E-Paper
Advertisement

145 కి.మీ రేంజ్ తో హోండా కొత్త ఈవీ.. QC3 లుక్ ఏముంది భయ్యా!

145 కి.మీ రేంజ్ తో హోండా కొత్త ఈవీ.. QC3 లుక్ ఏముంది భయ్యా!
Advertisement

Honda QC3 Launched: భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో హోండా మరో అడుగు ముందుకేసింది. కంపెనీ తాజాగా కొత్త హోండా QC3 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1.35 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. కుటుంబ అవసరాలు, రోజువారీ నగర ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ స్కూటర్‌లో 3kWh బ్యాటరీ, మంచి స్టోరేజ్, కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి. హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఇది మూడో మోడల్‌ గా నిలిచింది.

తొలుత ఐదు నగరాల్లోనే!

QC3ను తొలుత దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడం లేదు. ఢిల్లీ, ఆగ్రా, కటక్, సూరత్, కొల్లం నగరాల్లో మాత్రమే మొదటి దశలో అమ్మకాలు ప్రారంభించనుంది. ఆ తర్వాత దశలవారీగా ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నట్లు హోండా తెలిపింది. ఈ నగరాల్లో ఉన్న కస్టమర్లు హోండా వెబ్‌ సైట్, సమీప రెడ్‌వింగ్ డీలర్‌షిప్‌లో రూ.5,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. డెలివరీలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

3kWh బ్యాటరీ.. 145 కి.మీ. రేంజ్!

Advertisement

QC3లో 3kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది 145 కి.మీ. IDC రేంజ్ ను అందిస్తుంది. మరోవైపు హోండా అధికారిక పోర్ట్‌ ఫోలియో ప్రకటనలో 151 కి.మీ. IDCగా వెల్లడించింది. 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 2 గంటల 40 నిమిషాలు పడుతుంది. పూర్తి ఛార్జింగ్‌ కు దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది.

32 లీటర్ల బూట్ స్పేస్

రోజువారీ ఉపయోగానికి అనువుగా QC3ను రూపొందించడంలో స్టోరేజ్‌కు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. సీటు కింద 32 లీటర్ల స్టోరేజ్ ఉంది. హోండా ప్రస్తుత QC1లోని 26 లీటర్ల స్థలం కంటే ఎక్కువ. కుటుంబ ప్రయాణాల్లో హెల్మెట్లు, బ్యాగులు, ఇతర వస్తువులను పెట్టుకోవడానికి ఈ స్థలం ఉపయోగపడుతుంది.

TFT స్క్రీన్‌తో కనెక్టివిటీ!

Advertisement

ఫీచర్ల విషయానికి వస్తే.. QC3లో 5 అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. దీనికి హోండా రోడ్ సింక్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ ఫీచర్ కూడా అందించారు. రోజువారీ ప్రయాణాల్లో స్కూటర్‌ను మరింత సులభంగా ఉపయోగించుకునేలా ఈ ఫీచర్లను రూపొందించారు.

మార్కెట్లో గట్టి పోటీ

రూ.1.35 లక్షల ధరతో QC3కు ఇప్పటికే ఉన్న పలు ఎలక్ట్రిక్ స్కూటర్ల నుంచి పోటీ ఎదురుకానుంది. ఈ ధర పరిధిలో టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, విడా VX2 Plus, ఏథర్ లాంటి మోడళ్లు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ వినియోగదారులను ఆకట్టుకోవడానికి రేంజ్, బూట్ స్పేస్, కనెక్టివిటీ లాంటి అంశాలను హోండా QC3లో తీసుకొచ్చింది.  దీంతో భారత EV మార్కెట్లో హోండా తన వాటాను పెంచుకోవడానికి ఈ మోడల్ కీలకంగా మారే అవకాశం ఉంది.

Read Also: అమ్మకాల్లో బిగాస్ దూకుడు.. లక్షకు చేరువలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

Tags

Related News

కర్ణాటకలో E20 పెట్రోల్ కల్తీ.. 20 శాతానికి బదులు 31% ఇథనాల్.. ఆధారాలతో బయటపెట్టిన మంత్రి!

మహీంద్రా నుంచి ఒకేసారి 3 కొత్త SUVలు.. మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

మారుతి కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. గ్రాండ్ విటారాపై ఏకంగా రూ.1.36 లక్షల తగ్గింపు!

బజాజ్ చేతక్ సంచలనం.. 10 లక్షలు దాటిన అమ్మకాలు!

సన్ షీల్డ్, పిన్‌లాక్ లెన్స్‌ తో కొత్త స్టీల్‌బర్డ్ హెల్మెట్.. ధర ఎంత అంటే?

ఇన్నోవా క్రిస్టా లిమో వచ్చేసింది.. కొత్త ఎడిషన్ ప్రత్యేకతలు ఇవే!

విన్‌ఫాస్ట్ MPV 7 ధర భారీగా తగ్గింపు.. ఏకంగా రూ.4.10 లక్షలు కట్..

కొత్త మహీంద్రా స్కార్పియో ఎన్ ఎడిషన్ వన్.. లుక్ అదిరింది గురూ!

Big Stories

Advertisement
×