్క సెట్టింగ్ ఆఫ్ చేస్తే 14GB మీ సొంతం!

తక్కువ ధరలో..మంచి పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా ?

రూ.599 నుంచే వైర్‌లెస్ బడ్స్.. అమెజాన్ సేల్‌లో మిస్ అవ్వకూడని టాప్ డీల్స్!

స్మార్ట్‌ ఫోన్‌నే స్పై కెమెరాగా మార్చే టెక్నాలజీ.. కాల్స్, మెసేజెస్, చివరికి లొకేషన్స్ కూడా లీక్!

ఇంట్లో వ్యాక్యూమ్ రోబోట్ తిరుగుతోందా? హ్యాకర్లు మిమ్మల్ని సైలెంట్‌గా గమనిస్తున్నారు జాగ్రత్త!

గేమర్స్‌కు గుడ్‌న్యూస్..బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్‌పై భారీ డిస్కౌంట్లు

Big Stories

Advertisement
×