AA23 Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh kanagaraj) కాంబినేషన్‌లో రాబోతున్న ‘AA23’ చిత్రంపై అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫిలింనగర్‌లో ఓ ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్, రొమాన్స్ లేకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ తన మార్క్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారనే టాక్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది..
తాజా సమాచారం ప్రకారం, లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి యాక్షన్, ఎమోషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారట. ఇక స్టార్ హీరో సినిమా అనగానే సాధారణంగా హీరోయిన్, లవ్ స్టోరీ, కమర్షియల్ పాటలు ఉంటాయి. కానీ ఈ రొటీన్ ఫార్ములాకు భిన్నంగా, కథను మాత్రమే నమ్ముకుని ఈ సినిమాను తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది.
గతంలో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘ఖైదీ’, ‘విక్రమ్’ వంటి సినిమాల్లో హీరోయిన్, రొమాంటిక్ సీన్లు లేకుండానే బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి సక్సెస్ సాధించారు. కేవలం కథనంతోనే ప్రేక్షకులను థియేటర్లలో సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెట్టడం లోకేష్ శైలి. ఇక ఇప్పుడు అదే ఫార్ములాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాకు కూడా అప్లై చేస్తున్నారనే టాక్ సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
ఈ ప్రచారం గనుక నిజమైతే అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఇది ఒక సాహసోపేతమైన, విభిన్నమైన సినిమాగా నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘పుష్ప’ సినిమాతో పాన్-ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న బన్నీ, ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తూనే, లోకేష్ ప్రాజెక్ట్‌ను కూడా అనౌన్స్ చేశారు. ఇక మాస్ ఆడియన్స్‌ను మెప్పించే బన్నీకి ఇలాంటి కంటెంట్ పడితే రేంజ్ వేరేలా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
also read:హీరో విశాల్ రాజకీయాల్లోకి ఎంట్రీ?
హీరోయిన్ లేదనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తున్నప్పటికీ, చిత్రబృందం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, ఈ క్రేజీ కాంబో గురించి వస్తున్న ప్రతీ అప్‌డేట్ బన్నీ అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రియుల్లో కూడా సినిమాపై ఉన్న క్యూరియాసిటీని రెట్టింపు చేస్తోంది.
కమర్షియల్ హంగుల కంటే కథకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం జరుగుతుందో ఊహించవచ్చు. హీరోయిన్ లేకుండా ప్యూర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ ‘AA23’ టాలీవుడ్‌లో ఎలాంటి నయా ట్రెండ్ సెట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.