Android users: ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) ఆండ్రాయిడ్ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. అండ్రాయడ్ 12వ వెర్షన్ వాడుతున్న స్మార్ట్ ఫోన్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. వెంటనే కొత్త వెర్షన్ ను అప్డేట్ చేసుకోవాలని సలహాలు ఇచ్చింది. సైబర్ మోసాల ప్రమాదాన్ని తగ్గంచడానికి, స్మార్ట్ ఫోన్ వినియోగదారులు వెంటనే తమ ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని వినియోగదారులను కోరింది. డేటా లేకపోవడం, స్టోరేజ్ సమస్య మొదలగు కారణాల వల్ల చాలా మంది స్మార్ట్ ఫోన్ లను అప్డేట్ చేసుకోరు. ఓఎస్ ఓల్డ్ వెర్షన్ ఉన్న స్మార్ట్ ఫోన్ లలో సైబర్ దాడులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని పేర్కొంది.
ఆండ్రాయిడ్ యూజర్ల ఫ్రైవసీకి ముప్పు ఉందని.. పాత వెర్షన్ ఉన్న మొబైల్స్ లో హ్యాకరస్ ఈజీగా ప్రవేశించి.. యూజర్ కు తెలియకుండానే అందులోని విలువైన సమాచారాన్ని హ్యాక్ చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. CERT-In జారీ చేసిన హెచ్చరికల ప్రకారం.. వినియోగదారులు స్మార్ట్ ఫోన్ ను వెంటనే అప్డేట్ చేసుకోకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని పేర్కొంది. ఆండ్రాయిడ్ ఓఎస్ లో అనేక లోపాలు నమోదు అయ్యాయని వివరించింది. మోసగాళ్లు మీ ప్రైవసీని పొందడానికి ఇది వీలు కల్పిస్తుందని హెచ్చరించింది. ఆండ్రాయిడ్ లో అనేక బలహీనతలు ఉన్నాయని పేర్కొంది. తమ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకునేందుకు వినియోగదదారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. సెర్ట్ చెబుతున్న దాని ప్రకారం ఆండ్రాయిడ్ 13తో పాటు అంతకన్నా ముందు వెర్షన్లలో వీటిని కొనుగొన్నట్లు చెబుతున్నారు. ఆండ్రాయిడ్ 11, 12, 12ఎల్, 13 వెర్షన్లలో లోపాలు గుర్తించినట్లు చెబుతున్నారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ లోపాలు మీ పరికరంలోని ఏదో ఒక భాగానికి మాత్రమే పరిమితం కావు; అవి ఆండ్రాయిడ్ సిస్టమ్‌లోని వివిధ భాగాలలో కనిపిస్తాయి. ఇందులో ఫ్రేమ్‌వర్క్, సిస్టమ్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్‌డేట్‌లు, అలాగే ఆర్మ్, మీడియాటెక్, యూనిసోక్, క్వాల్కామ్ లకు చెందిన క్లోజ్డ్ సోర్స్ కాంపోనెంట్‌ల వంటి విభిన్న హార్డ్‌వేర్ భాగాల్లో ఈ లోపాలున్నాయి. వినియోగదారుల లోపాలను ఆసరా చేసుకొని సైబర్ నేరగాళ్లు సులభంగా ఫోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకొని వ్యక్తిగత డేటాను తమ కంట్రోల్ లోకి తీసుకునే అవకాశం ఉంది. సైబర్ నేరగాళ్లు సులభంగా ఫోన్‌ను కంట్రోల్‌లోకి తీసుకోవచ్చని.. డేటాను దొంగలించే అవకాశం ఉందని చెప్పింది. ఫ్రేమ్‌వర్క్, సిస్టమ్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్‌డేట్‌లు, మొదలైన సిస్టమ్‌లోని వివిధ భాగాలలో లోపాలు ఉండొచ్చని తెలిపింది.
సైబర్ ముప్పు నుంచి బయట పడడానికి ఆండ్రాయిడ్ 12, 13, 14, 15 వెర్షన్ ఉన్న స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఆలస్యం చేయకుండా వెంటనే కొత్త వెర్షన్ ను అప్డేట్ చేసుకోవాలని సలహా ఇచ్చింది. వినియోగ దారుల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించేందుకు CERT-In కొన్ని జాగ్రత్తలు చెబుతోంది. సాధ్యమైనంత త్వరగా మీ స్మార్ట్ ఫోన్ల ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడమే ఉత్తమ మార్గమని సూచిస్తుంది. అనుమానస్పద లింక్ లు క్లిక్ చేయకూడదని సూచించింది. మీకు ఏమైనా సమాచారం కావాలంటే గూగుల్ ప్లే స్లోర్ నుంచి మాత్రమే యాప్ లను డౌన్ లోడ్ చేయాలని సూచించింది.
మీ మొబైల్ లో స్ట్రాంగ్ పాస్ వర్డులను క్రియేట్ చేసుకోవడం వల్ల సైబర్ మోసాల నుంచి కొంతవరకు బయటపడే ఆస్కారం ఉంటుందని తెలిపింది. వినియోగదారుల పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఇతర లాగిన్ సంబంధిత విషయాలను దొంగలించడానికి సైబర్ నేరగాళ్లు రెడీగా ఉంటారని.. దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని వివరించింది. CERT-In సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తే సైబర్ నేరగాళ్ల నుంచి ఈజీగా బయటపడొచ్చు. వినియోగదారలు వ్యక్తిగత సమాచారం, మీ స్టార్ట ఫోన్ లో ఉన్న ఎలాంటి ప్రైవసినీ అయినా సులభంగా రక్షించుకోవచ్చు.