E-Paper
Advertisement

15 ఏళ్ల తర్వాత నంది అవార్డులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

15 ఏళ్ల తర్వాత నంది అవార్డులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
Advertisement

Nandi Awards:తెలుగు చిత్ర సీమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో నంది అవార్డు చాలా ప్రధానమైనది. సినీ , టీవీ, కళారంగాలలో విశిష్ట సేవ కనబరిచిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఈ నంది అవార్డులను అందిస్తూ ఉంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన నంది అవార్డుల ప్రధానోత్సవం 2011 లోనే ఆగిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం చొరవతో 15 ఏళ్ల తర్వాత ఏపీ ప్రభుత్వం కళాకారులను అభినందిస్తూ.. ఈ నంది అవార్డులను అందించేందుకు ముందడుగు వేసింది. సినీ , టీవీ రంగాలలో కళాకారులకు నంది అవార్డులు ఇచ్చేందుకు అనుమతులు జారీ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నంది అవార్డులు..

ముఖ్యంగా ఎఫ్డిసి చైర్మన్ పి భరత భూషణ్ నంది అవార్డులపై గతంలో ప్రకటించిన 2012 నుంచి 2024 వరకు.. అనగా 12 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నంది అవార్డులను అందివ్వడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులతో పాటు 2025 సంవత్సరపు అవార్డుల వేడుకను కూడా కలిపి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందుగా 2012 -2016 సంవత్సరాల మధ్య అందించే నంది, జాతీయ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని డిసెంబర్లో 2026లో విజయవాడలో నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. అలాగే 2017 నుండి 2024 వరకు ఏడాదికి 4 అవార్డులు (2 ప్రొడక్షన్ , 2 స్పెషల్ జ్యూరీ అవార్డులు) చొప్పున ఫిలిం, టీవీ అవార్డులను కూడా అందిస్తామని ఆయన తెలిపారు.

నవంబర్ లో ప్రకటన..

Advertisement

ఇక 2025 సంవత్సరానికి కూడా ఫిలిం , టీవీ నంది అవార్డులను ఇస్తామని , అయితే విజయవాడ వేదికగా ఫిలిం అవార్డులు, తిరుపతిలో నంది, టీవీ అవార్డుల వేడుకలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు . ఇకపోతే నంది అవార్డుల ఎంపికకు ఈ నెలలోనే కమిటీ ఏర్పాటు చేసి, నవంబర్లో అవార్డులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇక డిసెంబర్లో నంది ఫిలిం, టీవీ అవార్డుల ప్రధానోత్సవం వేడుకలను నిర్వహిస్తాము .

నంది ఫిలిం అవార్డులు..

చలన చిత్రాలు, జాతీయ సమైక్యతపై చలనచిత్రాలు, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాలు, విద్యావిషయక చిత్రాలు, తెలుగు సినిమా పై రచించిన ఉత్తమ రచనలు తదితర విభాగాలలో అవార్డులు ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు.

ఫిలిం విభాగంలో మొత్తం 46 అవార్డులు..

Advertisement

ఉత్తమ ప్రదర్శన, ద్వితీయ ఉత్తమ ప్రదర్శన, తృతీయ ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి తదితర విభాగాల్లో అవార్డులు అందిస్తాం.

గోల్డ్ మెడల్స్ కూడా..

నంది ఫిల్మ్ అవార్డు గ్రహీతలకు బంగారు, వెండి, కాంస్య, తామ్ర నందులతో పాటు ప్రశంసా పత్రం, నగదు పారితోషికం అందిస్తాం. వివిధ కేటగిరీలలో 8 గోల్డ్ మెడల్స్ కూడా అందించనున్నాం.

జాతీయ చలనచిత్ర అవార్డులు .. ప్రైజ్ మనీ..

ఎన్.టి.ఆర్. నేషనల్ ఫిల్మ్ అవార్డు – రూ.5 లక్షలు
బి.ఎన్. రెడ్డి నేషనల్ ఫిల్మ్ అవార్డు – రూ.2 లక్షలు
నాగిరెడ్డి–చక్రపాణి నేషనల్ ఫిల్మ్ అవార్డు – రూ.2 లక్షలు
రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు – రూ.2 లక్షలు
జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలకు జ్ఞాపిక, సన్మాన పత్రంతో పాటు నగదు పారితోషికం అందిస్తాం.

నంది టీవీ అవార్డులు..

టెలి చిత్రాలు, టీవీ ఫీచర్స్, టీవీ మెగా సీరియల్స్, టీవీ డైలీ సీరియల్స్, టీవీ బాలల చిత్రాలు, టీవీ డాక్యుమెంటరీ చిత్రాలు, టీవీ సామాజిక సంబంధిత చిత్రాలు, టీవీ విద్యా విషయక చిత్రాలు తదితర విభాగాల్లో అవార్డులు అందిస్తాం.

ALSO READ: ది ప్యారడైజ్’ మూవీకి సెన్సార్ షాక్.. మరీ ఇంత వయలెన్స్?

టీవీ విభాగంలో మొత్తం 48 అవార్డులు..

ప్రథమ, ద్వితీయ ఉత్తమ టెలి ఫిల్మ్, టెలి ఫీచర్స్, మెగా టీవీ సీరియల్, డైలీ టీవీ సీరియల్, టీవీ బాలల చిత్రం తదితర విభాగాల్లో అవార్డులు అందించనున్నారు. అలాగే ఉత్తమ నటుడు, నటి, సహాయ నటుడు, హాస్య నటుడు, హాస్య నటి, ప్రతినాయకుడు, బాలల నటుడు, నటి, దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత తదితర విభాగాల్లో అవార్డులు అందించనున్నారు.

నంది టీవీ అవార్డు గ్రహీతలకు బంగారు, వెండి, కాంస్య, తామ్ర నందులతో పాటు ప్రశంసాపత్రం, నగదు పారితోషికం అందిస్తాం. తెలుగు సినిమా, టెలివిజన్ రంగానికి చెందిన కళాకారులు, సాంకేతిక నిపుణులను గౌరవించడమే నంది అవార్డుల ప్రధాన ఉద్దేశ్యం అంటూ కందుల దుర్గేష్ తో పాటు ఎఫ్ డీ సీ చైర్మన్ పి.భరత భూషణ్ కూడా స్పష్టం చేశారు.

Related News

తాతయ్యకు అదిరిపోయే కానుక ఇచ్చిన ఉపాసన.. వెల్లువిరిసిన ఆధ్యాత్మికత!

బ్లడ్ అమ్ముకుని సంపాదించాల్సిన ఖర్మ నాకేంటి? చిరు షాకింగ్ కామెంట్స్!

కొడుకు పేరును రివీల్ చేసిన నారా రోహిత్.. పేరుకు అర్థం ఇదేనా?

మైనర్ బాలికపై దారుణం.. దిశా పటానీ సిస్టర్ ఫైర్!

రణబాలి ‘ఏందయ్యా సామి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్!

నాని ‘ది ప్యారడైజ్’కు రూ.200 కోట్ల టార్గెట్.. సినిమా ఏం చేస్తుందో?

ఇంత యంగ్‌గా ఎలా ఉంటారు? చిరంజీవి చెప్పిన ఆన్సర్ ఇదే!

Big Stories

Advertisement
×