E-Paper
Advertisement

ఐఫోన్ 18 ప్రో అంత చౌక? భారత్ నుంచి దుబాయ్‌కి యువత పరుగులు

ఐఫోన్ 18 ప్రో అంత చౌక? భారత్ నుంచి దుబాయ్‌కి యువత పరుగులు
Advertisement

iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో కొనుగోలుకు భారత్ యువతీ యువకులు దుబాయ్‌కి క్యూ కడుతున్నారా? ఇండియా కంటే అక్కడ రూ30 వేలు తక్కువగా వస్తోందా? దీంతో అంతర్జాతీయ విమానాలు బుక్ చేసుకునేందుకు యువతీయువకులు క్యూ కడుతున్నారా? దుబాయ్ మార్కెట్లో అంత తక్కువగా ఎందుకు వస్తుంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

దుబాయ్ మార్కెట్‌కి యువత పరుగులు

ఇటీవల యాపిల్ సంస్థ ఐఫోన్ 18 ప్రో ఫోన్ రిలీజ్ చేసింది. దేశీయ మార్కెట్లో ఐఫోన్ ప్రో ప్రారంభ ధర రూ. 1.65 లక్షలు ఉన్నట్లు చెబుతున్నారు. దుబాయ్ మార్కెట్లో భారత్ కంటే రూ.30 వేలు తక్కువగా రావడంతో యువతీ యువకులు అక్కడికి క్యూ కడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారీ ధర వ్యత్యాసం కారణంగా కొంతమంది భారతీయ వినియోగదారులను కొత్త ఆపిల్ ఐఫోన్ 18 ప్రోను కొనుగోలు చేయడం కోసం విమాన ప్రయాణాలను బుక్ చేసుకునేలా ప్రోత్సహిస్తోంది.

ఐఫోన్ 18 ప్రో దుబాయ్‌లో మరీ అంత చౌక?

Advertisement

యూఏఈలో ఐఫోన్ 18 ప్రో ధర 5,099 దిర్హమ్‌ల నుండి ప్రారంభమవుతుంది. ఇది సుమారు రూ. 1.32 లక్షల నుండి రూ. 1.33 లక్షల వరకు ఉంటుందని కొందరు కస్టమర్లు చెబుతున్నారు. ఐఫోన్ 18 ప్రో మాక్స్ విషయానికొస్తే.. యూఏఈ ధర 5,499 దిర్హమ్‌లు అంటే సుమారు రూ.1.42 లక్షల నుండి రూ.1.44 లక్షల వరకు ఉంటుంది. ఆ ఫోన్లు భారత్ రిటైల్ స్టోర్లలో 256GB మోడల్ ప్రారంభ ధర రూ. 1,64,900గా ఉందని అంటున్నారు. ఐఫోన్ 18 ప్రో మాక్స్ ధర ₹1,79,900 ఉంది. దుబాయ్-భారత్ మార్కెట్ల మధ్య వ్యత్యాసం దాదాపు రూ.38 వేలు. ఈ ధరల తేడాను గమనించిన కొందరు యువతీయువకులు, రెండు ఫోన్లు తీసుకుంటే దాదాపు రూ.50 వేలు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ మార్కెట్లలో తిరిగే కొనుగోలుదారులు ఒకటి కంటే ఎక్కువ పరికరాలను కొనుగోలు చేసినప్పుడు, కుటుంబ సభ్యుల సందర్శనలతో కలిసి కొనుగోలు చేస్తే అక్కడ తక్కువకు వస్తుందని అంచనా వేస్తున్నారు.

భారత్ మార్కెట్లో పోల్చితే రూ. 30 వేలు తేడా?

విమాన టిక్కెట్లు, ఖర్చులను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ దుబాయ్‌లో ఐఫోన్ కొనడం చౌకగా ఉంటుందని కొనుగోలుదారులు చెబుతున్నమాట. ముంబైకి చెందిన అమన్ సోలంకి మాట్లాడుతూ.. ధరల్లో వ్యత్యాసం వల్ల దుబాయ్ పర్యటనను సమర్థించుకున్నట్లు చెప్పాడు. ఒకటి కంటే ఎక్కువ ఫోన్‌లు కొనుగోలు చేస్తే ధరలలో వ్యత్యాసం రూ. 50 వేలు నుంచి రూ. 60 వేలు వరకు ఉండవచ్చని తెలిపాడు. కేరళకు చెందిన సయ్యద్ దుబాయ్‌లోని తన కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్ళినప్పుడు ధరలను పోల్చి చూశాడు. భారత్‌లో పన్నుల కారణంగా ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని, కొత్త ఐఫోన్‌పై సుమారు రూ. 20 వేలు నుండి రూ. 30 వేలు ఆదా అవుతుందని చెప్పాడు. అందుకు ఖరీదైన ఫోన్ తీసుకున్నట్లు తెలిపాడు.

