E-Paper
Advertisement

టీమిండియాను గ్రూప్ స్టేజ్ లోనే ఇంటికి పంపిస్తాం..ఫాతిమా సనా హెచ్చ‌రిక‌

టీమిండియాను గ్రూప్ స్టేజ్ లోనే ఇంటికి పంపిస్తాం..ఫాతిమా సనా హెచ్చ‌రిక‌
Advertisement

Womens T20 World Cup 2026:  మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Women’s T20 World Cup 2026 ) ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టోర్నమెంట్ కోసం అన్ని ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. ఇంగ్లాండ్ వేదికగా ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. అయితే ఇలాంటి తరుణంలో టీమిండియా మహిళల జట్టుకు పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా డేంజర్ బెల్స్ పంపించారు. ఈ టోర్నమెంటులో టీమిండియాను ఎలిమినేట్ చేస్తామని హెచ్చరించారు. గ్రూప్ స్టేజ్ లోనే టీమ్ ఇండియాను ఇంటికి పంపించే బాధ్యత తాను తీసుకుంటానని పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా ( Fatima Sana) చాలెంజ్ విసిరారు. లేకపోతే తన పేరు మార్చుకుంటానని కూడా స్పష్టం చేశారు. దీంతో ఫాతిమా సనా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

టీమిండియాను గ్రూప్ స్టేజ్ లోనే ఇంటికి పంపిస్తాం – ఫాతిమా సనా

Advertisement

మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Women’s T20 World Cup 2026 ) ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో పాకిస్తాన్ అలాగే టీమిండియా రెండు కూడా ఒకే గ్రూపులో ఉంటున్నాయి. దీంతో ఈ రెండు జట్ల మధ్య జూన్ 14వ తేదీన ఎడ్జ్ బస్టన్ వేదికగా రాత్రి 7 గంటలకు బిగ్ ఫైట్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ టి20 క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ లో టీమిండియాను ఓడించడమే కాకుండా… గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ చేస్తామని హెచ్చరించారు.

అలా ఎలిమినేట్ చేయకపోతే తన పేరు మార్చుకుంటానని శపథం చేశారు. అలాగే ఈసారి జరుగుతున్న టి20 ప్రపంచ కప్ టోర్నమెంటులో తామే విజేతగా నిలుస్తామని వెల్లడించారు. సెమీ ఫైనల్స్ వెళ్లే జట్లను కూడా ఆమె అంచనా వేశారు. తన అంచనా ప్రకారం పాకిస్తాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ తో పాటు దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్ కు వెళ్తాయని వెల్లడించారు. ఈ సెమీఫైనల్స్ లో అద్భుతంగా రానించి తాము ఫైనల్ కు వెళ్తామని ప్రకటించారు. ఈ తరుణంలోనే ఫైనల్స్ లో కూడా గెలిచి టైటిల్ తీసుకువెళ్తామని స్పష్టం చేశారు పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా. దీంతో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా ( Fatima Sana) చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. అయితే పాకిస్తాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనా చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఫాతిమాసన ఇండియాపై గెలుస్తామని పగటి కలలు కంటోందని మండిపడ్డారు. తమను ఎలిమినేట్ చేయడం కాదు.. పాకిస్తాన్ ఎలిమినేట్ కాకుండా చూసుకోవాలని చురకలు అంటించారు.

Advertisement

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

 

Related News

టీమిండియాతో మ్యాచ్‌..భ‌య‌ప‌డి పారిపోయిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ హఫీజ్

ధోని లేక‌పోయింటే…ఆ రోజునే ఆత్మ‌హ‌**త్య చేసుకునేవాడిని

అజింక్య రహానే షాకింగ్ నిర్ణ‌యం…నేపాల్ త‌ర‌ఫున ఆడేందుకు ఒప్పందం ?

పాకిస్తాన్ జ‌ట్టులో మూడు గ్రూపులు..డ్రెస్సింగ్ రూంలోనే త‌న్నుకుంటున్నారు

పాకిస్తాన్ బౌల‌ర్ ను మెచ్చుకున్న‌ ర‌విశాస్త్రి…అత‌న్ని ఎదుర్కొవ‌డం ఎవ‌రి వ‌ల్లే కాదంటూ

పేరుకే 3D ప్లేయ‌ర్‌..కానీ చివ‌రి ఓవ‌ర్ లో ఒక్క ప‌రుగు కూడా చేయ‌డం చేత‌కాదు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో మొత్తం అవినీతే..వెంట‌నే ICC జోక్యం చేసుకోవాలి

బీహార్ వాళ్ల‌కు కెప్టెన్సీ ఇచ్చి, న‌న్ను అవ‌మానించారు…యువ‌రాజు సీరియ‌స్ ?

Big Stories

Advertisement
×