ఆగ్నేయాసియా మార్కెట్లో కూడా ఆ స్థాయిలో

Advertisement

ఆగ్నేయాసియాలో ఐఫోన్ 18 ప్రో చౌకగా దొరికే మార్కెట్లలో మలేషియా ఒకటి. అక్కడ 256 GB మోడల్ ధర సుమారు 1350 డాలర్లుగా ఉంది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 1,28,717 అన్నమాట. థాయ్‌లాండ్‌లో అయితే 1468 డాలర్లు. భారతీయ కరెన్సీలో రూ.1,28,717. సింగపూర్, వియత్నాం, ఫిలిప్పీన్స్‌లలో ధరలు వరుసగా సుమారుగా 1492 నుంచి 1,500 డాలర్లుగా ఉన్నాయి. పరిస్థితి గమనించిన ఫోన్ లవర్స్.. మలేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాలకు వెళ్లే ప్రయాణికులు అక్కడి నుంచి వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇండియాలో పన్నుల ఎక్కువగా ఉండడంతో ఆ ధరకు ఉందని అంటున్నారు. విమాన ఛార్జీలు, విదేశీ మారక ద్రవ్య మార్పిడి, భారత్‌లో తిరిగి ప్రవేశించేటప్పుడు వర్తించే కస్టమ్స్ నిబంధనలు హెచ్చుతగ్గులు ఉంటాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: విండోస్‌కు చెక్ పెట్టేలా గూగుల్ నుంచి కొత్త ల్యాప్‌టాప్.. ఫీచర్లు చూస్తే కొనకుండా వదిలిపెట్టరు!

ఆపిల్ తన మొదటి ఫోల్డబుల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లను సెప్టెంబర్ 9న మార్కెట్లోకి విడుదల చేసింది. కెమెరా, టెలిఫోటో కెమెరా, అల్ట్రావైడ్ కెమెరా అనే మూడు 48-మెగాపిక్సెల్ కెమెరాలనున్న మొదటి ప్రీమియం ఐఫోన్‌లు ఇవే. ఒకే ఛార్జ్‌పై 18 ప్రో 24 గంటల వరకు, 18 ప్రో మాక్స్ 30 గంటల వరకు పనిచేస్తుందని ఆపిల్ పేర్కొంది. ఇప్పటివరకు ఉన్న వాటిలో ఇదే అత్యధిక బ్యాటరీ లైఫ్. ఈ ఫోన్‌ను కేవలం 15 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేయవచ్చు.

Related News

సంచలనం సృష్టిస్తున్న ఫ్లిప్‌కార్ట్ ఎర్లీ డీల్స్.. ఐఫోన్ 17తో పాటు ఆ ఐటమ్స్‌పై భారీ ఆఫర్లు!

ప్రయాణాల్లో ఫోన్ బ్యాటరీ డౌన్ అవుతోందా? తక్కువ ధరలో టాప్-5 పవర్ బ్యాంక్స్ ఇవే!

విండోస్‌కు చెక్ పెట్టేలా గూగుల్ నుంచి కొత్త ల్యాప్‌టాప్.. ఫీచర్లు చూస్తే కొనకుండా వదిలిపెట్టరు!

Airtel యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా యాపిల్ టీవీ+, iCloud ఫ్రీ!

ఎప్పుడూ అదే గ్రీన్ స్క్రీన్‌తో బోర్ అనిపిస్తుందా? వాట్సప్‌లో రాబోతున్న ఈ కొత్త థీమ్స్ చూశారా?

ఏడాదంతా ఫ్రీ కాల్స్, 5G డేటా.. Airtel, Jio, Viలో బెస్ట్ ప్లాన్స్ ఇవే.. ఎంజాయ్ పండగో!

అమెజాన్‌ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో ఊహించని ఆఫర్లు.. ఈ కార్డ్ గనుక ఉంటే సగానికి పైగా డిస్కౌంట్!

Big Stories

Advertisement
×